గాస్ అటవీ మ్యూజియం
![]() | |
Former name | కోయంబత్తూర్ లో అటవీ మ్యూజియం |
|---|---|
| Established | 1902 ఏప్రిల్ 15 |
| Location | కోయంబత్తూర్, తమిళనాడు , భారత్ |
| Type | ప్రకృతిచరిత్ర మ్యూజియం |
| Founder | హోరెస్ ఆర్చ్ బాల్డ్ గాస్ |
| Owner | తమిళనాడు ప్రభుత్వం |
గ్యాస్ అటవీ మ్యూజియం అనేది తమిళనాడు కోయంబత్తూరులో ఉన్న ప్రభుత్వం నడుపుతున్న ప్రకృతి చరిత్ర మ్యూజియం.
చరిత్ర.
[మార్చు]19వ శతాబ్దం చివరలో, మద్రాస్ ప్రెసిడెన్సీకి అటవీ సంరక్షకుడు అయిన జె. ఎ. గాంబుల్, ఈ ప్రావిన్స్ లో అటవీ మ్యూజియం ను స్థాపించడానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం విజయవంతం కాలేదు. అనంతరం , 1902 లోగాంబుల్ కి తరువాతి సంరక్షకుడయిన హొరస్ ఆర్చిబాల్డ్ గాస్ అటవీ మ్యూజియం స్థాపించడంలో విజయవంతమయ్యారు. దీనిని 1902 ఏప్రిల్ 15న అప్పటి మద్రాసు గవర్నర్ బారన్ ఆంప్థిల్ చేత ప్రజల సందర్శనకు తెరవ బడింది. ఆ రోజుల్లో దీనిని సాధారణంగా కోయింబత్తూర్ అటవీ మ్యూజియం గా పిలిచేవారు. మొదటి క్యురేటర్ అయిన గాస్ 1905లో పదవీ విరమణ చేసినప్పుడు, అతని వారసుడు ఎఫ్. ఎ. లాడ్జ్ అతని గౌరవార్థంగా మ్యూజియనికి ఆయన పేరును పెట్టారు. . 1905 - 1915 ల మధ్య ఈ మ్యూజియం ను బాగా విస్తరించారు.1912లో, అటవీ అధికారులకు శిక్షణ ఇవ్వడానికి మ్యూజియం ప్రాంగణంలో మద్రాస్ ఫారె స్ట్రీ కాలేజీ స్థాపించబడింది. దీనిన్ ఇప్పుడ తమిళనాడు ఫారెస్ట్ అకాడమీ అని పిలుస్తారు. 1942-47 రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఈ కాలేజీ / మ్యూజియం మూసివేయబడినవి. ఆ సమయంలో ఈ భవనాలు మాల్టా, గ్రీస్ ల నుండి తరలివచ్చిన శరణార్థులకి ఆశ్రయాలుగా ఉపయోగించబడ్డాయి. 1947లో భారత స్వాతంత్య్రం వచ్చిన తరువాత, ఈ మ్యూజియం తమిళనాడు ప్రభుత్వ పరిపాలన లోకి వచ్చింది. దీనిని ప్రస్తుతం అదే ప్రాంగణంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ (ఐఎఫ్జిటిబి) ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. [1][2] పునరుద్ధరణ పనులు చేపట్టిన తరువాత ఈ మ్యూజియం 1 మే 2015న ప్రజల సందర్శన కోసం తిరిగి తెరిచారు. .[3] సహజ వాతావరణంలో వన్యప్రాణులు, అవి ఎట్లా నివాసిస్తాయో ప్రతిబింబించే , 3 డీ డయోరమా ను కూడా చేర్చారు. .
ఇది ఉండే స్థలం
[మార్చు]ఈ మ్యూజియం కోయంబత్తూర్ నగరం నడిబొడ్డున ఉన్న కౌలీ బ్రౌన్ రోడ్డులో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ క్యాంపశు లో స్థితి అయి ఉన్నది. ఇదే ప్రాంగణంలో తమిళనాడు ఫారెస్ట్ అకాడమీ (TNFA) , ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్, సెంట్రల్ అకాడమీ ఫర్ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్ (CASFoS), తమిళనాడు అటవీ శాఖ యొక్క ఇతర కార్యాలయాలు వంటి ఇతర కళాశాలలు, కార్యాలయాలు కూడా ఉన్నాయి.[4]
చిత్రశాల
[మార్చు]ఈ మ్యూజియంలో ఉంచిన కొన్ని నమూనాలుః
- కూర్చిన అడవి దున్న (జయచామరాజ వడయార్, మైసూర్ బహుమతి)
- కూర్చిన భారతీయ జింక
- కూర్చిన చిరుత పులి
- కూర్చిన నెమలి, ఆడ నెమలి
- ఏనుగు పిండం (ప్రసిద్ధ ఏనుగుల వైద్యుడు వీ కృష్ణమూర్తిచే బహుమతి)
- ఆరపెట్టిన చందనపు మాను
- ఆరపట్టిన నీర్ కదంబ చెట్టు, మాను
మూలాలు
[మార్చు]- ↑ "The natural witness". The Hindu. 19 October 2009. Archived from the original on 7 November 2012. Retrieved 8 August 2010.
- ↑ "History of Gass Museum". Gass Forest Museum. Institute for Forest Genetics and Tree Breeding. Archived from the original on 9 July 2011. Retrieved 8 August 2010.
- ↑ "Gass Forest Museum to open again | Coimbatore News - Times of India". The Times of India. May 2015.
- ↑ "The natural witness". The Hindu. 19 October 2009. Archived from the original on 7 November 2012. Retrieved 8 August 2010.
