గర్భాశయ అటనీ
| Uterine atony | |
|---|---|
| Video explanation of postpartum bleeding | |
| ప్రత్యేకత | Obstetrics |
| లక్షణాలు | Postpartum bleeding[1] |
| సంక్లిష్టతలు | Anemia, iron deficiency[1] |
| సాధారణ ప్రారంభం | Post delivery[1] |
| ప్రమాద కారకములు | Prolonged labor, precipitous labor, uterine distension (twins, polyhydramnios, large for gestational age), fibroids, BMI > 40, chorioamnionitis[1] |
| రోగనిర్ధారణ పద్ధతి | Examination[1] |
| భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | రిటెయిన్డ్ ప్లేసెంటా, lacerations, uterine inversion[1] |
| నివారణ | Oxytocin[1] |
| చికిత్స | Uterine massage, medications, packing, surgery[1] |
| ఔషధం | Oxytocin, methylergometrine, carboprost, misoprostol, prostaglandin E2[1] |
| తరుచుదనము | 2.5% of deliveries[1] |
ప్రసవం తర్వాత గర్భాశయం సరిగ్గా సంకోచించకపోవడాన్ని గర్భాశయ అటోనీ అంటారు.[1] లక్షణాలలో ప్రసవానంతర రక్తస్రావం కూడా ఉండవచ్చు, 75% కంటే ఎక్కువ కేసులలో ఇదే కారణం. సంక్లిష్టతలలో రక్తహీనత, ఇనుము లోపం ఉండవచ్చు.[1]
ప్రమాద కారకాలలో సుదీర్ఘ ప్రసవం, వేగవంతమైన ప్రసవం, గర్భాశయ విస్తరణ (కవలలు, పాలిహైడ్రామ్నియోస్, గర్భధారణ వయస్సుకు పెద్దదిగా ఉండటం ), ఫైబ్రాయిడ్లు, BMI > 40, కోరియోమ్నియోనైటిస్ ఉన్నాయి. ప్రసవం తర్వాత జరాయువు అతుక్కునే ప్రదేశానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను మూసివేయడానికి గర్భాశయ కండరాల సంకోచం అవసరం.[1] ప్రసవం తర్వాత గర్భాశయాన్ని చేతితో తడిమి చూడటం ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు.[1] ఇదే విధంగా కనిపించే ఇతర పరిస్థితులలో గర్భాశయంలో ఉండిపోయిన మాయ, గర్భాశయం తలక్రిందులు కావడం, ప్రసవ సంబంధిత గాయాలు ఉంటాయి.[1]
అధిక ప్రమాదం ఉన్నవారికి రక్త ఉత్పత్తులు సిద్ధంగా ఉండాలి. ఆక్సిటోసిన్ తో దాన్ని నివారించడానికి కూడా ప్రయత్నించవచ్చు.[1] చికిత్సలో గర్భాశయ మసాజ్, మందులు, గర్భాశయ ప్యాకింగ్ లేదా శస్త్రచికిత్స ఉండవచ్చు.[1] ఆక్సిటోసిన్, మిథైలెర్గోమెట్రిన్, కార్బోప్రోస్ట్, మిసోప్రోస్టోల్, ప్రోస్టాగ్లాండిన్ E2 వంటి మందులు ఉపయోగించవచ్చు.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2.5% ప్రసవాలలో గర్భాశయ అటోనీ సంభవిస్తుంది.[1] ప్రపంచవ్యాప్తంగా ప్రసవానంతర రక్తస్రావం తల్లి మరణాలకు గల 5 ప్రధాన కారణాలలో ఇదీ ఒకటి.
మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 Gill P, Patel A, Van Hook JW (2020). "Uterine Atony". StatPearls. Treasure Island (FL): StatPearls Publishing. PMID 29630290. Archived from the original on 2021-08-27. Retrieved 2020-10-19.
Text was copied from this source, which is available under a Creative Commons Attribution 4.0 International License Archived 2017-10-16 at the Wayback Machine.