గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్

వికీపీడియా నుండి
(గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
Balakrishna prasad garu.jpg
వ్యక్తిగత సమాచారం
రంగం కర్నాటక సంగీతం
వృత్తి శాస్త్రీయ సంగీత గాయకుడు మరియు స్వరకర్త
వాద్యపరికరం తంబురా
క్రియాశీల కాలం 1970- ఇప్పటి వరకు
వెబ్‌సైటు http://www.facebook.com/gbkprasad/, http://sites.google.com/site/gbkprasad/biodata

గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (జననం నవంబర్ 9, 1948) పేరొందిన సంగీత విద్వాంసులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుంది 2006 వరకు ఆస్థాన గాయకులుగా ఉన్నాడు. అన్నమాచార్య సంకీర్తనలకు సంప్రదాయ సంగీత స్వరకల్పనలో ఆద్యుడు. ఆయన 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చాడు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలొ, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.

బాల్యం[మార్చు]

ఆయన కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాడు. ఆల్ ఇండియ రేడియోలో ఏ-గ్రేడ్ గాయకుడు. ఆయన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలలో ప్రత్యేకత సంపాదించాడు. కేవలం సంగీతం నేర్చుకొవటమే కాకుండా, అన్నమాచార్య సంకీర్తనల స్వరకల్పనలోనూ, వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ, సిడి రికార్డింగ్ లలోనూ పాలుపంచుకున్నాడు. ఆయన 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్ లో గాయకుడిగా చేరాడు. అన్నమయ్య సంగీత,సాహిత్యాలను ప్రజలకు చేరువ చెయ్యడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్, ఆయన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించే చక్కని వేదికగా ఉపయోగపడింది. అక్కడ చేరినప్పటినుండి, 2006లో పదవీ విరమణ వరక్లు ఆయన ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యులుగా ఉన్నారు. వివిధ స్థాయులలో ఈ సంస్థను గొప్ప సాంసృతిక సంస్థగా తీర్చిదిద్దటానికి కృషి చేశాడు. నాలుగు దశాబ్ధాల నాదోపాసనలో సంపూర్ణ విశ్వాసంతో, అంకిత భావంతో, పరిపూర్ణత కోసం నిరంతరం పరిశ్రమించాడు. 6000లకు పైగా కచేరీలు చేశాడు. 600లకు పైగా అన్నమాచార్య కీర్తనలకు స్వరకలపన చేశాడు.తితిదే కోసం ఆడియో రికార్డింగ్ లు చేశాడు, స్వరకల్పనతో కూడిన పుస్తకాలను ప్రచురించాడు. అన్నమాచార్య కృతులకు ఇంకా ప్రాచుర్యం కల్పించడానికి తరగతులు నిర్వహించాడు.

ప్రత్యేకతలు[మార్చు]

Garimella Balakrishna Prasad
 • సంకీర్తన యజ్ఞ ప్రక్రియకు ఈయన ఆద్యుడు. ఒక గాయకుదు ఒక రోజుకు పైగా ఒకే వేదికపై ఎన్నో పాటలు పాడటం ఈ కార్యక్రమ ప్రత్యేకత.1997 లో విశాఖపట్నంలో, 1999లో విజయవాడలో 200 పైగా పాటలతో, 2001లో తిరుపతిలో 300 పైగా పాటలతో, 2003, 2007లో హైదరాబాదులో 200లకు పైగా పాటలతో సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహించాడు.వీటిలో కొన్ని భాగాలు 'మా' టీవీలో, 'భక్తీ టీవీలో ప్రసారం అయ్యాయి.
 • భక్తి టీవీ "హరి సంకీర్తనం" కార్యక్రమం ద్వారా 100కు పైగా అన్నమాచార్య సంకీర్తనలను సామాన్యులకు నేర్పాడు. ఈయన రెండవ కుమారుడు జి.వి.యన్. అనిలకుమార్ ఈ కార్యక్రమంలో విద్యార్థిగా పాల్గొనటం గుర్తించదగ్గది. ఎంతో మంది సంగీత ప్రియులు ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణప్రసాద్ నుండి నేరుగా నేర్చుకొనగలిగారు.
 • లక్షగళార్చన: మే 10, 2008లో సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో లక్షమందికి పైగా గాయకులు బాలకృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అసాధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలికాన్ ఆంధ్ర (అమెరికా తెలుగు సంస్థ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని సం యుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమం భారతదేశంలోని అనేక చానెల్స్ లో ప్రత్యక్షప్రసారం చేయబడింది.
 • 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు.
 • తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన అసాధారణ సేవలకు గాను వెండిపతకం, ప్రశంసా పత్రంతో సత్కరించింది.
 • స్వయంగా వాగ్గేయకారుడైన ఆయన హనుమంతునిపై "ఆంజనేయ కృతిమాల" (21 కృతులు), వినాయకునిపై (50 కృతులు), నవగ్రహాలపై , ఇతర దేవతలపై కృతులు రచించాడు. ఆయన స్వంత కృతులు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని సంగీత స్వరాలతో సహా ప్రచురించబడ్డాయి.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన జి.రాధ ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం- జి.యస్.పవన కుమార్, జి.వి.యన్.అనిల కుమార్. ఈయన సినిమా గాయని యస్.జానకి మేనల్లుడు.

