గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
GUNTAKANDLA JAGADISH REDDY.jpg
తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి
Assumed office
జూన్ 2, 2014
Constituencyసూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణ
ఎమ్మెల్యే
Assumed office
జూన్ 2, 2014
Preceded byరాంరెడ్డి దామోదర్ రెడ్డి
Personal details
Bornజూలై 18, 1965
నాగారం, అర్వపల్లి, సూర్యాపేట జిల్లా
Political partyతెలంగాణ రాష్ట్ర సమితి
Spouse(s)సనీతారెడ్డి
Childrenవేమన్ రెడ్డి, లహరి రెడ్డి
Residenceహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

గుంటకండ్ల జగదీష్‌రెడ్డి (జ. 1965 జూలై 18) సూర్యాపేట ఎమ్మెల్యే మరియు తెలంగాణ ప్రభుత్వ కేబినేట్ మంత్రి.[1] 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[2] సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా ఎన్నికైన జగదీష్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.[3] ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. [1]

జననం[మార్చు]

రామచంద్ర రెడ్డి, సావిత్రి దేవి దంపతులకు 1965, జూలై 18న తెలంగాణ రాష్ట్రం లోని సూర్యాపేట జిల్లా, అర్వపల్లి, మండలం నాగారం గ్రామంలో జన్మించారు.

విద్యాభ్యాసం[మార్చు]

జగదీష్ రెడ్డి, శ్రీ సూర్యాపేటలోని శ్రీ వెంకటేశ్వర్ డిగ్రీ కళాశాలలో (ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధి) 1985 లో బి.ఏ. పూర్తిచేశారు. విజయవాడలోని సిద్దార్థ లా కాలేజ్ (నాగార్జున విశ్వవిద్యాలయం పిరిధి) నుండి లా డిగ్రీ చదివారు.

వృత్తిజీవితం[మార్చు]

లా డిగ్రీ పూర్తయిన తరువాత నల్గొండ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ప్రారంభ సభ్యులులో ఒకరిగా చేరారు.[4]

2009 లో హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసారు. 2014లో జరిగిన ఎన్నికలలో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

జగదీశ్‌కు మరో రెండు శాఖలు[మార్చు]

జగదీశ్‌రెడ్డి ఎస్సీ అభివృద్ధి శాఖ, సహకార శాఖల బాధ్యతను ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పగించారు.[5]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 సాక్షి. "విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి". Retrieved 13 January 2017.
  2. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Retrieved 2 June 2014.
  3. "Council of Ministers". telangana.gov.in. Retrieved 14 July 2014.
  4. "Suryapet Assembly Election 2014".
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు. "జగదీశ్‌కు మరో రెండు శాఖలు". Retrieved 16 January 2017.