Jump to content

గాంధీ తాత చెట్టు

వికీపీడియా నుండి
గాంధీ తాత చెట్టు
దర్శకత్వంపద్మావతి మల్లాది
కథపద్మావతి మల్లాది
పాటలుకాసర్ల శ్యామ్
నిర్మాతన‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌, శేష సింధు రావు
తారాగణం
ఛాయాగ్రహణంవిశ్వ దేవబత్తుల, శ్రీజిత్‌ చెరువుపల్లి
కూర్పుహరి శంకర్ టి.ఎన్
సంగీతంరీ
నిర్మాణ
సంస్థలు
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్
విడుదల తేదీ
24 జనవరి 2025 (2025-01-24)
భాషతెలుగు

గాంధీ తాత చెట్టు 2025లో విడుదలైన సినిమా. తబితా సుకుమార్[1] సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌, శేష సింధు రావు నిర్మించిన ఈ సినిమాకు పద్మావతి మల్లాది దర్శకత్వం వహించింది.[2][3] సుకృతి వేణి, ఆనంద్‌ చక్రపాణి, రాగ్ మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 9న, ట్రైలర్‌ను జనవరి 9న విడుదల చేసి,[4] సినిమాను జనవరి 24న విడుదల చేశారు.[5]

ఈ సినిమాలో నటనకుగాను సుకృతి వేణి ఉత్త‌మ‌బాల న‌టిగా దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్,[6] దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, ఇండియ‌న్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ తో పాటు అనేక ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డులు అందుకుంది.[7] 71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి ఎంపికైంది.[8][9]

గాంధీతాత చెట్టు సినిమా మార్చి 21 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో,[10] మార్చి 23 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[11]

గాంధేయవాది రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) తన ఊరిలో త‌న‌కున్న వ్యవసాయ భూమిలోని ఓ వేప‌చెట్టు నాటుతాడు. ఆ చెట్టుపై అభిమానాన్నిపెంచుకుంటాడు. మహాత్మా గాంధీ మీద అభిమానంతో మనవరాలికి గాంధీ (సుకృతి వేణి) అని పేరు పెడతారు. తాత లక్షణమే మనవరాలు కూడా వస్తుంది. ఈ క్రమంలో షుగర్ ఫ్యాక్ట‌రీ పెడుతున్నామ‌ని ఊళ్లోని భూముల‌ను ఓ కార్పొరేట్ కంపెనీ ప్ర‌తినిధి సతీష్ (రాగ్ మయూర్) వస్తాడు. అయితే డబ్బుకు ఆశ పడిన గ్రామస్తులు తమ పొలాలు అమ్మేయగా రామచంద్రయ్య తన భూమిని అమ్మడానికి నిరాకరిస్తాడు. దాంతో కొడుకుతో పాటు కొడుకు ఊర్లోనూ అవమానాలు ఎదురవగా అవి తట్టుకోలేక చనిపోతాడు. గాంధీ (సుకృతి వేణి) తన తాత అడుగుజాడల్లో ఏం చేసింది? గాంధీ చేసిన కృషి వల్ల గ్రామంలో ఏం జరిగింది? అహింసా మార్గంలో నడవడం వల్ల ఎటువంటి మార్పు చోటు చేసుకుంది? అనేదే మిగతా సినిమా కథ.[12][13]

నటీనటులు

[మార్చు]
71వ జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ బాల నటిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి పురస్కారాన్ని అందుకున్న సుకృతి వేణి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • ఆర్ట్: వీ. నాని పాండు
  • డిఐ: శ్రీనివాస్ మామిడి
  • సహ నిర్మాత: అశోక్ బండ్రెడ్డి
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్ , విశ్వ
  • సౌండ్ డిజైన‌ర్‌: నాగార్జున తాళ్లపల్లి
  • సింక్ సౌండ్: ఆనంద్ అయ్యన్న
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అభినయ్ చిలుకమారి
  • కథ, దర్శకత్వం: పద్మావతి మల్లాది
  • సంగీతం: రీ
  • ఛాయా గ్రహణం: విశ్వదేవ బత్తుల , శ్రీజిత్ చెరువుపల్లి
  • కూర్పు: హరిశంకర్ టి ఎన్
  • గాయనీ గాయకులు: కనకవ్వ, రాహూల్ సింప్లీగంజ్, దివ్యమాలిక, మేఘానా నాయుడు, సింధుజా తణుకు, శ్వేత పొన్నపల్లి, కృష్ణలాస్య, స్వీయలక్ష్మి, గోపిక
  • నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్, శేష సింధూరావు,
  • నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్
  • విడుదల:24:01:2025.

