Jump to content

గీరాంజర్‌ఫ్యోర్డ్

అక్షాంశ రేఖాంశాలు: 62°07′16″N 7°07′44″E / 62.1210°N 7.1290°E / 62.1210; 7.1290
వికీపీడియా నుండి
గీరాంజర్‌ఫ్యోర్డెన్
ఫ్యోర్డ్ దృశ్యం
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Møre og Romsdal" does not exist.
ప్రదేశంసన్న్‌మోర్, మోర్ ఓగ్ ర్యామ్స్‌డాల్
అక్షాంశ,రేఖాంశాలు62°07′16″N 7°07′44″E / 62.1210°N 7.1290°E / 62.1210; 7.1290
సరస్సులోకి ప్రవాహంగీరాంజల్వా నది
వెలుపలికి ప్రవాహంసన్నీల్వ్స్‌ఫ్యోర్డెన్
ప్రవహించే దేశాలునార్వే
గరిష్ట పొడవు15 కి.మీ. (9.3 మై.)
గరిష్ట వెడల్పు1.5 కి.మీ. (0.93 మై.)
ప్రాంతాలుగీరాంజర్
అధికారిక పేరుపశ్చిమ నార్వే ఫ్యోర్డ్‌లు:
గీరాంజర్‌ఫ్యోర్డ్, నేరోయ్‌ఫ్యోర్డ్
రకంప్రాకృతికం
క్రైటేరియాvii, viii
గుర్తించిన తేదీ2005 (29 వ సెషన్)
రిఫరెన్సు సంఖ్య.1195
ప్రాంతంఐరోపా

గీరాంజర్‌ఫ్యోర్డ్ అనేది నార్వేలోని మోరే ఓగ్ రోమ్స్‌డాల్ కౌంటీలోని సన్‌మోర్ ప్రాంతంలో ఉన్న ఫ్యోర్డ్‌[గమనిక 1] ఇది స్ట్రాండా మునిసిపాలిటీలో ఉంది. ఇది సన్నీల్వ్స్‌ఫ్యోర్డెన్ నుండి చీలిన 15 కిలోమీటర్ల శాఖ. సన్నీల్వ్స్‌ఫ్యోర్డెన్ స్వయంగా స్టోర్ఫ్జోర్డెన్ (గ్రేట్ ఫ్యోర్డ్) నుండి చీలిన శాఖ. గీరాంజెర్వా నది గీరాంజెర్ అనే చిన్న గ్రామం వద్ద ఈ ఫ్యోర్డ్‌లో పడుతుంది.

ఫ్యోర్డ్‌

[మార్చు]

నార్వేలో అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాలలో ఈ ఫ్యోర్డ్ ఒకటి. 2005 లో ఇది నెరోయ్ఫ్జోర్డెన్‌తో కలిసి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపికైంది. ఈ ఫ్యోర్డ్ గుండా విద్యుత్ లైన్లను నిర్మించాలనే వివాదాస్పద ప్రణాళికలు ఈ హోదాను సవాలు చేశాయి.[1]

ఫ్యోర్డ్1 నార్డ్‌వెస్ట్‌ల్యాండ్స్‌కే సంస్థ ఈ ఫ్యోర్డ్‌లో ఫెర్రీలను నడుపుతుంది. ఇది గీరాంజర్, హెల్లెసిల్ట్ అనే చిన్న పట్టణాల మధ్య ఫ్యోర్డ్ గుండా నడుస్తుంది. 2026 నుండి ఫ్యోర్డ్‌లో సున్నా-ఉద్గారాల నౌకలు అవసరమని ప్రతిపాదించారు.[2]

ఫ్యోర్డ్‌కు వైపులా ప్రస్తుతం సాగులో లేని అనేక పొలాలు ఉన్నాయి. స్టోర్ఫ్‌జోర్డెన్స్ వెన్నెర్ అసోసియేషను కొంత వరకూ వీటిని పునరుద్ధరించింది. వీటిలో ఎక్కువగా సందర్శించేవి స్కాగేఫ్లా, నివ్స్‌ఫ్లా, బ్లామ్‌బెర్గ్ . గీరాంజర్ నుండి స్కగేఫ్లాకు కాలినడకన కూడా చేరుకోవచ్చు. మిగిలిన వాటికి పడవ ప్రయాణం అవసరం. ఈ ఫ్యోర్డ్ సెవెన్ సిస్టర్స్ ఫాల్స్ వంటి అనేక జలపాతాలకు కూడా ఆతిథ్యం ఇస్తుంది.

