Jump to content

గీతాంజలి (1989 సినిమా)

వికీపీడియా నుండి
గీతాంజలి
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం మణిరత్నం
నిర్మాణం నరసారెడ్డి
కథ మణిరత్నం
తారాగణం అక్కినేని నాగార్జున (ప్రకాష్),
గిరిజ (గీతాంజలి),
విజయకుమార్,
షావుకారు జానకి (ఛాన్సలర్),
ముచ్చెర్ల అరుణ (డాక్టర్),
రాధాబాయి,
డిస్కో శాంతి,
సిల్క్ స్మిత,
సుమిత్ర,
విజయచందర్
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం బాలు,
ఎస్. జానకి
సంభాషణలు రాజశ్రీ
ఛాయాగ్రహణం పి.సి.శ్రీరామ్
నిర్మాణ సంస్థ భాగ్యలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

గీతాంజలి , 19 మే 1989 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, గిరిజ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం ఇళయరాజా సమకూర్చారు. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషలలోకి కూడా అనువదించబడింది. చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి.

చిత్ర కథానాయకుడు ప్రకాష్ (అక్కినేని నాగార్జున) పరిచయంతో కథ మొదలవుతుంది. ప్రకాష్ ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా తిరిగే యువకుడు. కాలేజీ లో చదువుతుంటాడు. అయితే అతనికి ప్రాణాంతకమైన వ్యాధి ఒకటి ఉంది అని తెలుస్తుంది. విరక్తి చెందిన ప్రకాష్ అన్నింటినీ వదిలేసి ఊటీ వెళ్ళిపొతాడు. అక్కడ అతనికి గీతాంజలి (గిరిజ) పరిచయం అవుతుంది. గీతాంజలి తండ్రి ఊటీ లో పెద్ద వైద్యుడు. గీతంజలి చాలా చురుకైన అమ్మాయి. ఎప్పుడూ అందరిని ఆటపట్టిస్తూ, నవ్వుతూ ఉంటుంది. అయితే ఆమె కూడా ఒక వ్యాధి తో బాధ పడుతుంది. అయితే ప్రకాష్ కు భిన్నంగా వ్యాధి గురించి ఎక్కువగా ఆలొచించకుండా జీవితాన్ని చలాకీగా గడుపుతుంది. ప్రకాష్, గీతంజలి ల మధ్య పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. కానీ ప్రకాష్‌కి వ్యాధి ఉన్న విషయం గీతాంజలికి తెలియదు.

కథ అభివృద్ధి, చిత్రీకరణ

[మార్చు]
"గీతాంజలి" సినిమా విజయాన్ని పురస్కరించుకొని అభిమానులు ఇచ్చిన ప్రకటన

"యంగ్ డై ఫస్ట్" అనే అంగ్ల చిత్రాన్ని చూసి ప్రేరణ పొందిన దర్శకుడు మణిరత్నం అదే తరహాలో ఈ కథ రాసుకున్నాడు.[1] కథానాయిక పేరు గీతాంజలి ఢిల్లీ కి చెందిన 11 సంవత్సరాల బాలిక పేరు. త్వరలో చనిపోనున్నాని తెలిసి ఆమె రాసుకున్న డైరీలు ఒక పత్రికలో ప్రచురితం అయ్యాయి. అవి చూసి చలించిన దర్శకుడు కథకు అదే పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. 12అక్టోబర్,1988 నాడు చిత్రీకరణ మొదలయింది. చిత్రీకరణ మొత్తం 60 రోజుల్లో పూర్తి అయింది. గిరిజ పాత్రకు ఎస్.పి.శైలజ, గిరిజ నానమ్మ పాత్రకు జానకి పాటలు పాడారు.

పాటలు

[మార్చు]
Untitled

అన్ని పాటల రచయిత వేటూరి, ఈ చిత్రం లోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతం అందించింది ఇళయరాజా.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "జగడ జగడ జగడం"  బాలు  
2. "జల్లంత కవ్వింత కావాలి లే"  చిత్ర  
3. "ఆమనీ పాడవే"  బాలు  
4. "నందికొండ వాగుల్లో"  బాలు, చిత్ర  
5. "ఓం నమః"  బాలు, ఎస్. జానకి  
6. "ఓ పాపా లాలీ"  బాలు  
7. "ఓ ప్రియా ప్రియా"  బాలు, చిత్ర  

పురస్కారాలు

[మార్చు]
37th భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
37th దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
నంది పురస్కారాలు

చిత్ర గొప్పదనం

[మార్చు]

ఈ చిత్రం విడుదల నాగార్జున యొక్క మరొక అపూర్వ విజయం సాధించిన శివ చిత్రం విడుదలకు ఆరునెలల ముందు జరిగినది. రెండు చిత్రాల కథలలో వ్యత్యాసం, చిత్రీకరించిన విధానము తెలుగు సినిమాకు నూతనముగా ఉండటము చేత గొప్ప విజయాలుగా నిలిచాయి. ఈ చిత్ర విడుదల తరువాత నాగార్జున ఆంధ్ర అందగాడుగా కీర్తిగాంచాడు. ఎందరో అమ్మాయిల మనస్సు దోచుకున్న మన్మధునిగా నాగార్జున నిలిచిపోయారు. ఈ చిత్రము నుండి నాగార్జునకు కొత్తదనాన్ని అభిలషించే వ్యక్తిగా ప్రశంసలు పొందారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-04-18. Retrieved 2009-01-04.
  2. "37th National Film Awards" (PDF). Directorate of Film Festivals. p. 19. Archived from the original (PDF) on 2 అక్టోబరు 2013. Retrieved 11 August 2012.
  3. "Geethanjali listed as best evergreen Telugu movie". Archived from the original on 2014-12-23. Retrieved 2021-03-27.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు