గిట్టల జంతువు
| గిట్టల జంతువు Temporal range:
| |
|---|---|
| పైన ఆర్టియోడాక్టైల్, పెరిస్సోడాక్టైలా కింద : దక్షిణాఫ్రికా జిరాఫ్, మైదాన బైసన్, డ్రోమెడరీ, ఎర్రజింక, అడవి పంది, ఓర్కా, సెటేషియా, మైదాన జీబ్రా, భారతీయ ఖడ్గమృగం, బ్రెజిల్ టాపిర్. | |
| Scientific classification | |
| Unrecognized taxon (fix): | యూంగులాటా |
| క్రమాలు, క్లేడ్లూ | |
| |
| Synonyms | |
| |
గిట్టల జంతువులు యూంగులాటా క్లాడ్‌లో సభ్యులు. ఈ క్లేడ్‌లో[గమనిక 1] ప్రధానంగా గిట్టలు కలిగిన పెద్ద క్షీరదాలు ఉంటాయి. వీటిని ఖురిత జంతువులనీ, ఇంగ్లీషులో అంగులేట్లు అనీ అంటారు. ఒకప్పుడు, పెనంగులేట్లు, ట్యూబులిడెంటేట్‌లు, అనేక అంతరించిపోయిన టాక్సాలతో పాటు ఇది కూడా "అంగులాటా" అనే టాక్సన్‌లో భాగంగా ఉండేది.[6] ఆ తరువాత మోలిక్యులర్ డేటాపై ఆధారపడి "అంగులాటా"ను ఒక పాలీఫైలైటిక్ సమూహం[గమనిక 2] అని నిర్ణయించారు. ఫలితంగా, 2001 లో, నిజమైన అంగులేట్‌లను లారాసియాథేరియా క్లాడ్ లో భాగంగా, కొత్తగా సృష్టించిన యూంగులాటా క్లాడ్ లోకి చేర్చారు. అలాగే, పెనంగులాటా, ట్యూబులిడెంటాటా లను సుదూర క్లాడ్ అయిన ఆఫ్రోథేరియాగా తిరిగి వర్గీకరించారు. ప్రత్యామ్నాయంగా, కొంతమంది రచయితలు యూంగులాటా క్లాడ్‌నే అంగులాటా అని కూడా అంటారు.
ఉనికిలో ఉన్న అంగులేట్లను రెండు క్రమాలుగా విభజించారు: అశ్వాలు, ఖడ్గమృగాలు, టాపిర్‌లు ఉన్న పెరిస్సోడాక్టైలా ఒక క్రమం కాగా, పశువులు, జింక, పందులు, జిరాఫీలు, ఒంటెలు, గొర్రెలు, జింకలు, హిప్పోపొటామస్‌లు ఉన్న ఆర్టియోడాక్టైలా రెండవ క్రమం. తిమింగలాలు, డాల్ఫిన్లు, పోర్పోయిస్ వంటి సెటాసియన్‌లను కూడా - వాటికి గిట్టలు లేనప్పటికీ - ఆర్టియోడాక్టిల్స్‌గా వర్గీకరించారు. నేలపై జీవించే అంగులేట్‌లు నిలబడినపుడూ నడుస్తున్నప్పుడూ వాటి శరీర బరువును ఆపడానికి వాటి కాలి గిట్టలను ఉపయోగిస్తాయి. దక్షిణ అమెరికాకు చెందిన నోటౌంగులాటా, లిటోప్టెర్నా అనే రెండు ఇతర క్రమాలు దాదాపు 12,000 సంవత్సరాల క్రితం, ప్లైస్టోసీన్ చివరిలో, అంతరించిపోయాయి.
అంగులేట్ అనే పదానికి సుమారుగా అర్థం "గిట్టలు కలిగి ఉండడం" లేదా "గిట్టలు కలిగిన జంతువు" అని. వివరణాత్మక పదంగా చూస్తే, "అంగులేట్" అనే పదం లోకి సాధారణంగా సెటాసియన్లు రావు. ఎందుకంటే వాటికి ఇతర అంగులేట్లకు ఉండే సాధారణ శరీరనిర్మాణ లక్షణాలు ఉండవు. కానీ అవి కూడా తొలి ఆర్టియోడాక్టైల్స్ నుండే వచ్చాయి.[7] సాధారణంగా అంగులేట్లు శాకాహారులు. సెల్యులోజ్‌ను జీర్ణం చేసుకోవడానికి వీటి పొట్టలో ప్రత్యేకమైన బాక్టీరియా ఉంటుంది. అయితే కొన్ని గిట్టల జంతువులలో ఇది ఉండకపోవచ్చు: అనేక జాతుల పందులు, అంతరించిపోయిన ఎంటెలోడాంట్లు సర్వభక్షకులు (మాంసాహారం, శాకాహారం రెండూ తింటాయి) కాగా, సెటాసియన్లూ, అంతరించిపోయిన మెసోనిచియన్లూ మాంసాహారులు.
