గీతా ఫోగట్
గీతా ఫోగట్ (జననం 15 డిసెంబరు 1988)[1] ప్రముఖ భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి. 2010లో జరిగిన కామన్ వెల్త్ ఆటల్లో భారతదేశానికి మొట్టమొదటిసారి బంగారు పతకం తెచ్చిన ఏకైక క్రీడాకారిణి గీతా కావడం విశేషం. ఒలెంపిక్స్ కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి కూడా గీతానే.[2]
వ్యక్తిగత జీవితం, కుటుంబం[మార్చు]
హర్యానాలోని భివానీ జిల్లాలో ఉన్న బలాలీ గ్రామంలో హిందూ జాట్ కుటుంబంలో జన్మించారు గీతా. ఆమె తండ్రి మహావీర్ సింగ్ ఫొగట్ మాజీ కుస్తీ క్రీడాకారుడే కాక, ఆమెకు కోచ్ కూడా.[3][4]
ఆమె చెల్లెలు బబితా కుమారి, వినేశ్ ఫోగట్ లు కూడా కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకాలు గెలుచుకున్నారు.[5][6]
కెరీర్[మార్చు]
2009 కామెన్ వెల్త్ కుస్తీ చాంపియన్ షిప్[మార్చు]
2009 డిసెంబరు 19 నుంచి 21 వరకు పంజాబ్లోని జలంధర్ లో జరిగిన కామన్ వెల్త్ కుస్తీ చాంపియన్ షిప్ లో గీతా బంగారు పతకం గెలుచుకున్నారు.[7]
2010 కామన్ వెల్త్ క్రీడలు[మార్చు]
2010లో ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఇమేలీ బెంస్టెడ్ ను ఓడించి, మహిళా కుస్తీ చాంపియన్ షిప్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం సాధించిన ఘనత స్వంతం చేసుకున్నారు గీతా.[8][9]
మూలాలు[మార్చు]
- ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>
కాదు;sr
అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>
కాదు;intoday1
అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ The hero behind 'Dangal' - Times of India.
- ↑ Wrestling coach Mahavir Phogat overlooked for Dronacharya Award - Sports.
- ↑ Meet the medal winning Phogat sisters | Latest News & Updates at Daily News & Analysis.
- ↑ "But hey, this is family...", 31 July 2010, Times of India, retrieved 11 October 2013
- ↑ 2009 Championships. URL accessed on 2 November 2015.
- ↑ Barua, Suhrid (19 August 2015). Interview with Geeta Phogat: "I am determined to go beyond my World Championships bronze medal finish".
- ↑ International Wrestling Database. URL accessed on 2 November 2015.