గర్భాశయ క్యాన్సర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గర్భాశయ క్యాన్సర్
ఇతర పేర్లుయుటెరైన్ కాన్సర్
ప్రత్యేకతగైనకాలజీ,ఆంకాలజీ
లక్షణాలుఅసాధారణ యోని రక్తస్రావం లేదా పెల్విస్‌లో నొప్పి,యోనిలో మాస్
సాధారణ ప్రారంభం55,74 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు
రకాలుఎండోమెట్రియల్ క్యాన్సర్, గర్భాశయ సార్కోమా
కారణాలుఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 మధుమేహం, కుటుంబ చరిత్ర. గర్భాశయ సార్కోమాకు కారణాలు పెల్విస్‌కు రేడియేషన్ థెరపీ ఉండడం.
రోగనిర్ధారణ పద్ధతిఎండోమెట్రియల్ బయాప్సీ.పెల్విక్ పరీక్ష, మెడికల్ ఇమేజింగ్
చికిత్సశస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ
తరుచుదనము2015లో 3.8 మిలియన్లు
మరణాలు90,000

గర్భాశయ క్యాన్సర్ అంటే శరీరంలోని స్త్రీల గర్భాశయ ప్రధాన కణాల అసాధారణ పెరుగుదల వలన ఏర్పడుతుంది.[1] దీనిని యుటెరైన్ కాన్సర్ అంటారు. గర్భాశయం గోడల పొరల (లైనింగ్) నుండి మృదు కండరాల కణితులు, స్ట్రోమల్ కణితులు, గర్భాశయ కండరాలు లేదా సహాయక కణజాలం నుండి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఏర్పడుతుంది. [2]

రకాలు

[మార్చు]

ఈ కాన్సర్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. అవి -

 1. ఎండోమెట్రియల్ క్యాన్సర్: ఎండోమెట్రియల్ కార్సినోమా అంటారు. ఎండోమెట్రియం (గర్భాశయ లైనింగ్) గ్రంధులలోని కణాల నుండి ఉద్భవిస్తాయి.
  • వీటిలో సాధారణంగా సులభంగా చికిత్స చేయదగిన ఎండోమెట్రియోయిడ్ అడెనోకార్సినోమా.
  • అలాగే మరింత తీవ్రమైనది గర్భాశయ పాపిల్లరీ సీరస్ కార్సినోమా, గర్భాశయ క్లియర్-సెల్ కార్సినోమాలు.
  • ప్రాణాంతకమైన మిశ్రమ ముల్లెరియన్ కణితులు (వాటిని గర్భాశయ కార్సినోసార్కోమాస్ అని కూడా పిలుస్తారు) అరుదైన ఎండోమెట్రియల్ కణితులు, ఇవి గ్రంధి (కార్సినోమాటస్), స్ట్రోమల్ (సార్కోమాటస్) లు.[3]
 2. గర్భాశయ సార్కోమా (యుటెరైన్ సార్కోమా):
  • లియోమియోసార్కోమాలు గర్భాశయం (లేదా మైయోమెట్రియం) కండరాల పొర నుండి ఉద్భవిస్తుంది. అయితే ఈ లియోమియోసార్కోమాలు వేరు. గర్భాశయ లియోమియోమాస్ నుండి భిన్నంగా ఉంటాయి, ఇవి గర్భాశయంలోని నిరపాయమైన కణితులు.
  • ఎండోమెట్రియల్ స్ట్రోమల్ సార్కోమాస్ ఎండోమెట్రియం బంధన (కనెక్టివ్) కణజాలం నుండి ఉద్భవించాయి ఎండోమెట్రియల్ కార్సినోమాస్ కంటే చాలా తక్కువ సాధారణం.[4]

లక్షణాలు

[మార్చు]

ఎండోమెట్రియల్ క్యాన్సర్ లక్షణాలు - అసాధారణ యోని రక్తస్రావం లేదా పెల్విస్‌లో నొప్పి మొదలగునవి ఉంటాయి.[5] గర్భాశయ సార్కోమా వ్యాధి లో విపరీతమైన యోని రక్తస్రావం లేదా యోనిలో ద్రవ్యరాశిని (మాస్) వంటి లక్షణాలు ఉంటాయి. [6]

కారణాలు

[మార్చు]

ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు - ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 మధుమేహం, కుటుంబ చరిత్ర. [5] గర్భాశయ సార్కోమాకు కారణాలు పెల్విస్‌కు రేడియేషన్ థెరపీని ఉండడం.[6] ఎండోమెట్రియల్ క్యాన్సర్ నిర్ధారణ సాధారణంగా ఎండోమెట్రియల్ బయాప్సీపై ఆధారపడి ఉంటుంది.[5] లక్షణాలు, పెల్విక్ పరీక్ష , మెడికల్ ఇమేజింగ్ ఆధారంగా గర్భాశయ సార్కోమా నిర్ధారణ చేస్తారు. [6]

