Jump to content

గాంధీ కుటుంబం

వికీపీడియా నుండి
మహాత్మా గాంధీ కుటుంబం
మహాత్మా గాంధీ వంశవృక్షం
Countryభారతదేశం
Current regionగుజరాత్ , భారతదేశం
Founderమోహన్ దాస్ కరంచంద్ గాంధీ
Connected familiesనెహ్రు గాంధీ కుటుంబం
Distinctionsమహాత్మా గాంధీ
Traditionsహిందూ, గుజరాతీ సంప్రదాయం

గాంధీ కుటుంబం అంటే మోహనదాస్ కరంచంద్ గాంధీ (2 October 1869 – 30 January 1948) కుటుంబం.

1883లో మహాత్మా గాంధీ కస్తూర్బా (అసలు పేరు కస్తూర్బాయి మఖంజీ కపాడియా)ను వివాహం చేసుకున్నారు.[1] వారికి 1885లో మొదటి సంతానం పుట్టిన కొన్ని రోజులకే మరణించింది.[2] తరువాత వారికి నలుగురు కుమారులు జన్మించారు: హరిలాల్ (1888), మణిలాల్ (1892), రామదాస్ (1897), దేవదాస్ (1900). గాంధీ కుటుంబం అనేక తరాలుగా కొనసాగుతున్న కుటుంబం.

మహాత్ముని తాత తన మొదటి ఉద్యోగంలో రాజరిక వర్గంతో సూత్రప్రాయంగా విభేదించిన తరువాత, రెండు వేర్వేరు రాజ్యాలలో ప్రధానమంత్రి కాకముందు, గాంధీ కుటుంబంలోని అనేక తరాల వారు ఉప ప్రధానమంత్రులుగా పనిచేశారు. మహాత్ముని తాతకు ఐదు తరాల ముందు, లాల్జీ గాంధీ (సుమారు 1674లో జన్మించారు) పోర్‌బందర్ రాజ్యానికి చెందిన 5 విజయవంతమైన నాయిబ్ దివాన్ తరాలలో మొదటివారు.[3]

మహాత్మా గాంధీ తన రచనలో "గాంధీలు బనియా వర్ణానికి చెందినవారు, మొదట వారు వ్యాపారులు అయి ఉండవచ్చు" అని పేర్కొన్నారు.[4][5]

గాంధీ పదం

[మార్చు]

గాంధీ అనే పదానికి మూలం, గుజరాతీ భాషలో "గంధ" అంటే "సువాసన" లేదా చందనం అనే అర్థం.[6]

ఆయనను సాధారణంగా మహాత్మా గాంధీ అని పిలుస్తారు. సంస్కృతంలో "మహాత్మా" అనే పదానికి "ఉన్నతాత్ముడు" లేదా "గౌరవనీయుడు" అనే అర్థం ఉంది.[7] ఈ "మహాత్మా" అనే బిరుదు మోహనదాస్ గాంధీకి మొదటిసారిగా ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే ఇచ్చారు. ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఇతరులకు ఈ బిరుదు ఉపయోగించలేదు.[8]

మోహనదాస్ గాంధీ భారత దేశంలో బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు భారత స్వాతంత్రోద్యమంలో నాయకుడిగా ప్రముఖ పాత్ర పోషించారు. ఆయనను స్వతంత్ర భారతదేశానికి జాతిపితగా పిలుస్తారు. మొదటగా సుభాష్ చంద్రబోస్ జులై 6, 1944న సింగపూర్ రేడియో ప్రసంగంలో ఈ బిరుదును ఉపయోగించారు. 28 ఏప్రిల్ 1947న సరోజినీ నాయుడు కూడా గాంధీని "జాతిపిత" అని పేర్కొన్నారు.[9]

భారతదేశంలో గాంధీని ప్రేమగా బాపు (గుజరాతీ భాషలో "తండ్రి") అని పిలుస్తారు. ప్రధాన మంత్రి నెహ్రూ ఆయన అంత్యక్రియల సమయంలో ఈ పదాన్ని పేర్కొన్నారు. సాధారణంగా ఆయనను గాంధీజీ అని కూడా సంబోధిస్తారు; ఇక్కడ "జీ" అనేది గౌరవ సూచక ప్రత్యయం. బ్రిటిష్ అధికారులు ఆయన పేరును "గే-ఎన్‌డి" లేదా "గా-న్ది" అని ఉచ్చరించేవారు, ఎందుకంటే హిందీలో "అ" అక్షరం "అహ్" అనే ధ్వనిని ఇస్తుంది.

