Jump to content

గీతాంజలి సింగ్

వికీపీడియా నుండి
గీతాంజలి సింగ్
జననం8 ఫిబ్రవరి
గోరఖ్‌పూర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2013–ప్రస్తుతం
ప్రసిద్ధితుమ్హారీ పాఖీ, దిల్ తో హ్యాపీ హై జీ, ఫల్సఫాః ది అదర్ సైడ్

గీతాంజలి సింగ్ ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి, ఆమె టెలివిజన్ షోలైన తుమ్హారి పాఖీ, మిలియన్ డాలర్ గర్ల్, దిల్ తో హ్యాపీ హై జీ వంటి వాటిలో నటించి ప్రసిద్ధి చెందింది. అమెజాన్, నెస్లే, నికాన్, అజియో, ఫ్లిప్‌కార్ట్, కాక్స్ & కింగ్స్ వంటి బ్రాండ్ల ప్రకటనలలో ఆమె కనిపించింది. ఆమె నటించిన చిత్రం ఫల్సఫాః ది అదర్ సైడ్ 2019లో విడుదలైంది.

కెరీర్

[మార్చు]

గీతాంజలి సింగ్ ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ కు చెందినది. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన మొదటి వ్యక్తి,. 2013లో ఆమె భారతీయ చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమలలోకి అడుగు పెట్టింది.[1] ఆమెతుమ్హారి పాఖీ (2013-2014) అనే ధారావాహిక మొత్తం 269 ఎపిసోడ్లలో దీపిక పాత్రను పోషించింది.[2][3] 2019లో, ఆమె బాలీవుడ్ చిత్రం, ఫల్సఫాః ది అదర్ సైడ్ లో, మానిట్ జౌరా, సుమిత్ గులాటిల సరసన నటించింది.[2] ఆమె మిలియన్ డాలర్ గర్ల్, దిల్ తో హ్యాపీ హై జీ (2019) అనే టీవీ సిరీస్లతో పాటు టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో కూడా చేసింది.[2][2][4][5]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర గమనిక
2013–2014 తుమ్హారి పాఖీ దీపికా టీవీ సిరీస్, 269 ఎపిసోడ్లు
2014/2015 మిలియన్ డాలర్ గర్ల్ కావ్యా టీవీ సిరీస్
2019 ఫల్సఫాః ది అదర్ సైడ్ ఇషా సినిమా
2019 దిల్ తో హ్యాపీ హై జీ డింకీ మెహ్రా టీవీ ధారావాహికాలు, 2 భాగాలు

మూలాలు

[మార్చు]
  1. "Struggle has been my best teacher". Times of India. Retrieved January 11, 2025.
  2. 1 2 3 4 Reza Noorani (28 September 2018). "Geetanjali Singh: Struggle has been my best teacher". Times of India. Retrieved 5 March 2020.
  3. Team, Tellychakkar. "Tumhari Pakhi's Geetanjali Singh talks about her film Falsafa!". Tellychakkar.com.
  4. Tanvi Trivedi (9 February 2019). "Geetanjali Singh: There should be meatier roles for supporting actors, too". Times of India. Retrieved 5 March 2020.
  5. "Dil Toh Happy Hai Ji s Geetanjali Singh: Playing a Punjabi bride is a lot of fun". mid-day. 20 January 2019.[permanent dead link]