గరిమెళ్ళ రామమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గరిమెళ్ళ రామమూర్తి
Garimella Rammurthy.JPG
గరిమెళ్ళ రామమూర్తి
జననంజూలై 4, 1936
విజయనగరం
మరణంజూన్ 3, 2004
ప్రసిద్ధినటులు, నాటకసంస్థ నిర్వాహకులు
తండ్రిజగన్నాధరావు
తల్లినిర్మల

గరిమెళ్ళ రామమూర్తి (జూలై 4, 1936 - జూన్ 3, 2004) నటులు, నాటకసంస్థ నిర్వాహకులు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

నిర్మల, జగన్నాధరావు దంపతులకు విజయనగరం లో జూలై 4, 1936 లో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఎం.ఏ పూర్తి చేశారు.

ఉద్యోగం[మార్చు]

ఏ.జి. ఆఫీసులో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా, జాయింట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గా, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ, ఆంధ్రప్రదేశ్ లో పదవీ విరమణ చేశారు.

నాటక ప్రస్థానం[మార్చు]

పదేళ్ల వయసులోనే నటుడిగా ప్రారంభించి అసాధారణమైన నటనతో 1957లో రాఘవ కళా పరిషత్ నుండి ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు. కొర్రపాటి గంగాధరరావు రచించిన నాబాబు నాటకంలో నటించారు. తర్వాత 1958లో ప్రొ. కొర్లపాటి శ్రీరామమూర్తి రచించిన నటన నాటకంలో నటనకుగాను ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతి బంగారు పతకం పొందారు. నటరాజ కళా సమితి, సినీ నటులు జె.వి. సోమయాజులు, జె.వి. రమణమూర్తి గార్లతో కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు.

హైదరాబాద్ కి వచ్చిన తర్వాత విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్ వారి మరో మొహెంజొదారో నాటకం ప్రదర్శిచుటలో ముఖ్య పాత్ర నిర్వహించారు.

పురస్కారాలు[మార్చు]

 1. జూలేరి వీరేశలింగం సాంస్కృతిక బహుమతి (1986)
 2. ఉగాది పురస్కారం (మద్రాస్ తెలుగు అకాడమీ 1992)
 3. వనారస గోవిందరావు పురస్కారం (1994)
 4. రంగస్థలి నరసరావుపేట పురస్కారం

నిర్వహించిన బాధ్యతలు[మార్చు]

 1. ఎగ్జిక్యూటీవ్ మెంబర్, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ (1975-80)
 2. సభ్యులు, ఆంధ్రప్రదేశ్ నృత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ (1980-83)
 3. నిర్వాహకులు, మొదటి ప్రపంచ తెలుగు సమావేశాలు (1975)
 4. సాంస్కృతిక సలహాదారులు, ద్వితీయ ప్రపంచ తెలుగు సమావేశాలు, (కౌలాలంపూర్, 1980)
 5. కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వోదోగుల సంక్షేయ సమితి నాటక వార్షికోత్సవాలు (18 సంవత్సరాలు)
 6. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటీవ్, భారత సాంస్కృతిక ఐక్యతా సమితి
 7. నిర్వాహకులు, స్పిరిట్ ఆఫ్ యూనిటీ కన్సర్ట్ వారి 24 ఉత్సవాలు
 8. ముఖ్య సలహాదారలు, సురభీ థియేటర్ గ్రూప్ (25 సంవత్సరాలు)
 9. నిర్వాహకులు, రసరంజని సాంస్కృతిక సంస్థ నాటకోత్సవాలు (10 సంవత్సరాలు)
 10. ఉపన్యాసకులు, భారతీయ కళలు అనే అంశంపై భారతీయ కౌన్సిల్ ద్వారా సాంస్కృతిక బృందం నిర్వాహణ (మారిషస్,1993)
 11. నిర్వాహకులు, కూచిపూడి కళాకారిణి శ్రీమతి శోభ నాయుడు నృత్య ప్రదర్శన (అమెరికా, వెస్టిండీస్)
 12. అనుబంధ కార్యదర్శి, ఆంధ్ర నాటక కళా సమితి
 13. జ్యూరి సభ్యులు, ఆకాశవాణి జాతీయ పురస్కారాలు (1996)
 14. సభ్యులు, ఆంధ్రప్రదేశ్ థియేటర్ డిజైన్ సమితి

సురభీ నాటక సంస్థలకు లింగంపల్లిలో ఇండ్ల స్థలాలు, లలిత కళా తోరణంలో నాటక ప్రదర్శనలకు స్థలం రావడానికి ఎంతో శ్రమించారు

మరణం[మార్చు]

గరిమెళ్ళ రామమూర్తి 2004, జూన్ 3 న మరణించారు.

మూలాలు[మార్చు]