Jump to content

గుంటూరు సన్న మిరపకాయ

వికీపీడియా నుండి
ఈ వ్యాసం
భౌగోళిక గుర్తింపు (GI)
జాబితాలో భాగం

గుంటూరు సన్న మిరపకాయ
జాతి"కాప్సికం అన్నం" వార్ "లాంఘం"
కారం (హీట్) ఎక్కువ కారం
స్కోవిల్లె స్కేల్35,000-40,000 SHU
గుంటూరు సన్నమిరపకాయ
వివరణప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ వున్న మిరప జాతి.
రకంఆహార పదార్థం
ప్రాంతంగుంటూరు
దేశంభారతదేశం

భౌగోళిక గుర్తింపు భౌగోళిక గుర్తింపు

గుంటూరు సన్న మిరపకాయ (Guntur Sannam) లేదా కాప్సికం అన్నమ్ వర్. లాంఘమ్ (Capsicum annuum var. Longhum), కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ వున్న మిరప జాతి.[1][2] ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా లోనూ, తెలంగాణ లోని వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా లలో పండిస్తారు.

మూలం

[మార్చు]

గుంటూరు సన్నం మిరపకాయ "కాప్సికం ఆన్నం" జాతికి చెందినది. ఇది భారతదేశంలో ప్రముఖ వాణిజ్య పంట. దీనిని ఆహార పదార్థాలలోనూ, వంటలలోనూ ఉపయోగిస్తాఅరు. వీటిలో ఎండు మిరపకాయలు ఎక్కువ ప్రసిద్ధి చెందాయి.

మిరపకాయలు భారతీయులకు సుమారు 400 సంవత్సరాలుగా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఈ పంట సాగుచేయడంలో మొట్ట మొదటి స్థానం ఆక్రమిస్తుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 46 శాతం మిరపకాయలను ఉత్పత్తి చేస్తున్నాయి. శబ్దోత్పత్తి ప్రకారం చూస్తే ఈ మిరపకాయ ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరుకు చెందినది కావడం వల్ల దానికి ఆ పేరుతో పిలుస్తారు. ఈ మిరపకాయలు సన్నంగా ఉండడం వల్ల "గుంటూరు సన్న మిరపకాయలు"గా వ్యవహరిస్తారు.

ఈ ప్రాంత మిరపకాయ సామర్థ్యాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "రీజనల్ రీసెర్చ్ స్టేషన్"ను గుంటూరు వద్ద మూడు దశాబ్దాల క్రియం నెలకొల్పారు. ఈ సంస్థ మిరపకాయల రకాలను, నాణ్యతను గూర్చి పరిశోధన చేస్తుంది.[3] కొన్ని దశాబ్దాలుగా గుంటూరు మిరపకాయలకు ప్రసిద్ధి చెందినది కనుక ఆ మిరపకాయల పూర్వలగ్నం "గుంటూరు"గా మారింది.

ప్రస్తుతం ఈ మిరప పంట ప్రముఖ వాణిజ్య పంటగా మారింది. దీనిపై అనేక వేలమంది ప్రజలు ఆధారపడి వారి జీవనం కొనసాగిస్తున్నారు.

లక్షణాలు

[మార్చు]

ఈ మిరపకాయ ప్రత్యేక లక్షణాలు కలిగి యుండడం వల్ల దేశ విదేశాలలో ప్రఖ్యాతి పొందించి. ఈ మిరపకాయను సాధారణంగా "S4 రకం మిరపకాయ"గా పిసుస్తారు. దీనిని వంటలలో తీక్షణమైన కారం కోసం, కాప్సైచిన్ తయారీకి వాడుతారు. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • గుంటూరు సన్న మిరపకాయ "కాప్సికం అన్నం" వార్ "లాంఘం" జాతికి చెందినది. దీని పొడవు 5 నుండి 15 cm, వ్యాసం 0.5 నుండి 1.5 వరకు ఉంటుంది.
  • ఈ మిరప తొక్క దళసరిగానూ, ఎరుపురంగుతో కూడి కారంగా ఉంటుంది.
  • ఈ మిరప తీవ్రమైన కారం కలిగియుండి స్కావిల్ స్కేలులో తీవ్రత విలువ 35,000 నుండి 40,000 వరకు ఉంటుంది.
  • ఈ మిరపకాయ ఎరుపుగా ఉండి ఆస్తా రంగు విలువ సుమారు 32.11 ఉంటుంది.
  • ఈ మిరపకాయలో కాప్సైచిన్ పదార్థం సుమారు 0.226% ఉంటుంది.
  • ఈ మిరపకాయలో ఎక్కువగా విటమిన్-సి (185 mg/100 g), ప్రోటీన్ (11.98 g/100 g) ఉంటాయి.

ప్రపంచ ప్రఖ్యాతి

[మార్చు]

గుంటూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రమైన ‘లాం’లో పుట్టిన చిన్న మిరపకాయ ఇప్పుడు ప్రపంచ నలుమూలల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ‘లాం’ వ్యవసాయ పరిశోధన కేంద్రం 1962లో జి-4 పేరుతో విడుదల చేసిన ఈ మిరపరకానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు వల్ల ఇక నుంచి ప్రపంచంలో ఎక్కడ మిర పను పండించిన గుంటూరు సన్నాలనే వాడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]