చికిత్స

[మార్చు]

గర్భాశయ సార్కోమాకు సాధారణంగా చికిత్స చేయడం కష్టం అయితే మాములుగా ఎండోమెట్రియల్ క్యాన్సర్ నయమవుతుంది.[7] చికిత్సలో శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ లు ఉంటాయి. అవసరాన్ని బట్టి కొన్ని థెరపీ లని కలిపి ఉపయోగిస్తారు.[5] [6] రోగ నిర్ధారణ అయిన తర్వాత ప్రభావితమైన వారిలో 80% పైన 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు.[8]

వ్యాధి ప్రాబల్యం

[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా 2015లో 3.8 మిలియన్ల మంది స్త్రీలు ప్రభావితమయ్యారు. దాని ఫలితంగా 90,000 మంది మరణించారు.[9] [10] ఎండోమెట్రియల్ క్యాన్సర్ సాపేక్షంగా సాధారణం, అయితే గర్భాశయ సార్కోమా చాలా అరుదు.[7] అమెరికాలో 3.6% మంది కొత్త క్యాన్సర్ కేసుల కనపడుతున్నాయి.[8] ఇవి సాధారణంగా 55, 74 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలలో సంభవిస్తాయి [8]. యునైటెడ్ స్టేట్స్‌లో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా ఉంది, 2016లో దాదాపు 772,247 మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీటిలో, దాదాపు 90% వారికీ ఎండోమెట్రియల్ క్యాన్సర్లు.[11] యునైటెడ్ కింగ్డమ్ లో స్త్రీలలో గర్భాశయ క్యాన్సర్ సాధారణ క్యాన్సర్ (2011లో దాదాపు 8,500 మంది స్త్రీలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు) లలో 4వ స్థానం లో ఉంది. స్త్రీలలో క్యాన్సర్ మరణాలకు ఇది అత్యంత సాధారణ కారణం (2012లో దాదాపు 2,000 మంది మహిళలు మరణించారు[12]

ప్రస్తావనలు

[మార్చు]
 1. "Womb (uterus) cancer". nhs.uk (in ఇంగ్లీష్). UK: Crown copyright. 21 October 2021. Archived from the original on 28 July 2022. Retrieved 31 July 2022. Womb cancer is cancer that affects the womb. The womb (uterus) is where a baby grows during pregnancy.
 2. WHO Classification of Tumours Editorial Board, ed. (2020). "6. Tumours of the uterine corpus". Female genital tumours: WHO Classification of Tumours. Vol. 4 (5th ed.). Lyon (France): International Agency for Research on Cancer. pp. 245–308. ISBN 978-92-832-4504-9. Archived from the original on 2022-06-17. Retrieved 2022-07-30.
 3. "What Is Endometrial Cancer?". www.cancer.org (in ఇంగ్లీష్). Retrieved 2021-09-14.
 4. "What Is Uterine Sarcoma?". www.cancer.org (in ఇంగ్లీష్). Retrieved 2021-09-14.
 5. 5.0 5.1 5.2 5.3 "Endometrial Cancer Treatment". National Cancer Institute (in ఇంగ్లీష్). 26 April 2018. Archived from the original on 3 September 2014. Retrieved 3 February 2019.
 6. 6.0 6.1 6.2 6.3 "Uterine Sarcoma Treatment". National Cancer Institute (in ఇంగ్లీష్). 3 October 2018. Archived from the original on 23 January 2018. Retrieved 3 February 2019.
 7. 7.0 7.1 "Uterine Cancer". National Cancer Institute (in ఇంగ్లీష్). 1 January 1980. Archived from the original on 27 August 2021. Retrieved 3 February 2019.
 8. 8.0 8.1 8.2 "Uterine Cancer - Cancer Stat Facts". SEER (in ఇంగ్లీష్). Archived from the original on 6 July 2014. Retrieved 3 February 2019.
 9. (8 October 2016). "Global, regional, and national incidence, prevalence, and years lived with disability for 310 diseases and injuries, 1990–2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015.".
 10. (8 October 2016). "Global, regional, and national life expectancy, all-cause mortality, and cause-specific mortality for 249 causes of death, 1980–2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015.".
 11. Felix AS, Brinton LA (September 2018). "Cancer Progress and Priorities: Uterine Cancer". Cancer Epidemiology, Biomarkers & Prevention. 27 (9): 985–994. doi:10.1158/1055-9965.EPI-18-0264. PMC 6504985. PMID 30181320.
 12. "Uterine cancer statistics". Cancer Research UK. Retrieved 28 October 2014.