జలపాతాలు

[మార్చు]

గీరాంజర్ ఫ్యోర్డ్‌లోని రెండు ముఖ్యమైన జలపాతాలు సెవెన్ సిస్టర్స్ ఫాల్స్, సూటర్ ( నైనోర్స్క్ ఫ్రియరెన్). ఈ రెండు జలపాతాలు ఫ్యోర్డ్‌కు ఇరువైపులా ఎదురుబొదురుగా ఉంటాయి. సూటర్ జలపాతం దానికి ఎదురుగా ఉన్న సోదరీమణులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతారు.

బ్రైడల్ వీల్ అనేది ఫ్యోర్డ్‌లోని మరొక జలపాతం. ఇది ఒక రాతి అంచుపై సుతారంగా పడుతూ, సూర్యకాంతిలో అది రాళ్లపై సన్నని ముసుగులా కనిపిస్తూ ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది.

రాక్ స్లయిడ్‌లు

[మార్చు]

అకెర్నెసెట్ పర్వతం లోని రాళ్ళు అరిగిపోతూ గీరాంజర్ ఫ్యోర్డ్ లోకి పడుతూ ఉండడంతో ఈ ఫ్యోర్డ్‌కు ముప్పు ఎదురౌతోంది. ఒకవేళ ఫ్యోర్డ్‌లో కూలిపోతే సునామీ వస్తుంది. పది నిమిషాల్లోనే అది గీరాంజర్, హెల్లెసిల్ట్‌తో సహా సమీపంలోని అనేక పట్టణాలను తాకుతుంది.[3][4][5]

జనాదరణ పొందిన సంస్కృతిలో

[మార్చు]
  • 2015 చిత్రం ది వేవ్ (బోల్గెన్) ను, అకెర్నెసెట్ పర్వతం నుండి ఒక రాయి జారి గీరాంజర్ పట్టణాన్ని ముంచెత్తే కథ ఆధారంగా రూపొందించారు.[6]
  • ఫ్రోజెన్ చిత్రంలో, అరెండెల్లె ప్రకృతి దృశ్యాలకు ఆధారంగా గీరాంజర్‌ఫ్యోర్డ్, నెరోయ్‌ఫ్యోర్డ్ లోని ప్రకృతి దృశ్యాలను ఉపయోగించారు.[7]

గ్యాలరీ

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. ఫ్యోర్డ్ అనేది హిమానీనదం వలన ఏర్పడిన సన్నటి సముద్ర ప్రవేశద్వారం. దీనికి ఇరువైపులా నిట్టనిలువుగుగా, ఎత్తైన భుజాలు లేదా కొండ చరియలు ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. "Geirangerfjorden kan miste verdensarvstatus". Bergens Tidende (in నార్వేజియన్). 6 July 2007. Archived from the original on 30 September 2007. Retrieved 7 July 2007.
  2. "Norway challenges the cruise industry to operate emission free". DNV GL. 25 February 2019.
  3. "Gigantras truer vestlandsbygder". Aftenposten (in నార్వేజియన్). 14 November 2004. Archived from the original on 17 July 2012. Retrieved 7 July 2007.
  4. "Økt fare for fjellskred i Åkersneset" (in నార్వేజియన్). forskning.no. 22 April 2004. Archived from the original on 29 September 2007. Retrieved 7 July 2007.
  5. "High Resolution Digital Elevation Model Analysis for Landslide Hazard Assessment (Åkerneset, Norway)". Archived from the original on 2006-07-16. Retrieved 2007-06-25.
  6. "The Wave (2015) Bølgen (original title)". IMDb. Retrieved 16 March 2016.
  7. Harpaz, Beth (5 June 2014). "How Disney's Frozen frenzy is creating a craze for Geirangerfjord | The Star". Toronto Star. Retrieved 2022-08-10.