నెహ్రు - గాంధీ అనే మరో భారతీయ కుటుంబానికి, గాంధీ కుటుంబంతో రక్త సంబంధం లేదా వివాహ సంబంధం లేదు. అయితే జవహర్ లాల్ కుమార్తె ఇందిర రాజకీయ నాయకుడు ఫిరోజ్ ను వివాహం చేసుకున్నప్పుడు, "గాంధీ" అనే ఇంటిపేరు ఆ కుటుంబంలోకి వచ్చింది. ఫిరోజ్ గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో చేరిన తర్వాత తన అసలు ఇంటిపేరు ఘాండీ (Ghandy)ను గాంధీగా మార్చుకున్నాడు.[10][11]ఆయన గుజరాతీ పార్సీ వంశానికి చెందిన రాజకీయ నాయకుడు.[12][13]

మొదటి తరం

[మార్చు]
  • ఉత్తమచంద్ గాంధీ — లక్ష్మీబా గాంధీ భర్త, కరంచంద్ ఉత్తమచంద్ గాంధీ తండ్రి. ఈయన మనవడు మహాత్మా గాంధీ తాతను 'అటా' అని పిలిచేవాడు. కుటుంబంలో ఆయన పోర్‌బందర్ రాష్ట్రంలో పూర్తి స్థాయి దీవాన్ పదవిని పొందిన మొదటి వ్యక్తి.[14] తరువాత జునాగఢ్‌లో కూడా దీవాన్‌గా పనిచేశారు.[15]
  • లక్ష్మీబా గాంధీ — ఉత్తమచంద్ గాంధీ భార్య, కరంచంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ తల్లి.

రెండవ తరం

[మార్చు]
  • కరంచంద్ ఉత్తమచంద్ గాంధీ (1822–1885) — ఉత్తమచంద్ గాంధీ, లక్ష్మీబా ల ఆరుగురు కుమారులలో ఐదవవాడు. ఇతని మారు పేరు 'కాబా' పోర్‌బందర్, రాజకోట్ రాష్ట్రాలలో దీవాన్‌గా పనిచేశారు.[16]
  • తులసీ దాస్ గాంధీ — ఉత్తమచంద్ గాంధీ — లక్ష్మీబా గాంధీల ఆరవ కుమారుడు. ఇతను పోర్‌బందర్‌లో దీవాన్‌గా పనిచేసిన కరంచంద్ గాంధీ సోదరుడు.[17]

మూడవ తరం

[మార్చు]
  • మోహనదాస్ కరంచంద్ గాంధీ — మహాత్మా గాంధీ. భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, "జాతిపిత"గా ప్రసిద్ధి పొందిన వ్యక్తి. ఉత్తమచంద్ గాంధీ, ఇంకా 4వ భార్య అయిన పుత్లీ బాయి గాంధీకి కుమారుడు. లక్ష్మీదాస్ గాంధీ, రాలియత్‌బెన్ (స్త్రీ), కరసన్‌దాస్ గాంధీలకు తమ్ముడు.
  • కస్తూర్బా గాంధీ — మహాత్మా గాంధీ భార్య. ఆమె జన్మదినం (ఏప్రిల్ 11)ను భారతదేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంగా జరుపుకుంటారు.[18]

మోహనదాస్ కరంచంద్ గాంధీ, కస్తూర్బా గాంధీ లకు నలుగురు కుమారులు జన్మించారు: హరిలాల్ (1888), మణిలాల్ (1892), రామదాస్ (1897), దేవదాస్ (1900).

