గాయం (సినిమా)
| గాయం | |
|---|---|
![]() గాయం సినిమా డివిడి కవర్ | |
| దర్శకత్వం | రామ్ గోపాల్ వర్మ |
| రచన | పోసాని కృష్ణమురళి (మాటలు) |
| స్క్రీన్ ప్లే | రామ్ గోపాల్ వర్మ |
| కథ | రామ్ గోపాల్ వర్మ మణిరత్నం |
| నిర్మాత | యార్లగడ్డ సురేంద్ర |
| తారాగణం | జగపతి బాబు ఊర్మిళా మండోద్కర్ రేవతి |
| ఛాయాగ్రహణం | రసూల్ ఎల్లోర్ |
| కూర్పు | శంకర్ |
| సంగీతం | శ్రీ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎస్. క్రియేషన్స్ |
విడుదల తేదీ | 22 ఏప్రిల్ 1993 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
గాయం 1993, ఏప్రిల్ 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ సురేంద్ర నిర్మాణ సారథ్యంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, ఊర్మిళా మండోద్కర్, రేవతి నటించగా శ్రీ సంగీతం అందించాడు.[1] 1980లలో విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ఫేర్ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రానికి మణిరత్నం రచన సహకారం అందించాడు. విడుదలైన తరువాత ఈ చిత్రం, మంచి స్పందనతోపాటు ఆరు నంది అవార్డులు అందుకుంది, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.[2]
కథా నేపథ్యం
[మార్చు]దుర్గా (జగపతి బాబు) అనిత (రేవతి) తో ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకుంటారు. కాని దుర్గా అన్న మోహన కృష్ణ (చరణ్ రాజ్) మాఫియా గొడవల్లో స్థానిక ఎమ్మెల్యే గురు నారాయణ్ (కోట శ్రీనివాస రావు) చేత చంపబడుతాడు. దాంతో దుర్గా జీవితం మారిపొతుంది. అతని మార్గాన్ని అంగీకరించని అనిత ఒక పోలీసును వివాహం చేసుకుంటుంది. దుర్గా, పోలీసు ఇద్దరూ గురు నారాయణ్‌కు శత్రువులు అవుతారు. దుర్గా, సర్కార్, ఇన్స్పెక్టర్ల మధ్య గొడవలు వచ్చి చివరకు గురు నారాయణ్ చంపబడుతాడు.
నటీనటులు
[మార్చు]- జగపతి బాబు (దుర్గా)
- ఊర్మిళా మండోద్కర్ (చిత్ర)
- రేవతి (అనిత)
- సిరివెన్నెల సీతారామశాస్త్రి (పాత్రికేయుడు స్వామి)
- కోట శ్రీనివాసరావు (గురు నారాయణ్)
- చరణ్ రాజ్ (మోహన కృష్ణ)
- తనికెళ్ళ భరణి (లాయర్ సాబ్)
- అన్నపూర్ణ (చిత్ర తల్లి)
- మన్నవ బాలయ్య (చారిగారు)
- రామిరెడ్డి (సర్కార్)
- ఉత్తేజ్ (యాదగిరి)
- బెనర్జీ (బెనర్జీ)
- నర్సింగ్ యాదవ్ (నర్సింగ్)
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- శివకృష్ణ (భరద్వాజ)
- టార్జాన్ (శ్రీశైలం)
- నారాయణరావు
- రాగిణి
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ
- నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
- మాటలు: పోసాని కృష్ణమురళి
- కథ: రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం
- సంగీతం: శ్రీ
- ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
- కూర్పు: శంకర్
- నిర్మాణ సంస్థ: ఎస్.ఎస్. క్రియేషన్స్
పాటలు
[మార్చు]| గాయం | |
|---|---|
| పాటలు by శ్రీ | |
| Released | 1993 |
| Recorded | 1993 |
| Genre | పాటలు |
| Length | 25:45 |
| Label | సూర్య ఆడియో |
| Producer | శ్రీ |
ఈ చిత్రానికి శ్రీ (సంగీత దర్శకులు) సంగీతం అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు. అన్ని పాటలు విజయవంతమయ్యాయి. సూర్య ఆడియో కంపెనీ పాటలను విడుదల చేసింది.
| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "నైజాం పోరి" | మనో, కె. ఎస్. చిత్ర, ఈశ్వర్ | 5:20 |
| 2. | "నిగ్గదీసి అడుగు" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 2:06 |
| 3. | "అలుపన్నది ఉందా" | చిత్ర | 5:41 |
| 4. | "సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:56 |
| 5. | "చెలిమీద చిటికెడు" | మనో చిత్ర | 6:59 |
| మొత్తం నిడివి: | 25:45 | ||
అవార్డులు
[మార్చు]- నంది ఉత్తమ నటులు - జగపతిబాబు
- నంది ఉత్తమ సహాయనటీమణులు - ఊర్మిళ
- నంది ఉత్తమ ప్రతినాయకులు - కోట శ్రీనివాసరావు
- నంది ఉత్తమ గీత రచయితలు - సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నంది ఉత్తమ ఎడిటర్లు - శంకర్
- నంది ఉత్తమ ఛాయాగ్రహకులు రసూల్ ఎల్లోర్
ఇతర వివరాలు
[మార్చు]ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన తరువాత రామ్ గోపాల్ వర్మ,జగపతిబాబు కాంబినేషన్‌లో గాయం-2 పేరుతో సీక్వెల్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా, ప్రవీణ్ శ్రీ దర్శకుడిగా, విమలా రామన్ హీరోయిన్‌గా కోట శ్రీనివాస రావు విలన్‌గా సినిమా తీశారు.
మూలాలు
[మార్చు]- ↑ "Jagapathi to do 'Gaayam-2'". IndiaGlitz. 28 November 2009. Archived from the original on 30 నవంబర్ 2009. Retrieved 4 August 2020.
{{cite news}}: Check date values in:|archive-date=(help) - ↑ "Retrospect: Gaayam (1993)". Telugu Cinema. Archived from the original on 3 అక్టోబరు 2011. Retrieved 4 ఆగస్టు 2020.
ఇతర లంకెలు
[మార్చు]- 1993 సినిమాలు
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- నంది పురస్కారాలు
- 1993 తెలుగు సినిమాలు
- జగపతి బాబు నటించిన సినిమాలు
- పోసాని కృష్ణ మురళి సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- ఉత్తేజ్ నటించిన సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు
- రేవతి నటించిన సినిమాలు
