గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు
| గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు | |||
| పదవీ కాలం 2024 జూన్ 13 – ప్రస్తుతం | |||
| పదవీ కాలం 2019 – ప్రస్తుతం | |||
| ముందు | న్యూలై టింగ్‌ఖాత్రా | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కనుబరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు కనుబరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పెమా ఖండు మంత్రివర్గంలో వ్యవసాయం, పశు సంవర్ధక & ఆహారం, పౌర సరఫరాలు శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కనుబరి శాసనసభ నియోజకవర్గం నుండి పిపిఎ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి న్యూలై టింగ్‌ఖాత్రా చేతిలో 670 తేడాతో ఓడిపోయాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,756 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.
గాబ్రియేల్ డెన్వాంగ్ వాంగ్సు ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కనుబరి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి నోక్‌చై బోహంను 4,236 ఓట్లతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి పంజం వాంగ్సాను 2,059 ఓట్లతో ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2][3][4] పెమా ఖండు మంత్రివర్గంలో వ్యవసాయం, పశు సంవర్ధక & ఆహారం, పౌర సరఫరాలు శాఖ మంత్రిగా పని చేశాడు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh: CM Pema Khandu allocates portfolios to newly inducted ministers". The Times of India. 15 June 2024. Archived from the original on 21 May 2025. Retrieved 21 May 2025.
- ↑ "Kanubari (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 31 May 2024. Retrieved 29 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Kanubari". Election Commission of India. 2 June 2024. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Kanubari Assembly Election Result 2024: BJP's Gabriel Denwang Wangsu wins". The Times of India. 2 June 2024. Archived from the original on 3 June 2024. Retrieved 29 May 2025.
- ↑ "Arunachal Pradesh CM Pema Khandu allocates portfolios to newly inducted ministers". Hindustan Times. 15 June 2024. Archived from the original on 21 May 2025. Retrieved 21 May 2025.
- ↑ "Arunachal Pradesh Council of Ministers portfolios: Who got what?" (in ఇంగ్లీష్). Financialexpress. 15 June 2024. Archived from the original on 21 May 2025. Retrieved 21 May 2025.