Jump to content

గవర్నర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్

వికీపీడియా నుండి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రతి ఏటా గవర్నర్స్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ (గవర్నర్‌ ప్రతిభా పురస్కారాల)ను అందజేయనున్నట్టు తెలంగాణ గవర్నర్జిష్ణుదేవ్​ వర్మ నిర్ణయించగా, నవంబర్ 2024లో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ విషయాన్నీ ప్రకటించాడు. ఈ పురస్కారాలతో పర్యావరణ పరిరక్షణ, వికలాంగుల సంక్షేమం, క్రీడలు, ఆటలు, సాంస్కృతిక రంగంలో పనిచేసిన వ్యక్తులు, సంస్థలు, ట్రస్టులు, సొసైటీలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.[1] రాజ్‌భవన్‌ వేదికగా గవర్నర్‌ పేరుతో అవార్డులను ప్రదానం చేయడం దేశంలోనే ఇదే తొలిసారి.[2]

నాలుగు కేటగిరీల్లో నలుగురు వ్యక్తులు, నాలుగు సంస్థలను ఎంపిక చేసిఈ అవార్డు కింద రూ.రెండు లక్షల నగదుతోపాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేస్తారు. తొలిసారి 2024 సంవత్సరానికిగాను గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలకు ఐదేండ్లుగా అంటే 2019 నుంచి తెలంగాణలో ఆయా కేటగిరీల్లో పనిచేసిన వ్యక్తులు లేదా సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని, తెలంగాణలో పనిచేసిన వ్యక్తులు, సంస్థలు ఉండాలనీ, ఇక్కడ పనిచేస్తున్న తెలంగాణేతరులు కూడా ఉండొచ్చని ప్రకటించారు.

ఈ పురస్కారాలను నాలుగు కేటగిరీల్లో అత్యుత్తమ విజయాలను ప్రోత్సహించడం, అభివృద్ధి కోసం చేసిన కృషికి గుర్తింపునిచ్చేందుకు ఈ అవార్డులను ఏర్పాటు చేశారు. గవర్నర్‌ ప్రత్యేకంగా జ్యూరీ కమిటీని పద్మవిభూషణ్‌, ఆస్కి బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్మెన్‌ పద్మనాభయ్య నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఎంపిక కమిటీ అన్ని దరఖాస్తులనూ పరిశీలించి అర్హులైన వారిని అవార్డుల కోసం ఎంపిక చేస్తుంది.

ఈ పురస్కారాలకు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో https://governor.telangana.gov.in ద్వారా దరఖాస్తులను సమర్పించొచ్చని, అందులో దరఖాస్తు ఫారం అందుబాటులో ఉందనీ, డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ఆఫ్‌లైన్‌లో గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి, గవర్నర్‌ సెక్రెటేరియట్‌, రాజ్‌భవన్‌, సోమాజిగూడ, హైదరాబాద్‌ -500041 అడ్రస్‌కు స్పీడ్‌ పోస్టు ద్వారా అన్ని పత్రాలతో పంపాలి. తొలిసారి అందజేసిన పురస్కారాల దరఖాస్తులను 2024 నవంబర్ 2 నుంచి 23 వరకు దరఖాస్తులను ఆహ్వానించి,[3] వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు ఆ తరువాత 2024 నవంబర్ 30 వరకు గడువును పెంచారు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "గవర్నర్స్ అవార్డ్స్ ఫర్ ఎక్సలె" (PDF). 2024. Archived from the original (PDF) on 21 January 2025. Retrieved 21 January 2025.
  2. "తొలిసారిగా గవర్నర్‌ ప్రతిభా అవార్డులు". Sakshi. 2 November 2024. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
  3. "గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలు.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ". 1 November 2024. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
  4. "గవర్నర్‌ ప్రతిభా పురస్కారాల దరఖాస్తు గడువు 30 వరకు పొడిగింపు". Andhrajyothy. 24 November 2024. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
  5. "గవర్నర్ అవార్డులకు అప్లికేషన్ గడువు పెంపు". V6 Velugu. 24 November 2024. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.