గీతా మకరందం
స్వరూపం
గీతా మకరందం శ్రీకాళహస్తిలోని శ్రీ శుకబ్రహ్మాశ్రమ వ్యవస్థాపకుడైన విద్యా ప్రకాశానందగిరి స్వామి భగవద్గీతపై రచించిన గ్రంథం. విద్యాప్రకాశానంద గిరి స్వామి తన జీవితకాలంలో తన ఆశ్రమంలోనే కాక ఊరూరా తిరుగుతూ భగవద్గీతపై అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. నూరు గీతా జ్ఞానయజ్ఞాలు చేశాడు. వాటి సారమే ఈ గ్రంథం. 1000 పేజీలకు పైబడిన ఈ గ్రంథంలో భగవద్గీతలోని మూల శ్లోకము, ప్రతి శ్లోకానికి అవతారిక, ప్రతిపదార్థం, తాత్పర్యం, వ్యాఖ్యానం, ప్రశ్నోత్తరాలు, ఇంకా గీతను గూర్చి పలు వివరణలు ఉంటాయి. మొదటి 100 పేజీలలో గీతా తత్వాన్ని సులభంగా బోధించే పాఠ్యం ఉంటుంది. ఈ పుస్తకం తెలుగులోనే కాక, ఆంగ్ల, తమిళ, కన్నడ భాషల్లో కూడా లభ్యం అవుతుంది.[1] భారతదేశంలో మెట్రోమ్యాన్ గా ప్రసిద్ధుడైన ఇ. శ్రీధరన్ భవవద్గీత గురించి అధ్యయనం చేయడానికి ఈ పుస్తకం ఆంగ్ల అనువాదాన్ని చదువుతానని చెప్పాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Books". srisukabrahmashram (in ఇంగ్లీష్). 2024-04-28. Retrieved 2024-12-02.
- ↑ P, Venkata sriram (2016-12-02). "[Advaita-l] Gita and westerners comments". Retrieved 2024-12-02.