గాంధీ శాంతి బహుమతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Gandhi Peace Prize
పురస్కారం గురించి
విభాగం International
మొదటి బహూకరణ 1995
మొత్తం బహూకరణలు 12
బహూకరించేవారు Government of India
నగదు బహుమతి 10 million
మొదటి గ్రహీత(లు) Julius Nyerere
క్రితం గ్రహీత(లు) Desmond Tutu
గమనిక : అమెరికా సంస్థ ప్రమోషన్ ఎండ్యూరింగ్ పీస్ చే ప్రదానం చేయు పురస్కారం గాంధీ శాంతి అవార్డు

గాంధీ శాంతి బహుమతి (ఆంగ్లం : The International Gandhi Peace Prize), మహాత్మా గాంధీ పేరుమీద భారత ప్రభుత్వం ప్రదానం చేసే బహుమతి.

మహాత్మా గాంధీకి ఒక శ్రద్ధాంజలిగా ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. మహాత్మా గాంధీ 125వ జయంతిని పునస్కరించుకుని, 1995లో భారత ప్రభుత్వం ఈ అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని ప్రవేశపెట్టింది. సంవత్సరానికోసారి, వ్యక్తులకు గాని, సంస్థలకు గాని, సామాజిక, ఆర్థిక, రాజకీయ, అహింసా మార్గంలో పనిచేసినవారికి ఈ బహుమతి ప్రదానం చేయబడుతుంది. మరీ ముఖ్యంగా గాంధీ సిద్ధాంతాలను అనుసరించినవారికి ఈ బహుమతి ప్రదానం చేయబడుతుంది. ఈ బహుమతి కింద, కోటి రూపాయలు, ఓ ప్రశంసాపత్రం ఓ జ్ఞాపిక అందజేయబడుతుంది. ఈ బహుమతి కొరకు ప్రదేశం, భాషా, లింగ, జాతి, వయోభేదాలంటూ లేవు.

ఈ బహుమతి న్యాయనిర్ణేతల బృందములో, భారత ప్రధానమంత్రి, లోక్‌సభలోని ప్రతిపక్షనాయకుడు, భారత ప్రధాన న్యామూర్తి, ఇతర ప్రముఖులు వుంటారు. ప్రతి సంవత్సరమునకు వీరే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, బహుమతి గ్రహీత పేరును వెల్లడిస్తారు.

పది సంవత్సారాల కాలంలో తమ కార్యక్రమ లక్ష్యాలను సాధించినవారు ఈ బహుమతికి అర్హులు. ఎవరైనా ప్రతిపాదన చేయవచ్చును.

గాంధీ శాంతి బహుమతి గ్రహీతలు

[మార్చు]
వరుస సంఖ్య సంవత్సరం పేరు బహుమతి పొందినవారి వివరలు
1. 1995 జూలియాస్ నై నేరే మొదటి టాంజానియా అధ్యక్షుడు
2. 1996 ఏ.టీ. అరియరత్నే స్థాపకుడు సర్వోదయ శ్రమదాన ఉద్యమం
3. 1997 గెర్హార్డ్ ఫిషర్
4. 1998 రామకృష్ణ మిషన్ స్థాపకుడు స్వామీ వివేకానంద
5. 1999[1] బాబా ఆమ్టే సామాజిక కార్యకర్త
6. 2000 నెల్సన్ మండేలా (సహ-గ్రహీత) మాజీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
7. 2000 గ్రామీణ్ బ్యాంక్ (సహ-గ్రహీత) స్థాపకుడు ముహమ్మద్ యూనుస్
8. 2001[2] జాన్ హ్యూమ్ ఉత్తర్ ఐర్లాండ్ రాజకీయవేత్త
9. 2002 భారతీయ విద్యా భవన్
10. 2003 వాక్లావ్ హావెల్
11. 2004 కొరెట్టా స్కాట్ కింగ్ మార్టిన్ లూథర్ కింగ్ సతీమణి
12. 2005[3] డెస్మండ్ టుటు దక్షిణాఫ్రికాకు చెందిన మతాధికారి, ఉద్యమకారుడు
13. 2006[4] నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు
14 2013 చండీ ప్రసాద్ భట్ పర్యావరణ వేత్త, సామాజిక ఉద్యమకారుడు
15 2014 భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
16 2015 వివేకానంద కేంద్ర
17 2016 అక్షయపాత్ర ఫౌండేషన్
18 2016 సులభ్ ఇంటర్నేషనల్
19 2017 ఏకాల్ అభియాన్ ట్రస్టు
20 2018 యోహే సరకావా
21 2019 కాబూస్ బిల్ సైద్ ఆల్ సైద్
22 2020 షేక్ ముజబూర్ రహమాన్

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]