గరికపాడు (కాకుమాను మండలం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గరికపాడు (కాకుమాను మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కాకుమాను
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి చలంచర్ల బ్రహ్మమ్మ
జనాభా (2011)
 - మొత్తం 4,218
 - పురుషుల సంఖ్య 2,081
 - స్త్రీల సంఖ్య 2,137
 - గృహాల సంఖ్య 1,271
పిన్ కోడ్ 522 112
ఎస్.టి.డి కోడ్ 08643

గరికపాడు (Garikapadu) గుంటూరు జిల్లా కాకుమాను మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 112., ఎస్.టి.డి.కోడ్ = 08643.

గ్రామ విశేషాలు[మార్చు]

ఇది కాకుమాను మండలంలో ఉన్న పెద్ద గ్రామము, మేజర్ పంచాయతీ. ఇది కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ (కెనాల్) ఐన బకింగ్ హాం కాలువ (కొమ్మమూరు కాలువ)కు కుడి ఒడ్డున ఉంది.

ఈ ఊరికి తూర్పున బండ్లవారి పాలెం మరియు తెలగాయ పాలెం, పశ్చిమాన భల్లూఖానుడు పాలెం (బీ.కె.పాలెం), ఉత్తరాన చినలింగాయ పాలెం, ఈశాన్యంలో పాండ్రపాడు, దక్షిణ దిక్కున అప్పాపురం, నైరుతి దిక్కున కాకుమాను గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామము చక్కటి ప్రకృతి దృశ్యములకు ప్రసిద్ధి పొందింది. గ్రామాన్ని ఒరుసుకొంటూ ప్రవహించే కృష్ణా నది పశ్చిమ కాలువ లేదా బకింగ్ హాం కాలువ విజయవాడ నుండి చెన్నపట్నము వరకు కీలక జలమార్గముగా ఒకప్పుడు ప్రసిద్ధి పొందింది.

చరిత్ర ఇది చారిత్రక ప్రశస్తి కలిగిన గ్రామం. శాతవాహనుల, మరియు ఇక్ష్వాకుల కాలం నాటిది. ఆ కాలమందు ఇది ఒక పల్లె జనపదముగా ప్రసిద్ధము. రాయల కాలమందు ఇది ఒక మజిలీగా ఉండెడిది. రాయల తూర్పు దండయాత్రలలోనూ, కళింగ దండయాత్రలలోనూ ఇది గుంటూరు ప్రాంతమందు ఒక ముఖ్య వ్యూహాత్మక ప్రాంతముగా నుండెడిది. రాయల శాసనములయందు మరియు జన బాహుళ్యమునందు ప్రాచుర్యము పొందిన వ్యవహారములను బట్టి, దీని ప్రస్తుత నామధేయము శ్రీకృష్ణ దేవరాయల నాటిదనియు మరియు రాయలవారే ఈ జనపదమునకు గరికపాడు అని పేరు పెట్టెననియు తెలియుచున్నది. శ్రీకృష్ణదేవరాయల పాలన తరువాత ఈ ప్రాంతము అద్దంకి మండలాధీశుల చేతిలోకి వెళ్ళింది. తరువాత కొండవీటి రాజుల పాలనలో కూడా కొంత కాలము ఉంది. 18వ శతాబ్దపు చివరి కాలములో ఈ ప్రాంతము అమరావతి మరియు ధాన్యకటకము లేదా ధరణికోటను రాజధానిగా పాలించిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుని పాలనలో కొంతకాలము ఉంది. తరువాతి కాలంలో డచ్ మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏలుబడిలోకి వెళ్ళింది. ఆర్థిక వ్యవస్థ

 • గరికపాడు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం. కృష్ణా నది నుండి వచ్చే కొమ్మమూరు కాలువ ప్రధాన నీటి వనరు.

ప్రధాన పంటలు[మార్చు]

పరిశ్రమలు[మార్చు]

 • జల రవాణా కీలకపాత్ర వహించిన రోజులలో ఈ గ్రామము ఒక ముఖ్య వ్యాపార రేవు మరియు లంగరు కేంద్రము. గ్రామంలో రైస్ ప్రోసెసింగ్ పరిశ్రమ మాత్రమే చెప్పుకోదగిన పరిశ్రమ. ఇంకా పశుగణములకు గుంటూరు ప్రాంతమందు ప్రసిద్ధి.
పశు సంపద
 • ఈ గ్రామంలో నేటికిని ఒంగోలు జాతి పశు సంపద మరియు మేలు జాతి గేదెలు ఉన్నాయి. పశు పోషణ ఇక్కడి ప్రజలకు ఒక ప్రధాన ఆదాయ వనరు.

విద్య మరియు అక్ష్యరాస్యత

 • గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. 1975లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నెలకొల్పారు. గ్రామంలో రక్షిత మంచినీటి పథకం కలిగి ఉంది. కొమ్మమూరు కాలువ గ్రామానికి ప్రధాన నీటి వనరు.

దర్శనీయ స్థలాలు

 • గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి గుడి ప్రసిద్ధి గాంచింది. ఇందలి ప్రధాన దైవం శ్రీ వేణుగోపాలస్వామి. ఈ గుడిలో ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఈ గుడిలో శరన్నవరాత్రులు మిక్కిలి కన్నులపండుగా జరుగును. గ్రామ చెరువు వద్ద రామాలయం ఉంది. ఇక్కడ శ్రీరామనవమి నాడు జరిగే సీతారామ కల్యాణము కన్నుల పండుగగా జరుగుతుంది.క్రొత్తగా వినాయకుని గుడి కట్టారు.
 • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి చలంచర్ల బ్రహ్మమ్మ, సర్పంచిగా ఏకగ్రీవం ఎన్నికైనారు. [1]

ప్రధాన సమస్యలు నల్లమడ డ్రెయిన్కు ఏటా వచ్చే వరద ఇక్కడి ప్రధాన సమస్యల్లో ఒకటి. ప్రతి ఏటా ఈ వరదల వలన వేలాది ఎకరాలలో వరి పంట మునిగి పోతుంది. గ్రామంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చెయ్యవలసిన ఆవశ్యకత ఉంది. ఆట స్తలము ఆవశ్యకత ఉంది.

గ్రామ గణాంకాలు

 • 2001 నాటి భారత ప్రభుత్వ జనగణన వారి జనాభా వివరాలు:
 • జనాభా: 4587
 • పురుషుల సంఖ్య: 2313
 • స్త్రీల సంఖ్య: 2274
 • అక్షరాస్యత శాతం: 70.21
 • పురుషుల అక్షరాస్యత: 76.01
 • స్త్రీల అక్షరాస్యత: 64.44
 • నివాసగృహాలు 1264
 • విస్తీర్ణం 2407 హెక్టారులు
జనాభా (2011) - మొత్తం 4,218 - పురుషుల సంఖ్య 2,081 - స్త్రీల సంఖ్య 2,137 - గృహాల సంఖ్య 1,271

Map of Garikapadu : http://www.mygarikapadu.blogspot.com

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు సిటీ, జూలై 15,2013.8వ పేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, సెప్టెంబరు-4; 9వపేజీ.