గాయత్రి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాయత్రి
గాయత్రి సినిమా పోస్టర్
దర్శకత్వంమదన్
రచనడైమండ్ రత్నబాబు
నిర్మాతమోహన్ బాబు
తారాగణంమోహన్ బాబు
శ్రియా సరన్
విష్ణు మంచు
బ్రహ్మానందం
అనసూయ భరధ్వాజ్
నిఖిలా విమల్
పోసాని కృష్ణ మురళి
కోట శ్రీనివాసరావు
తనికెళ్ళ భరణి
ఆలీ
ఛాయాగ్రహణంసర్వేష్ మురారి
సంగీతంఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
9 ఫిబ్రవరి 2018
సినిమా నిడివి
125 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

గాయత్రి 2018, ఫిబ్రవరి 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, శ్రియా సరన్, విష్ణు మంచు, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.[1][2][3][4] ఇది అమితాబ్ రెజా చౌదరి దర్శకత్వం వహించిన బంగ్లాదేశ్ సినిమా అనాబాజీ (2016) కి రీమేక్ సినిమా.[5][6]

శివాజీ (వ‌య‌సులో ఉన్న‌ప్పుడు విష్ణు, వ‌య‌సు మ‌ళ్లిన త‌ర్వాత మోహ‌న్‌బాబు) ఒక కళాకారుడు (నటుడు). అత‌ని న‌ట‌నను చూసి ఇష్ట‌ప‌డుతుంది శార‌ద. వారిద్ద‌రికీ శార‌ద తండ్రి ఘ‌నంగా పెళ్లి చేస్తాడు. శార‌ద తండ్రి అతి మంచిత‌నం వ‌ల్ల ఉన్న ఆస్తుల‌న్నీ పోగొట్టుకుంటాడు. అత‌ను క‌న్నుమూయ‌డంతో ఉన్న ఇల్లును కూడా జ‌ప్తు చేస్తారు. శార‌ద త‌న భ‌ర్త‌తో పాటు కొత్త ఇంటికి చేరుకుంటుంది. ఆమె సూచ‌న మేర‌కు శివాజీ న‌ట‌న మీద దృష్టి పెట్టి ప్ర‌శంస‌లు అందుకుంటుంటాడు. ఉన్న‌ట్టుండి శార‌ద మంచాన‌ప‌డుతుంది. ఆమె చికిత్స కోసం రూ.ల‌క్ష సంపాదించ‌డానికి శివాజీ నిజ జీవితంలో మ‌రో వ్య‌క్తిగా న‌టించి జైలు పాల‌వుతాడు. తిరిగి వ‌చ్చేస‌రికి అత‌ని భార్య చ‌నిపోయింద‌ని, పుట్టిన పాప అనాథ ఆశ్ర‌మానికి చేరుకుంద‌ని తెలుస్తుంది. అప్ప‌టి నుంచి ఆ పాప కోసం గాలిస్తుంటాడు. త‌న బిడ్డ‌లాంటి అనాథ పిల్ల‌ల కోసం శార‌దా అనాధ శరణాలయం ను నిర్వ‌హిస్తుంటాడు. త‌ప్పిపోయిన పిల్ల‌ల‌ను కాపాడి వాళ్ల త‌ల్లిదండ్రులకు అప్ప‌గిస్తుంటాడు. శరణాలయం నిర్వ‌హణ కోసం మారు వేషాలు వేస్తూ జైలుకు వెళ్తుంటాడు. ఆ క్ర‌మంలోనే అత‌నికి గాయ‌త్రీ ప‌టేల్ (మోహ‌న్‌బాబు) ప‌రిచ‌య‌మ‌వుతాడు. శివాజీ, గాయ‌త్రీప‌టేల్ చూడ్డానికి ఒక‌టే ర‌కంగా ఉంటారు. దాంతో వారిద్ద‌రి మ‌ధ్య ఓ ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందంలో శివాజీ మోస‌పోతాడు. అయితే దీనికి ప్ర‌ధాన కార‌ణం శివాజీ కుమార్తె అవుతుంది. ఇంత‌కీ ఆమె ఎందుకు కార‌ణ‌మైంది? మ‌ధ్య‌లో శ్రేష్ఠ ఎవ‌రు? ఆమె వ‌ల్ల శివాజీకి జ‌రిగిన మంచి ఏంటి? చెడు ఏంటి? శేఖ‌ర్‌ని, శివాజీ స్నేహితుడు ప్ర‌సాద్‌ని గాయ‌త్రి ప‌టేల్ ఎందుకు చంపించాడు వంటివ‌న్నీ మిగిలిన కథలో భాగం.