వర్గీకరణలు
[మార్చు]చరిత్ర
[మార్చు]యూంగులాటా అనేది క్షీరదాలలో ఒక క్లేడ్. ప్రస్తుతం ఉనికిలో ఉన్న రెండు అంగులేట్ల క్రమాలు పెరిస్సోడాక్టైలా (బేసి సంఖ్యలో గిట్టలు ఉండే అంగులేట్లు), ఆర్టియోడాక్టైలా (సరిసంఖ్యలో గిట్టలు ఉండే అంగులేట్లు). గతంలో హైరాకోయిడియా (హైరాక్స్), సిరేనియా (సముద్ర ఆవులు, దుగోంగ్‌లు, మనాటీలు), ప్రోబోస్సిడియా (ఏనుగులు), ట్యూబులిడెంటాటా (ఆర్డ్‌వార్క్‌లు) లను కూడా "అంగులాటా" అనే క్లేడ్‌లో చేర్చారు. ఆ తరువాత అవి పాలీఫైలేటిక్ అనీ, చెల్లనివనీ తెలిసింది. పెనంగులాటా లోని మూడు క్రమాలను ఒక క్లేడ్‌గా పరిగణించారు. వీటిని ట్యూబులిడెంటాటాతో పాటు ఆఫ్రోథెరియా క్లేడ్‌లో భాగంగా పరిగణించారు. అయితే యూంగులాటాను లారాసియాథెరియా క్లేడ్‌లో చేర్చారు[8]
2009 లో శరీరనిర్మాణ [9] [10] [11] [12] మోలిక్యులర్ [13] [14] పరిశోధనల ప్రకారం, ఆర్డ్‌వార్క్‌లు, హైరాక్స్‌లు, సముద్రపు ఆవులు, ఏనుగులు పెరిసోడాక్టిల్స్, ఆర్టియోడాక్టిల్స్‌లు ఒకదానితో మరొకదానికీ, సెంగిస్, టెన్రెక్స్, గోల్డెన్ మోల్స్‌తోటీ దగ్గరి సంబంధం ఉందనీ, ఇవన్నీ ఆఫ్రోథెరియా క్లేడ్ లోకి వస్తాయనీ కనుగొన్నారు. ఏనుగులు, సముద్ర ఆవులు, హైరాక్స్‌లను పెనంగులాటా అనే క్లాడ్‌లో కలిపి ఉంచారు, అయితే ఆర్డ్‌వార్క్ వాటికి దగ్గరి బంధువుగా లేదా ఆఫ్రోఇన్‌సెక్టిఫిలియా క్లాడ్ లోని సెంగిస్‌లకు దగ్గరి బంధువుగానూ పరిగణిస్తారు.[15] ఇది కన్వర్జెంట్ పరిణామానికి ఒక చక్కటి ఉదాహరణ.[16]
అసలు ఇంత చిన్నదైన యూంగులాటా ఒక క్లాడిస్టిక్ (పరిణామ-ఆధారిత) సమూహమా లేక కేవలం ఒక ఫైనెటిక్ సమూహమా (టాక్సన్ రూపంలో) లేదా ఒక ఫోక్ టాక్సనా (అలాంటిది, అదే అని కాదు) అనే దానిపై కొంత వివాదం ఉంది. కొన్ని అధ్యయనాల్లో మెసాక్సోనియన్ అన్‌గులేట్స్, పారాక్సోనియన్ అన్‌గులేట్స్‌లు ఒక మోనోఫైలెటిక్ వంశాన్ని ఏర్పరుస్తాయని తేలింది.[17][18][19] వీటికి ఫెరుంగులాటా క్లాడ్ లోని ఫెరే (మాంసాహారులు, పాంగోలిన్లు)తో[20][21] గానీ, గబ్బిలాలతో గానీ దగ్గరి సంబంధం ఉంది.[22] వేరే అధ్యయనాల్లో, కొన్ని పెరిస్సోడాక్టైల్స్‌ను గబ్బిలాలకూ, పెగాసోఫెరేలో ఫెరేకూ దగ్గరి బంధువులని చెప్పేంతటి దగ్గరి సంబంధమేదీ ఈ రెండు క్రమాలకు లేదని తేలింది.[23] మరికొందరు, ఆర్టియోడాక్టైల్స్‌ను గబ్బిలాలకు దగ్గరి బంధువులుగా పరిగణిస్తారు.[24]
ట్యాక్సానమీ
[మార్చు]





ప్రస్తుతం ఉనికిలో ఉన్న కుటుంబాలతో, సంబంధాల వరుసలో, సరళీకృత వర్గీకరణాన్ని (అంగలేట్లు వాస్తవానికి సహజ సమూహాన్ని ఏర్పరుస్తాయని ఊహిస్తే) క్రింద చూడవచ్చు. పెకోరాన్ కుటుంబాలకూ, బలీన్ తిమింగలం కుటుంబాలకూ ఉన్న సంబంధం పట్ల ఉన్న సందిగ్ధత లాంటివి ఇంకా ఉన్నాయని గుర్తుంచుకోండి.