నాల్గవ తరం

[మార్చు]
  • మగన్‌లాల్ గాంధీ (1883–1928)
  • హరిలాల్ గాంధీ (1888–1948) - మోహనదాస్ కరంచంద్ గాంధీ పెద్ద కుమారుడు
  • మణిలాల్ గాంధీ (1892–1956) - మోహనదాస్ కరంచంద్ గాంధీ రెండవ కుమారుడు
  • రాందాస్ గాంధీ (1897–1969) - మోహనదాస్ కరంచంద్ గాంధీ మూడవ కుమారుడు
  • సమదాస్ గాంధీ (1897–1953)
  • దేవదాస్ గాంధీ (1900–1957) - మోహనదాస్ కరంచంద్ గాంధీ చిన్న కుమారుడు

ఐదవ తరం

[మార్చు]
  • కాను గాంధీ (1917–1986), ఛాయాచిత్రకారుడు, రిచర్డ్ అటెన్‌బరో నిర్మించిన గాంధీ జీవిత చరిత్ర చిత్రంలోని అనేక సన్నివేశాలు కాను తీసిన ఛాయాచిత్రాల ఆధారంగా చిత్రీకరించారు. గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపినప్పుడు, ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో మహాత్మా గాంధీతో పాటు ఉన్నవారిలో ఆయన భార్య 'ఆభా' కూడా ఉంది.
  • కాను గాంధీ (శాస్త్రవేత్త) (1928–2016), శాస్త్రవేత్త, 1963లో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎం.ఎస్. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు, విమానాల రూపకల్పనపై నాసా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేశారు, ఆయన భార్య 'శివలక్ష్మి' బోస్టన్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్, పరిశోధకురాలుగా ఉండేవారు, వీరికి సంతానం లేదు.
  • అరుణ్ మణిలాల్ గాంధీ (1934–2023), తుషార్ గాంధీకి తండ్రి
  • రాజ్మోహన్ గాంధీ (1935–), గోపాలకృష్ణ, రామచంద్ర గాంధీ, తారా గాంధీ భట్టాచార్జీ (నీ గాంధీ) ల సోదరుడు
  • రామచంద్ర గాంధీ (1937–2007), దేవదాస్ గాంధీ (మహాత్మా గాంధీ చిన్న కుమారుడు), లక్ష్మి (రాజాజీ కుమార్తె) ల కుమారుడు. రాజమోహన్ గాంధీ, గోపాలకృష్ణ గాంధీ, తారా గాంధీ భట్టాచార్జీ లకు సోదరుడు. లీలా గాంధీకి తండ్రి. తత్వశాస్త్రంలో పి.హెచ్ డి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం. హైదరాబాదు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర విభాగాన్ని స్థాపించారు. విశ్వభారతి విశ్వవిద్య్యాలయం, పంజాబ్ విశ్వవిద్యాలయం, బెంగుళూరు విశ్వవిద్యాలయంలో , శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రల్ స్టడీస్ లో తత్వశాస్త్రం బోధించారు.
  • ఈలా గాంధీ (1940–), మణిలాల్ గాంధీ, సుశీల మష్రువాలాల కుమార్తె, 1994 నుండి 2004 వరకు దక్షిణాఫ్రికాలో పార్లమెంటు సభ్యురాలు, మాజీ ఛాన్సలర్ డర్బన్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఈమె, మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహ కమిటీకి, తాను స్థాపించిన మహాత్మా గాంధీ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌కు అధ్యక్షత వహించారు.
  • గోపాలకృష్ణ గాంధీ (1945–), దేవదాస్, లక్ష్మీ గాంధీల కుమారుడు, రాజ్‌మోహన్, రామచంద్ర గాంధీ, తారా గాంధీ భట్టాచార్జీ (గాంధీ)ల సోదరుడు, 2004 నుండి 2009 వరకు పశ్చిమ బెంగాల్ 22వ గవర్నర్‌గా పనిచేశారు, భారత రాష్ట్రపతికి కార్యదర్శిగా, దక్షిణాఫ్రికా, శ్రీలంకలకు హైకమిషనర్‌గా పనిచేశారు, రాజ్‌మోహన్ గాంధీ, రామచంద్ర గాంధీ, శ్రీమతి తారా భట్టాచార్జీ (గాంధీ) ల తమ్ముడు, అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు
  • సుమిత్రా కులకర్ణి (నీ గాంధీ) (1929–), రాందాస్, నిర్మలా గాంధీ ల కుమార్తె. రాజ్యసభ సభ్యురాలు (1972-1978). గజానన్ రఘునాథ్ కులకర్ణిని వివాహం చేసుకున్నారు, వారికి కవలలు కుమారులు శ్రీరామ్, శ్రీకృష్ణ ఇంకా ఒక కుమార్తె, సోనాలి ఉన్నారు.[1][2][3][19]

