Jump to content

గాజర్ల రవి

వికీపీడియా నుండి
గాజర్ల రవి
జననం
మరణం2025 జూన్ 18
వృత్తిమావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు
జీవిత సహచరిస్వరూప అలియాస్‌ జిలానీబేగం
Parent(s)గాజర్ల మల్లయ్య గౌడ్, కనకమ్మ[1]

గాజర్ల రవి భారతదేశానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా బార్డర్‌ స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు.[2]

గాజర్ల రవి వై. ఎస్. రాజశేఖ‌ర‌రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్నపుడు 2004లో ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో పీపుల్స్‌వార్‌ తరపున పాల్గొన్న ప్రతినిధుల్లో ఒకరు.[3][4]

రవి పీపుల్స్ వార్ ఉద్యమంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా  పని చేసి మల్కన్‌గిరి, కోరాపుట్, శ్రీకాకుళం ప్రాంతాలకు బాధ్యత వహించి గెరిల్లా యుద్ధ వ్యూహం, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(IED) విస్తరణలో ప్రసిద్ధి చెందాడు.

గాజర్ల రవిని పట్టిస్తే కేంద్రం దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ రూ.10లక్షలు బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది.[5]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

గాజర్ల రవి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం, వెలిశాల గ్రామంలో గాజర్ల మల్లయ్య గౌడ్, కనకమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనకు ఐదుగురు అన్నదమ్ములు గాజర్ల రాజయ్య, గాజర్ల సమ్మయ్య, గాజర్ల సారయ్య, గాజర్ల రవి, గాజర్ల అశోక్‌[6] ఉన్నారు.[7][8] ఆయన విద్యార్థి దశలో విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితులై ఆర్‌ఎస్‌యూలో చేరి 1984 వరకు వెలిశాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి 1985లో హన్మకొండలో ఐటీఐ కోర్సులో చేరి ఐటీఐలో చదవుతూ ఆర్‌ఎస్‌యూలో కీలకంగా పని చేస్తూ చదువుతున్న విద్యాలయంపై ఎర్ర జెండా ఎగుర వేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఐటీఐ అనంతరం వరంగల్‌లోని వివేకానంద కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశాడు చేశాడు.

ఉద్యమంలో

[మార్చు]

గాజర్ల రవి 1980 దశకంలో రాడికల్‌ విద్యార్థి సంఘంతో మొదలై నాలుగు దశాబ్దాలపాటు మావోయిస్టు ఉద్యమంలో గణేశ్‌, ఉదయ్‌ పేర్లతో పని చేస్తూ రెండు దశాబ్దాల కాలం పూర్తిగా ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఏవోబీ)లో పని చేశాడు. ఉద్యమంలోనే స్వరూప అలియాస్‌ జిలానీబేగంను వివాహం చేసుకోగా, ఆమె ఎన్‌కౌంటరులో మరణించారు.

ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కార్యదర్శి బాకూరు వెంకటరమణ అలియాస్‌ గణేశ్‌ 2016 అక్టోబరు 24న రామ్‌గూడ ఎన్‌కౌంటరులో మరణించాక, ఆ బాధ్యతలను ఉదయ్‌ తీసుకున్నారు. గాజర్ల రవిపై తెలంగాణలో రూ.40 లక్షలు, ఏవోబీలో రూ. 25 లక్షల రివార్డు ఉంది. అలిపిరి వద్ద చంద్రబాబుపై జరిపిన మందుపాతర దాడి ఘటనలో, 76మంది జవాన్లను హత్యచేసిన తాడిమెట్ల ఘటనలో, నదిని దాటుతున్న జవాన్లపై బలిమెలలో దాడిచేసి హత్యచేసిన ఘటనలో ఆయన నిందితుడిగా ఉన్నారు.

మరణం

[మార్చు]

గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో 2025 జూన్ 18న ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.[9][10][11][12][13][14] ఆయన మృతదేహాన్ని పోలీసులు కుటుంబీకులకు అప్పగించగా,[15] ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, తీన్మార్‌ మల్లన్న, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, నకిరేకల్‌ ఎమ్మెల్యే సతీమణి పుష్ప, ఆర్‌.కె. సతీమణి నిర్మలక్క, అరుణోదయ విమలక్క, అమరుల బంధుమిత్రుల కమిటీ, తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు తదితరులు భౌతికకాయానికి నివాళులర్పించాగా ఆయన స్వగ్రామం వెలిశాలలో జూన్ 20న అంత్యక్రియలు నిర్వహించారు.[16][17][18][19]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Maoist legacy of Gajarla family ends with Ravi: Top Maoist's four-decade journey ends in Andhra Pradesh encounter; wife, brothers, cousins — all part of movement, most killed or surrendered". The Times of India. 19 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  2. ↑ "తుది శ్వాస దాకా నమ్మిన బాటలోనే!". Andhrajyothy. 19 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  3. ↑ "కుటుంబమంతా పీపుల్స్‌వార్ ఉద్యమం వైపు అడుగులు". Mana Telangana. 18 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  4. ↑ "Gajarla family's tryst with Naxal movement ends" (in ఇంగ్లీష్). The New Indian Express. 25 October 2016. Retrieved 21 June 2025.
  5. ↑ "మావోయిస్టు గాజర్ల రవిని పట్టిస్తే రూ.10లక్షలు బహుమతి : NIA ప్రకటన". 10TV Telugu. 25 January 2023. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  6. ↑ "బుల్లెట్‌ టూ బ్యాలెట్‌.. ప్రజాక్షేత్రంలోకి గాజర్ల అశోక్ అలియాస్ ఐతు". TV9 Telugu. 12 October 2023. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  7. ↑ "5 brothers, 4 of them Maoists. Ravi's encounter marks end of Gajarla family ties to CPI (Maoist)". ThePrint. 19 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  8. ↑ "ఉలిక్కిపడ్డ వెలిశాల". Mana Telangana. 18 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  9. ↑ "మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్‌కౌంటర్‌". Sakshi. 19 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  10. ↑ "మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్‌.. రవి, అరుణ మృతి". Andhrajyothy. 19 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  11. ↑ "Central committee member Gajarla Ravi among 3 Maoists killed in encounter in Andhra Pradesh" (in ఇంగ్లీష్). The Indian Express. 19 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  12. ↑ "Three Senior Maoist Leaders Killed in ASR Encounter" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 18 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  13. ↑ "Top Maoist leader among three killed in forest encounter with security forces" (in ఇంగ్లీష్). India Today. 18 June 2025. Archived from the original on 18 June 2025. Retrieved 21 June 2025.
  14. ↑ "Top maoist leader shot: Gajarla Ravi killed in operation; rebel grip fades, no big leader left in Andhra Pradesh". The Times of India. 19 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  15. ↑ "గాజర్ల రవి భౌతికకాయం అప్పగింత". Andhrajyothy. 21 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  16. ↑ "అశ్రునయనాల నడుమ గాజర్ల రవి అంత్యక్రియలు". Eenadu. 21 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  17. ↑ "ముగిసిన గాజర్ల రవి అంత్యక్రియలు". Andhrajyothy. 21 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  18. ↑ "వెలిశాల.. శోకసంద్రం". Sakshi. 21 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.
  19. ↑ "విప్ల‌వ యోధుడికి అంతిమ వీడ్కోలు - ఎర్ర సంద్రంలా మారిన‌ వెలిశాల". Andhra Prabha. 20 June 2025. Archived from the original on 21 June 2025. Retrieved 21 June 2025.