గీతా రామస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీతా రామస్వామి
జననం
జాతీయతభారతీయురాలు
విద్యఎం.ఎస్.సి.
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిసామాజిక కార్యకర్త, రచయిత్రి, ప్రచురణకర్త
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
జీవిత భాగస్వామిసిరిల్ రెడ్డి[1]
బంధువులుజార్జి రెడ్డి

గీతా రామస్వామి ఒక సామాజిక కార్యకర్త, రచయిత్రి. ఈమె హైదరాబాద్ బుక్ ట్రస్ట్ అనే లాభాపేక్ష రహిత పుస్తక ప్రచురణ సంస్థ తరఫున పనిచేస్తున్నది. ఈమె ఇండియా స్టింకింగ్, టేకింగ్ ఛార్జ్ ఆఫ్ అవర్ బాడీ, ఆన్ దెయిర్ ఓన్, ది ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఆంథాలజీ ఆఫ్ తెలుగు దళిత్ వ్రైటింగ్ , లైఫ్ ఇన్ అనంతారం, నేను కమ్యూనిస్టుని వంటి రచనలు చేసింది. ఇటీవల గౌరీ లంకేశ్ రచనల తెలుగు అనువాదాన్ని ప్రచురించింది.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

పురుషాధిక్య భావజాలం గల సనాతన భారతీయ బ్రాహ్మణకుటుంబంలో జన్మించిన గీత చిన్నతనం నుండే తన ప్రతిబంధకాలను అనుకూలంగా మార్చుకుంది. ఈమె తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో తరచూ బదిలీలు జరిగేవి. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఈమె జన్మించింది. ముంబైలో కొంత వరకు, చెన్నైలో కొంత వరకు చదివి హైదరాబాద్‌ వచ్చింది. కోఠీ విమెన్స్‌ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ ‌ చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైన్స్‌ కాలేజ్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేరింది. చదువుకునే రోజుల్లోనే పేదరికం, అసమానత్వం పరిష్కారం దొరకని ప్రశ్నలుగా ఈమెను వెంటాడాయి. ఈ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి సంఘాల వైపు ఈమె ఆకర్షింపబడింది. తర్వాత కాలంలో ఇంట్లో జరిగిన పరిణామాలూ, ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో వాతావరణమూ తన పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ను మధ్యలోనే వదిలేసి ఉద్యమంలో పూర్తిస్థాయి భాగస్వామి అయ్యేలా చేశాయి.[3] క్యాంపస్‌లో జార్జి రెడ్డి నాయకత్వంలోని ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ మహిళలను గౌరవించడం, సమానంగా చూడ్డం చేసేది. ఈ అంశమే మిగతా ఎందరో విద్యార్థులతోపాటు ఈమెనూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల వామపక్ష ఉద్యమంలో చేరేలా చేశాయి. అలా మహిళా శక్తిలా ఎదిగి, దూసుకెళ్లిన గీత ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. 1975లోనే జార్జిరెడ్డి తమ్ముడు సిరిల్‌ రెడ్డిని వివాహం చేసుకుంది.1977లో పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం పనిచేయడానికి ఘజియాబాద్‌ వెళ్లి అక్కడే మూడేళ్లుంది. తిరిగొచ్చిన తర్వాత తెలంగాణ రైతుల సమస్యలు, హక్కుల మీద పనిచేసింది. ప్రగతిశీల మహిళా సంఘం సంస్థాపకుల్లో ఈమె ఒకరు. పారిశుద్ధ్య కార్మికుల కోసం పనిచేసింది. తరువాత తెలంగాణ రైతాంగ సమస్యల హక్కులపైనా పని చేసి వ్యవసాయ కూలీ సంఘాన్ని స్థాపించింది. ఎమర్జెన్సీ సమయంలో వామపక్ష ఉద్యమంలో స్తబ్ధత రావడంతో ఈమె తన మార్గాన్ని మళ్ళించి తెలుగులో చింతనాశీలమైన సామాజిక సాహిత్యాన్ని ప్రచురించి లాభాపేక్ష లేకుండా ప్రజలకు అందజేసే ఉద్దేశంతో సి.కె.నారాయణరెడ్డి, సిరిల్‌ రెడ్డి, వీరయ్య చౌదరి, ఎం.టి.ఖాన్, సి.భరతుడు మొదలైనవారితో కలిసి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రారంభించింది. స్త్రీ వాదం, దళిత వాదం, పర్యావరణం మొదలైన సమస్యలపైన చక్కని పుస్తకాలు తీసుకొచ్చింది.[4]

రచనలు

[మార్చు]

ఇంగ్లీషు

[మార్చు]
 1. జీనా హై తో మర్నా సీఖో: ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ రెడ్డి
 2. ది ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఆంథాలజీ ఆఫ్ తెలుగు దళిత్ వ్రైటింగ్
 3. హియర్ ఐ యామ్‌ అండ్ అదర్ స్టోరీస్ (అనువాదం, మూలం:పి.సత్యవతి)
 4. లైఫ్ ఇన్ అనంతారం (దేవులపల్లి కృష్ణమూర్తి జీవితచరిత్ర ఊరు వాడ బతుకు కు అనువాదం)[5]
 5. టేకింగ్ ఛార్జ్ ఆఫ్ అవర్ బాడీస్: ఎ హెల్త్ హ్యాండ్ బుక్ ఫర్ వుమెన్ (వీణా శత్రుఘ్నతో కలిసి)
 6. ఆన్ దెయిర్ ఓన్: ఎ సోషియో -లీగల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇంటర్ కంట్రీ అడాప్షన్ ఇన్ ఇండియా
 7. ఇండియా స్టింకింగ్:మాన్యువల్ స్కావెంజర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్
 8. ది చైల్డ్ అండ్ ది లా
 9. విమెన్ అండ్ లా
 10. ది లంబాడాస్: ఎ కమ్యూనిటి బిసీజ్‌డ్: ఎ స్టడీ ఆన్ ది రిలింక్విష్‌మెంట్ ఆఫ్ లంబాడ గర్ల్ బేబీస్ ఇన్ సౌత్ తెలంగాణ

తెలుగు

[మార్చు]
 1. నేను కమ్యూనిస్టుని సి.కె.నారాయణరెడ్డి జీవితం[6]
 2. మాకొద్దీ ఛండాలం
 3. 1948 హైదరాబాద్ పతనం (అనువాదం. మూలం:మొహమ్మద్ హైదర్)

మూలాలు

[మార్చు]
 1. PRABALIKA M. BORAH (20 September 2012). "Positively GRITTY". The Hindu. Archived from the original on 21 December 2016. Retrieved 18 July 2020.
 2. web master. "Gita Ramaswamy". Hyderabad Literary Festival. Archived from the original on 18 జూలై 2020. Retrieved 18 July 2020.
 3. సరస్వతి రమ (4 January 2020). "పుస్తకాల పిడికిలి". సాక్షి దినపత్రిక. Archived from the original on 4 జనవరి 2020. Retrieved 19 July 2020.
 4. web master. "Gita Ramaswamy Ashoka Fellow". Ashoka. Retrieved 18 July 2020.
 5. ఆర్కీవ్.ఆర్గ్‌లో లైఫ్ ఇన్ అనంతారం పుస్తకం
 6. "నేను కమ్యూనిస్టుని". Archived from the original on 2020-01-08. Retrieved 2020-07-18.

బయటి లింకులు

[మార్చు]