ఆరవ తరం

[మార్చు]
  • శాంతి గాంధీ (1940–): కాంతిలాల్, సరస్వతి గాంధీల కుమారుడు. సుసాన్ గాంధీని వివాహం చేసుకున్నారు. అతను ఆన్, అనితా, అంజలి గాంధీల తండ్రి. వృత్తి రీత్యా సర్జన్. 2013 నుండి 2015 వరకు కాన్సాస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 52వ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిధ్యం వహించిన యూఎస్ రిపబ్లికన్ పార్టీ సభ్యుడు.
  • కీర్తి మీనన్ (1959–): ఆమె పూర్వపు పేరు - ధుపేలియా. సీతా (పూర్వపు పేరు గాంధీ), శశికాంత్ ధుపేలియాల కుమార్తె. సునీల్ మీనన్‌ను వివాహం చేసుకుంది. ఈమె కుమార్తె సునీతా మీనన్. జోహన్నెస్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ డైరెక్టర్, దక్షిణాఫ్రికాలోని గాంధీ శతజయంతి కమిటీ ఛైర్మన్. ఈమె దక్షిణాఫ్రికాలో ఉన్నత విద్యా రంగంలో విధానపరమైన వాతావరణాన్ని సంస్కరించారు.
  • తుషార్ అరుణ్ గాంధీ (1960–), అరుణ్ మణిలాల్ గాంధీ, సునంద గాంధీల కుమారుడు, సోనాల్ (పూర్వపు పేరు దేశాయ్) గాంధీని వివాహం చేసుకున్నారు. వీరికి వివాన్ గాంధీ అనే కుమారుడు, కస్తూరి గాంధీ అనే కుమార్తె ఉన్నారు. తుషార్ గాంధీ మహారాష్ట్రలోని జల్గావ్‌లో ఉన్న గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్‌ కి డైరెక్టర్.
  • లీలా గాంధీ (1966–): రామచంద్ర గాంధీ కుమార్తె. జాన్ హాక్స్ ప్రొఫెసర్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ ఇంగ్లీష్. ఈమె రచయిత్రి. బ్రౌన్ విశ్వవిద్యాలయంలోని పెంబ్రోక్ సెంటర్ ఫర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ డైరెక్టర్.
  • సోనాలి కులకర్ణి: సుమిత్ర, గజానన్ రఘునాథ్ కులకర్ణిల కుమార్తె, ఫానుక్ ఇండియా సీఈఓ. వ్యాపార కార్యనిర్వాహకుడైన రవి వెంకటేశన్‌ను వివాహం చేసుకున్నారు.[20][21][22]
  • శ్రీకృష్ణ కులకర్ణి, సుమిత్ర, గజానన్ రఘునాథ్ కులకర్ణిల కుమారుడు. పానాసోనిక్ ఇండియా సీఓఓ. సైబర్నెటిక్ రీసెర్చ్ ల్యాబ్స్ డైరెక్టర్, ఐఐఎం కలకత్తా ఛైర్‌పర్సన్, గుజరాత్ విద్యాపీఠ్ ట్రస్టీ.[23][24]
  • శ్రీరామ్ కులకర్ణి: సుమిత్ర, గజానన్ రఘునాథ్ కులకర్ణిల కుమారుడు.[25]