పాటలు

[మార్చు]

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: Ree.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఉతుతి"సుద్దాల అశోక్ తేజకనకవ్వ2:56
2."ధగడ్‌ పిల్ల[15]"కాసర్ల శ్యామ్రాహుల్ సిప్లిగంజ్3:02
3."ఓలే సంధమామా"కాసర్ల శ్యామ్దివ్య మాలిక1:24
4."గాంధీ మాటే"విశ్వమేఘనా నాయుడు, సింధూజ తణుకు, శ్వేత పొన్నపల్లి, కృష్ణ లాస్య, స్వీయ లక్ష్మి, గోపిక2:57

మూలాలు

[మార్చు]
  1. "కుమార్తె గురించి చెబుతూ.. దర్శకుడు సుకుమార్‌ సతీమణి కంటతడి". 17 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  2. "చెట్టుకు, మనిషికి మధ్య ప్రేమకథ". NT News. 21 January 2025. Archived from the original on 21 January 2025. Retrieved 21 January 2025.
  3. "Director Padmavathi Malladi on the making of 'Gandhi Tatha Chettu', a crowdsourced Telugu indie film" (in Indian English). The Hindu. 22 January 2025. Archived from the original on 23 January 2025. Retrieved 23 January 2025.
  4. "సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా.. గాంధీ తాత చెట్టు ట్రైల‌ర్ వ‌చ్చేసింది." 10TV Telugu. 9 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  5. "'గాంధీ తాత చెట్టు' రిలీజ్‌కి రెడీ". 17 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  6. "గాంధీ తాత చెట్టు.. ఉత్త‌మ‌బాల న‌టిగా ద‌ర్శ‌కుడు సుకుమార్ కుమార్తెకు ప్రతిష్టాత్మ‌క అవార్డ్‌". Chitrajyothy. 1 May 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  7. "ఉత్తమ బాలనటిగా డైరెక్టర్ సుకుమార్ కూతురు.. తొలి సినిమాకే అవార్డ్.. రిలీజ్ డేట్ ఇదే!". Hindustantimes Telugu. 2 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
  8. "జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన". Andhrajyothy. 1 August 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
  9. "ఉత్తమ తెలుగు చిత్రం 'భగవంత్‌ కేసరి'.. ఉత్తమ పాట 'ఊరు పల్లెటూరు'". Eenadu. 1 August 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
  10. "రిలీజ్‌కు ముందే 14 ఇంటర్నేషనల్ అవార్డ్స్.. సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా". TV9 Telugu. 21 March 2025. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  11. "సుకుమార్‌ కుమార్తె సినిమా: మరో ఓటీటీలో 'గాంధీ తాత చెట్టు'". Eenadu. 23 March 2025. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  12. "'గాంధీ తాత చెట్టు' మూవీ రివ్యూ.. సుకుమార్ కూతురు సినిమా ఎలా ఉందంటే..!". Zee News Telugu. 23 January 2025. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  13. "గాంధీ తాత చెట్టు రివ్యూ - సుకుమార్ కూతురు న‌టించిన మూవీ ఎలా ఉందంటే?". Hindustantimes Telugu. 24 January 2025. Archived from the original on 23 March 2025. Retrieved 23 March 2025.
  14. "Sukriti Veni Bandreddi, lead actor of 'Gandhi Tatha Chettu' and Sukumar-Thabitha's daughter, wants to be a music teacher" (in Indian English). The Hindu. 21 January 2025. Archived from the original on 22 January 2025. Retrieved 22 January 2025.
  15. "'Dhagad Pilla' from Gandhi Tatha Chettu is an energising folk number" (in ఇంగ్లీష్). Cinema Express. 19 January 2025. Retrieved 20 January 2025.

బయటి లింకులు

[మార్చు]