డిస్కోగ్రఫీ[మార్చు]

అన్నమాచార్య సంకీర్తనలు, తి.తి.దే రికార్డింగ్ లు[మార్చు]

ఆయన తితిదే కోసం 24 రికార్డింగ్లు చేశారు.

 • అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర గీతమాలిక
 • దేశి కవితా గానం
 • తత్వ నీతి సారం
 • అన్నమయ్య వెంకటాద్రి వెన్నెల
 • అన్నమయ్య సంకీర్తనలహరి
 • అన్నమయ్య హరి శరణాగతి
 • అన్నమయ్య రామాంజనేయలహరి
 • అన్నమయ్య హరి సంకీర్తనామృతం
 • అన్నమయ్య హరిపాద మకరందం
 • అన్నమయ్య అనంతరాగాలు
 • పలుకు తేనెల తల్లి ( 2 భాగాలు)
 • అన్నమయ్య సంకీర్తన పాలవెల్లి
 • శ్రీ రామాంజనేయం
 • శ్రీనివాస శృతి భూషణం
 • అన్నమయ్య వేంకటాద్రి నృసింహుడు
 • అన్నమయ్య అలమేలుమంగా విలాసం
 • అన్నమయ్య సంకీర్తన జ్ఞానయజ్ఞం
 • అన్నమయ్య నృసింహ సంకీర్తనం
 • అన్నమయ్య సంకీర్తన తారకం
 • అన్నమయ్య సంకీర్తన ప్రభ
 • అన్నమయ్య సంకీర్తన బృందావనం
 • అన్నమయ్య సంకీర్తన ప్రసాదం
 • అన్నమయ్య హరిపాద సిరులు
 • నృసింహ పాదధ్వని

అన్నమయ్య సంకీర్తనలు, ఇతర రికార్డింగులు[మార్చు]

ఆయన 36 ఇతర రికార్డింగులు చేశారు.

 • అన్నమయ్య పారిజాతాలు
 • అన్నమయ్య సంకీర్తన సుధ
 • భావయామి
 • అన్నమయ్య సంకీర్తన చంద్రిక
 • అన్నమయ్య పద మాధురి
 • అన్నమయ్య సంకీర్తన పుష్పాలు
 • అన్నమయ్య సంకీర్తన పుష్పయాగం
 • తిరునివాళి
 • శ్రీహరి వైభవం
 • అన్నమయ్య సంకీర్తన పదనిధి
 • అన్నమయ్య సంకీర్తన మణిహారం
 • అన్నమయ్య విన్నపాలు
 • అన్నమయ్య మధురగానం
 • అన్నమయ్య వేంకటాద్రి గోవిందుడు
 • అన్నమయ్య శ్రీకృష్ణ పదహేళ
 • అన్నమయ్య సంకీర్తన వేదనాదం
 • అన్నమయ్య ఆంజనేయ శృతి సంజీవని
 • అన్నమయ్య సంకీర్తన సామగానం
 • అన్నమయ్య సంకీర్తన ప్రణవం
 • అన్నమయ్య పద సింగారం
 • అన్నమయ్య శ్రీనిధి సంకీర్తనం
 • అన్నమయ్య అలమేలుమంగ వైభవం
 • కృష్ణార్పణ
 • అన్నమయ్య పాటలు
 • అన్నమయ్య విష్ణు గానం
 • అన్నమయ్య సంకీర్తన శారద
 • అన్నమయ్య సంకీర్తన సంజీవని
 • Flowers at his feet
 • అన్నమయ్య సంకీర్తన భారతి
 • సప్తగిరి సంకీర్తనలు
 • హరి సిరిపదహేళి
 • అన్నమయ్య అచ్యుత శరణు
 • అన్నమయ్య పద రత్నాలు
 • అన్నమయ్య నృసింహ సంకీర్తనం

Bibliography[మార్చు]

T.T.D. Publications[మార్చు]

అన్నమయ్య సంకీర్తనలకు ఆయన స్వరకల్పన తితిదే వారిచే ప్రచురించబడింది.

 • 1993 - అన్నమయ్య సంకీర్తన స్వర సంపుటి(తెలుగు)
 • 1997 - అన్నమయ్య సంకీర్తన మంజరి (తమిళం)
 • 1999 - అన్నమయ్య సంకీర్తన సంకీర్తనం (తెలుగు)
 • 2000 - అన్నమయ్య సంకీర్తన సౌరభం (తెలుగు)
 • 2001 - అన్నమయ్య సంకీర్తన రత్నావళి (తెలుగు)
 • 2001 - అన్నమయ్య సంకీర్తన స్వరావళి (తమిళం)
 • 2003 - అన్నమయ్య సంకీర్తన ప్రాథమికి(తెలుగు)
 • 2004 - అన్నమయ్య సంకీర్తన మహతి (తెలుగు)

ఇతర ప్రచురణలు[మార్చు]

 • కృష్ణ రవళి (2 భాగాలు) (తెలుగు)
 • ఆంజనేయ కృతి మణిమాల (తెలుగు)
 • అన్నమయ్య సంకీర్తన సంజీవని (తెలుగు)

సూచికలు[మార్చు]

యితర లింకులు[మార్చు]