తారాగణం

[మార్చు]

[7]

సాంకేతికవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంలో గాయత్రి అనే చిత్రాన్ని నిర్మించబోతున్నామని, అందులోని హీరో, విలన్ రెండు పాత్రల్లో తాను నటిస్తున్నట్టు,మంచు విష్ణు, శ్రియా సరన్ అందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్టు మోహన్ బాబు ప్రకటించాడు. నటులు బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, అలీ ముఖ్యమైన పాత్రలు పోషించడానికి, ఎస్.తమన్ సంగీతాన్ని అందించడానికి సంతకం చేశారు. ఈ చిత్రాన్ని తిరుపతి, రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. జై సింహా చిత్రీకరణలో ఉన్న నటుడు నందమూరి బాలకృష్ణ గాయత్రీ షూటింగ్ లోకేషన్ కు వచ్చి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు.[8] యాక్షన్ డైరెక్టర్ కనల్ కన్నన్, విఎఫెక్స్ కోసం నీరో మోషన్ కంట్రోల్ రిగ్ ఉపయోగించి 11 రోజులపాటు మోహన్ బాబు రెండు పాత్రల మధ్య ఒక ఫైట్ ను చిత్రీకరించారు.[9]

పాటలు

[మార్చు]

ఎస్. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు సిల్లీ మాంక్స్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "జై హనుమాన్ (రచన: సుద్దాల అశోక్ తేజ)"  శంకర్ మహదేవన్ 5:25
2. "తెల్ల తెల్ల (రచన: రామజోగయ్య శాస్త్రి)"  మధు బాలకృష్ణన్ 4:02
3. "ఒకనువ్వు ఒకనేను (రచన: రామజోగయ్య శాస్త్రి)"  జుబిన్ నౌనియాన్, శ్రేయా ఘోషాల్ 5:39
4. "వేకువమ్మ (రచన: సుద్దాల అశోక్ తేజ)"  ఎస్.పి.బాలసుబ్రమణ్యం 4:09
5. "సరసమహ (రచన: రామజోగయ్య శాస్త్రి)"  రమ్య బెహరా 4:31
6. "రావణబ్రహ్మ (రచన: రామజోగయ్య శాస్త్రి)"  మనో 3:11
26:57

విడుదల

[మార్చు]

2017, డిసెంబరు 25న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ విడుదలయింది.[10] 2018, జనవరి 1న విష్ణు-శ్రేయా సరన్ ఫస్ట్ లుక్ విడుదలయింది.[11]

స్పందన

[మార్చు]

దక్కన్ క్రానికల్ 2.5/5 రేటింగ్ ఇవ్వగా [12] ఫస్ట్ పోస్ట్,[13] న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్[14] మోహన్ బాబు నటన బాగుందని రాశాయి.

మూలాలు

[మార్చు]
 1. Kavirayani, Suresh (30 January 2018). "When a film fails, even the wife neglects you: Mohan Babu". Deccan Chronicle. Retrieved 26 December 2019.
 2. "Vishnu Manchu reveals the career risk he took for Mohan Babu's Gayatri". 6 February 2018.
 3. "Gayatri (Gayathri) movie review and rating by audience: Live updates". 9 February 2018.
 4. "Gayatri trailer out: Mohan Babu looks intimidating in this gangster drama".
 5. "Aynabaji is getting a Telegu remake". The Daily Star. 8 August 2017.
 6. "'Aynabaji' to be remade in India". NTV Online. Archived from the original on 24 April 2019. Retrieved 26 December 2019.
 7. సితార, తారా తోరణం. "మంచు కుటుంబంలో మంచి నటుడు - మంచు విష్ణు". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Archived from the original on 7 June 2020. Retrieved 7 June 2020.
 8. "Vishnu Manchu and Shriya Saran start shooting for Mohan Babu's 'Gayatri'". Sify.com. Archived from the original on 26 December 2019. Retrieved 26 December 2019.
 9. Pudipeddi, Haricharan (10 January 2018). "At 67, Mohan Babu stuns crew of Gayatri with thrilling a stunt sequence". Hindustan Times. Retrieved 26 December 2019.
 10. "Mohan Babu is Ferocious as Villain in Gayatri: Vishnu Manchu". News 18. 25 December 2017. Retrieved 21 October 2018.
 11. Nyayapati, Neeshita (1 January 2018). "After Dr Mohan Babu's first look on Christmas, Vishnu Manchu". The Times of India. Retrieved 26 December 2019.
 12. KAVIRAYANI, SURESH (11 February 2018). "Gayatri movie review: It's Mohan Babu all the way". Deccan Chronicle. Retrieved 26 December 2019.
 13. Kumar, Hemanth (9 February 2018). "Gayatri movie review: Plot takes a backseat in what can only be called a show reel for Mohan Babu". Firstpost. Retrieved 26 December 2019.
 14. "'Gayatri' movie review: Tailor made for Mohan Babu". New Indian Express. 9 February 2018. Retrieved 26 December 2019.

ఇతర లంకెలు

[మార్చు]