- యాంగులాటా [17]
- పెరిస్సోడాక్టైలా (మెసాక్సోనియన్ అన్‌గులేట్స్)
- హిప్పోమోర్ఫా
- ఈక్విడే : గుర్రాలు, గాడిదలు, జీబ్రాలు
- సెరాటోమోర్ఫా
- టాపిరిడే : టాపిర్లు
- రైనోసెరోటిడే : ఖడ్గమృగాలు
- హిప్పోమోర్ఫా
- ఆర్టియోడాక్టైలా (= సెటార్టియోడాక్టైలా ) (పారాక్సోనియన్ అన్‌గులేట్స్)
- టైలోపోడా
- కామెలిడే : ఒంటెలు, లామాలు
- ఆర్టియోఫాబులా
- సుయినా
- తయాసుయిడే : పెక్కరీస్
- సూయిడే : పందులు
- సెట్రుమినంటియా
- రుమినంటియా
- ట్రాగులిడే : చెవ్రోటైన్లు
- సెర్వోయిడియా
- యాంటిలోకాప్రిడే : ప్రాంగ్‌హార్న్
- జిరాఫిడే : జిరాఫీలు, ఒకాపి
- సెర్విడే : జింక
- మోస్చిడే : కస్తూరి జింక
- బోవిడే : పశువులు, జింకలు
- విప్పోమోర్ఫా
- హిప్పోపొటామిడే : హిప్పోపొటామస్‌లు
- సెటాసియా
- మిస్టిసెటి
- బాలెనిడే : విల్లు తల, కుడి తిమింగలాలు
- సెటోథెరిడే : పిగ్మీ కుడి తిమింగలం
- బాలెనోప్టెరిడే : రోర్క్వాల్స్
- ఒడోంటోసెటి
- ఫిసెటెరాయిడియా
- ఫిసెటెరిడే : స్పెర్మ్ వేల్
- కోగిడే : చిన్న స్పెర్మ్ తిమింగలాలు
- ప్లాటానిస్టోయిడియా
- ప్లాటానిస్టిడే : భారతీయ నది డాల్ఫిన్లు
- జిఫియోడియా
- జిఫిడే : ముక్కు తిమింగలాలు
- లిపోటోయిడియా
- లిపోటిడే : బైజి (క్రియాత్మకంగా అంతరించిపోయింది)
- ఇనియోయిడియా
- ఇనిడే : అమెజోనియన్ నది డాల్ఫిన్లు
- పాంటోపోరిడే : లా ప్లాటా డాల్ఫిన్
- డెల్ఫినోయిడియా
- మోనోడోంటిడే : బెలూగా, నార్వాల్
- ఫోకోనిడే : పోర్పోయిసెస్
- డెల్ఫినిడే : ఓషియానిక్ డాల్ఫిన్లు
- ఫిసెటెరాయిడియా
- మిస్టిసెటి
- రుమినంటియా
- సుయినా
- టైలోపోడా
- పెరిస్సోడాక్టైలా (మెసాక్సోనియన్ అన్‌గులేట్స్)
ఫైలోజెనీ
[మార్చు]అంగులేట్ కుటుంబాల ఫైలోజెనీ పట్ల సార్వజనిక ఏకాభిప్రాయం ఇలా ఉంది.[24][25]
| యూంగులాటా |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఇవి కూడా చూడండి
[మార్చు]- అల్టుంగులాటా
గమనికలు
[మార్చు]- ↑ జీవశాస్త్రంలో, క్లేడ్ అనేది కొన్ని జీవుల సమూహం. ఈ జీవులన్నిటికీ ఒకే పూర్వీకుడు ఉంటారు. ఆ పూర్వీకుడి వారసులందరూ ఈ సమూహంలో ఉంటారు. క్లేడ్ అనే మాట ప్రాచీన గ్రీకు మాట క్లాడోస్ నుండి వచ్చింది. దీనికి అర్థం 'శాఖ' అని.
- ↑ పాలీఫైలైటిక్ సమూహం అంటే, పరిమాణ క్రమంలో వేరువేరు మూలాలు కలిగిన జీవుల సమూహం. ఇందులో వాటి అత్యంత ఇటీవలి కామన్ పూర్వీకుడు భాగంగా ఉండదు. కానీ, ఈ జీవులకు ఒక సారూప్య లక్షణం ఉంటుంది. ఉదాహరణకు, క్షీరదాలు, పక్షుల పూర్వీకుల్లో వేడి రక్తం అనేది పరిణామక్రమంలో వేరువేరుగా వచ్చింది. ఆవిధంగా చూస్తే ఈ రెండూ ఒక పాలీఫైలైటిక్ సమూహం అన్నమాట.