మూలాలు

[మార్చు]
  1. Mohanty, Rekha (2011). "From Satya to Sadbhavna" (PDF). Orissa Review (January 2011): 45–49. Retrieved 23 February 2012.
  2. Guha 2015, p. 29
  3. "Lalji Gandhi". Geni. Geni.com. Retrieved 27 December 2022.
  4. Gandhi, Mohandas Karamchand. "Memoir of Mohandas Karamchand Gandhi". Chapter 10: Birth and Parentage. Columbia University. Retrieved 27 December 2022.
  5. Mohanty, Rekha (2011). "From Satya to Sadbhavna" (PDF). Orissa Review (January 2011): 45–49. Archived from the original (PDF) on 1 January 2016. Retrieved 23 February 2012.
  6. Mindfulness in the Modern World: How Do I Make Meditation Part of Everyday Life?. St. Martin's Publishing Group. 8 April 2014. ISBN 9781466847323 – via Google Books.
  7. "Mahatma name". behindthename.com. Retrieved 5 January 2017.
  8. "Mahatma title to Bapu". The Times of India. Retrieved 5 January 2017.
  9. "Father of The Nation". Hindustan Times. Retrieved 5 January 2017.
  10. Guha, Ramachandra (2011). India after Gandhi: The History of the World's Largest Democracy. Pan Macmillan. p. 33, footnote 2 (chapter 14). ISBN 978-0330540209.
  11. Vishnu, Uma (2010). Idea Exchange: Opinion Makers, Critical Issues, Interesting Times. Penguin Books India. p. 87. ISBN 978-0670084890.
  12. Lyon, Peter (2008) Conflict Between India and Pakistan: An Encyclopedia. Santa Barbara: ABC-CLIO. p. 64. ISBN 978-1576077122. "Feroze Gandhi was no relation of Mahatma Gandhi."
  13. Ashhali, Varma. "Was the Gandhi name adopted for convenience? (July 20, 2015)". India Times. Bennett, Coleman & Co. Ltd. Retrieved 26 December 2022.
  14. Gandhi, Mohandas Karamchand. "Memoir of Mohandas Karamchand Gandhi". Chapter 1: Birth and Parentage. Columbia University. Retrieved 27 December 2022.
  15. "About Uttamchand Gandhi". Geni. Geni.com. Retrieved 27 December 2022.
  16. Gandhi, Mohandas Karamchand. "Memoir of Mohandas Karamchand Gandhi". Chapter 1: Birth and Parentage. Columbia University. Retrieved 27 December 2022.
  17. Gandhi, Mohandas Karamchand. "Memoir of Mohandas Karamchand Gandhi". Chapter 1: Birth and Parentage. Columbia University. Retrieved 27 December 2022.
  18. "జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవం". ఈనాడు. 2025-04-11. Archived from the original on 2026-03-29. Retrieved 2026-03-29.
  19. RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019 (PDF). RAJYA SABHA SECRETARIAT, NEW DELHI. 2019. p. 244.
  20. "Sonali Kulkarni: Leading the Robo-Charge". Business Today (in ఇంగ్లీష్). 2021-12-13. Retrieved 2024-01-17.
  21. Sreenivasa Raghavan, T. S. (2010-10-08). "Gandhi kin to tie the knot with Microsoft boss". Bangalore Mirror. Retrieved 2024-01-17.
  22. Kalappa, Bansy (2019-06-08). "Godse talk won't dent Gandhi's image: Mahatma's granddaughter Sumitra". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-01-17.
  23. "Ex-minister Bhupendrasinh Chudasama, Mahatma Gandhi's great-grandson now Gujarat Vidyapith trustees". The Times of India. 2023-04-21. ISSN 0971-8257. Retrieved 2024-01-17.
  24. Kalappa, Bansy (2019-06-08). "Godse talk won't dent Gandhi's image: Mahatma's granddaughter Sumitra". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-01-17.
  25. Kalappa, Bansy (2019-06-08). "Godse talk won't dent Gandhi's image: Mahatma's granddaughter Sumitra". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-01-17.

వంశ వృక్షం

[మార్చు]
మహాత్మా గాంధీ వంశవృక్షం
కరంచంద్ ఉత్తంచంద్ గాంధీ
1822–1885
మహాత్మా గాంధీ
1869–1948
కస్తూరిబాయి గాంధీ
1869–1944
హరిలాల్ గాంధీ
1888–1948
మణిలాల్ గాంధీ
1892–1956
రామదాస్ గాంధీ
1897–1969
దేవదాస్ గాంధీ
1900–1957
సునంద గాంధీ
1932–2007
అరుణ్ మణిలాల్ గాంధీ
1934–2023
ఇలా గాంధీ
1940–
కాను గాంధీ
1928–2016
రాజ్ మోహన్ గాంధీ
1935–
రామచంద్ర గాంధీ
1937–2007
గోపాలకృష్ణ గాంధీ
1945–
తుషార్ గాంధీ
1960–
లీలా గాంధీ
1966–