గరికపర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గరికపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
గరికపర్రు is located in Andhra Pradesh
గరికపర్రు
గరికపర్రు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′42″N 80°49′51″E / 16.345091°N 80.830859°E / 16.345091; 80.830859
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ ఎన్.రాజేంద్ర
జనాభా (2011)
 - మొత్తం 2,945
 - పురుషులు 1,493
 - స్త్రీలు 1,452
 - గృహాల సంఖ్య 880
పిన్ కోడ్ 521165
ఎస్.టి.డి కోడ్ 08676

గరికపర్రు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 165., యస్.టీ.డీ.కోడ్ = 08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టంమీద 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పెనమకూరు, కుమ్మమూరు, కపిలేశ్వరపురం, అమీనపురం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

తోట్లవల్లూరు, పమిడిముక్కల, కంకిపాడు, కొల్లిపర

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వుయ్యూరు, మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 32 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో 130 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. గత సంవత్సరం, ప్రభుత్వం ఈ పాఠశాలలో 8వ తరగతికి అనుమతిని ఇచ్చింది. సర్వశిక్ష అభియాన్ నిధులు మరియూ దాతల సహకారంతో ఈ పాఠశాలకు పలు వసతులు సమకూరుచున్నవి. [6]

శ్రీ చులిప్స్, గరికపర్రు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

పాల శీతలీకరణ కేంద్రo[మార్చు]

ఈ గ్రామములో, నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ అధ్వర్యలో, శ్రీ కృష్ణా మిల్క్ యూనియన్ సంస్థ సహకారంతో, 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రాన్ని 2015, సెప్టెంబరు-1వ తేదీనాడు, లాంఛనంగా ప్రారంభించారు. ఈ కేంద్రంలో రోజుకు ఐదువేల లీటర్ల పాలను నిలువచేయగలరు. ఈ కేంద్రానికి కావలసిన 10 సెంట్ల భూమిని గ్రామ పంచాయతీ ఉచితంగా అందజేసినారు. [8]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ఎన్.రాజేంద్ర సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచ్‌గా శ్రీ వీరంకి శ్రీనివాసరావు ఎన్నికైనారు. [7]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. గరికపర్రు గ్రామంలోని వీరంకివారి ఇలవేలుపు అయిన అంకమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో రెండవ శని, ఆదివారాలలో రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ జాతరకు వివిధ ప్రాంతాలలో ఉన్న "వీరంకి" వంశస్థులు వచ్చి, అమ్మవారిని దర్శించుకుంటారు. [3]
  2. శ్రీ ఉమారామలింగేశ్వరస్వామివారి ఆలయం:-గరికపర్రు గ్రామశివారున ఉన్న వేణుగోపాలపురంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015, మే నెల-10వతేదీ ఆదివారంనాడు విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10-35 గంటలకు శ్రీ లక్ష్మి, శ్రీ సరస్వతి, శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ఠలు, భక్తుల సమక్షంలో వైభవంగ నిర్వహించారు. ప్రతిష్ఠించిన వివిధ విగ్రహాలను పలువురు దాతలు అందజేసినారు. అనంతరం ఆలయం వద్ద, అన్నసమారాధన నిర్వహించారు. [4]
  3. శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు, నాలుగురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. హనుమజ్జయంతి రోజున, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [5]
  4. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 12వ వార్షికోత్సవ ఉత్సవాలు, 2015, నవంబరు-6వ తేదీ శుక్రవారంనాడు వైభవంగ నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ నిర్వహించారు. [9]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామవాసులతో ఏర్పాటయిన రాజీవ్ బ్రదర్స్ అను డప్పు కళాకారుల బృందం, దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చి ప్రముఖులచే ప్రశంసలు పొందినది. చైనా, మలేషియా దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, హైదరాబాదులో జరిగిన జీవవైవిధ్య మహాసభలలోనూ వీరు తమ ప్రదర్శనలిచ్చారు. వీరికి 2000 లో రాష్ట్రపతి బహుమతి, 2008 లో శిల్పా పురస్కారం అందినవి. 2009 లో వీరి ప్రదర్శన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయినది. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,945 - పురుషుల సంఖ్య 1,493 - స్త్రీల సంఖ్య 1,452 - గృహాల సంఖ్య 880;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3149.[2] ఇందులో పురుషుల సంఖ్య 1559, స్త్రీల సంఖ్య 1590, గ్రామంలో నివాసగృహాలు 891 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 301 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Garikaparru". Retrieved 18 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలిలింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013, జూలై-8; 8వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, మే-10; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, మే-11; 38వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, మే-12; 37వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015, మే-17; 40వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, జూలై-25; 29వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-1; 23వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-7; 27వపేజీ.