మూలాలు
[మార్చు]- ↑ Peter J. Waddell, Hirohisa Kishino, Rissa Ota (2001). "A Phylogenetic Foundation for Comparative Mammalian Genomics". Genome Informatics 12: 141–154, doi:10.11234/gi1990.12.141.
- ↑ Cooper, L. N.; Seiffert, E. R.; Clementz, M.; Madar, S. I.; Bajpai, S.; Hussain, S. T.; Thewissen, J. G. M. (2014-10-08). "Anthracobunids from the Middle Eocene of India and Pakistan Are Stem Perissodactyls". PLOS ONE. 9 (10) e109232. Bibcode:2014PLoSO...9j9232C. doi:10.1371/journal.pone.0109232. PMC 4189980. PMID 25295875.
- ↑ Irwin, D.M. and Wilson, A.C. (1993). "Limitations of molecular methods for establishing the phylogeny of mammals, with special reference to the position of elephants". In: F.S. Szalay, M.J. Novacek, and M.C. McKenna (eds.), Mammal Phylogeny: Placentals. pp. 257–267, Springer-Verlag, New York.
- ↑ de Queiroz, K.; Cantino, P. D.; Gauthier, J. A., eds. (2020). "Ungulata C. Linnaeus 1766 [J. D. Archibald], converted clade name". Phylonyms: A Companion to the PhyloCode. Boca Raton: CRC Press. pp. 943–947. ISBN 978-1-138-33293-5.
- ↑ "Ungulata". RegNum. Retrieved 15 August 2025.
- ↑ McKenna, M.C. (1975). "Toward a phylogenetic classification of the Mammalia". In Luckett, W.P.; Szalay, F.S. (eds.). Phylogeny of the primates: a multidisciplinary approach (Proceedings of WennerGren Symposium no. 61, Burg Wartenstein, Austria, July 6–14, 1974. New York: Plenum. pp. 21–46. doi:10.1007/978-1-4684-2166-8_2. ISBN 978-1-4684-2168-2.
- ↑ Ursing, B. M.. "Analyses of mitochondrial genomes strongly support a hippopotamus-whale clade".
- ↑ (2024-09-02). "A new dentition-based phylogeny of Litopterna (Mammalia: Placentalia) and 'archaic' South American ungulates".
- ↑ . "Unique biochemical and mineral composition of whale ear bones".
- ↑ Tabuce. "Early tertiary mammals from north Africa reinforce the molecular afrotheria clade".
- ↑ Seiffert. "A new estimate of afrotherian phylogeny based on simultaneous analysis of genomic, morphological, and fossil evidence".
- ↑ Sanchez-Villagra. "Thoracolumbar vertebral number: the first skeletal synapomorphy for afrotherian mammals".
- ↑ McKenna, M.C. (1975). "Toward a phylogenetic classification of the Mammalia". In Luckett, W.P.; Szalay, F.S. (eds.). Phylogeny of the primates: a multidisciplinary approach (Proceedings of WennerGren Symposium no. 61, Burg Wartenstein, Austria, July 6–14, 1974. New York: Plenum. pp. 21–46. doi:10.1007/978-1-4684-2166-8_2. ISBN 978-1-4684-2168-2.
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ Seiffert, E.R.. "A new estimate of afrotherian phylogeny based on simultaneous analysis of genomic, morphological, and fossil evidence".
- ↑ . "Unique biochemical and mineral composition of whale ear bones".
- ↑ 17.0 17.1 . "Nomenclature and placental mammal phylogeny".
- ↑ . "Relationships of Cetacea (Artiodactyla) among mammals: increased taxon sampling alters interpretations of key fossils and character evolution".
- ↑ . "Resolution of the laurasiatherian phylogeny: Evidence from genomic data".
- ↑ . "Unique biochemical and mineral composition of whale ear bones".
- ↑ McKenna, M.C. (1975). "Toward a phylogenetic classification of the Mammalia". In Luckett, W.P.; Szalay, F.S. (eds.). Phylogeny of the primates: a multidisciplinary approach (Proceedings of WennerGren Symposium no. 61, Burg Wartenstein, Austria, July 6–14, 1974. New York: Plenum. pp. 21–46. doi:10.1007/978-1-4684-2166-8_2. ISBN 978-1-4684-2168-2.
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ . "Unique biochemical and mineral composition of whale ear bones".
- ↑ 24.0 24.1 (February 2013). "A phylogenetic blueprint for a modern whale".
- ↑ . "Unique biochemical and mineral composition of whale ear bones".