గార్లదిన్న సుబ్బారావు
గార్లదిన్న సుబ్బారావు | |
---|---|
జననం | గార్లదిన్న సుబ్బారావు 1893 సోదనపల్లె, శింగనమల మండలం, అనంతపురం జిల్లా |
మరణం | 1966 |
ప్రసిద్ధి | కవి, రచయిత |
మతం | హిందూ |
తండ్రి | పెద్దనారాయణప్ప |
తల్లి | నరసమ్మ |
గార్లదిన్న సుబ్బారావు (1893 - 1966) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత.[1]
జననం, కుటుంబం
[మార్చు]గార్లదిన్న సుబ్బారావు 1893లో అనంతపురం జిల్లా, శింగనమల మండలంలోని సోదనపల్లెలో జన్మించారు. తల్లి నరసమ్మ, తండ్రి పెద్దనారాయణప్ప. ఇతను హిందూ బ్రాహ్మణ స్మార్త కులానికి, కౌండిన్యస గోత్రానికి చెందినవాడు. ఇతని ముత్తాత తండ్రి పెద్ద నారాయణప్ప (వంశకర్త), ముత్తాత అశ్వత్థవృ, తాత సుబ్బరావు.[2]
సాహిత్య ప్రస్థానం
[మార్చు]సుబ్బారావు గౌరన రచించిన హరిశ్చంద్ర కావ్యంలోని అంశాలను గ్రహించి, కథా రుచి కోసం కొన్ని కల్పనలు జోడించి ద్విపదలో 'ఉత్తర హరిశ్చంద్రీయము'ను రచించాడు. గౌరన కావ్యానికి ఇది తరువాతి రచన కావడం వల్ల దీనికి 'ఉత్తర హరిశ్చంద్రీయము' అని పేరు పెట్టాడు. ఈ కావ్యాన్ని 1935 జూన్ నెలలో శ్రీయుత రాచోటి రామయ్యకి (ఆదోని) అంకితం చేశాడు.[3] 'ఉత్తర హరిశ్చంద్రీయము' ఆరు ఆశ్వాసాల ద్విపద కావ్యం. సుబ్బారావు హరికథలను కూడా రచించాడు, కానీ అవి వ్రాత ప్రతులుగానే మిగిలిపోయాయి.[4] 'దుర్గాదాసీయమ' అనే నాటకాన్ని కూడా రచించాడు, ఇది కూడా వ్రాత ప్రతిగానే ఉంది. 'ఉత్తర హరిశ్చంద్రీయము'లోని ఉపోద్ఘాతం ద్వారా 'కృష్ణ శతకము', 'రామకుమారాభ్యుదయము' (నాటకం), మరియు 'అనసూయామహిమ' (నాటకం) అనే గ్రంథాలను కూడా రచించినట్లు తెలుస్తుంది. వీటిని కీ.శే. బదినేహాళు తమ్మిరెడ్డి ముద్రించారు.[5]
మరణం
[మార్చు]గార్లదిన్న సుబ్బారావు 1966లో మరణించారు.
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).