గుండెబోయిన రామ్మూర్తి యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుండెబోయిన రామ్మూర్తి యాదవ్
Gundeboina Rammurthy Yadav.gif
చలకుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు
In office
1994–1999
అంతకు ముందు వారుకె. జానారెడ్డి
తరువాత వారుకె. జానారెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననం(1947-11-01)1947 నవంబరు 1 [1]
పెద్ద దేవులపల్లి, త్రిపురారం మండలం, నల్లగొండ జిల్లా, తెలంగాణ
మరణం2019 అక్టోబరు 11(2019-10-11) (వయసు 71)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత్ రాష్ట్ర సమితి

గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ (26 అక్టోబరు 1947 - 11 అక్టోబరు 2019) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. 1994లో చలకుర్తి నిమోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.[2][3] ఆ తరువాత భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.

జననం[మార్చు]

రామ్మూర్తి యాదవ్ 1947 అక్టోబరు 26న మట్టయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, త్రిపురారం మండలంలోని పెద్ద దేవులపల్లి గ్రామంలో జన్మించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

రామ్మూర్తి యాదవ్ 1981లో పెద్ద దేవులపల్లి గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1994 నుంచి 1999 వరకు అప్పటి చలకుర్తి నియోజకవర్గములో ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఓటమి ఎరుగని మాజీ మంత్రి కె. జానారెడ్డిపై 2,621 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[4] ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.

మరణం[మార్చు]

రామ్మూర్తి యాదవ్ 2019, అక్టోబరు 11న మరణించాడు.[1][5]

గుర్తింపు[మార్చు]

2021, డిసెంబరు 1న నిడమనూరు మండలంలోని వేంపాడు స్టేజీ వద్ద గుండెబోయిన రామ్మూర్తి యాదవ్‌ విగ్రహాం ఆవిష్కరించబడింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి డ్రోన్‌ ద్వారా విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్‌ కుమార్‌, నల్లమోతు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్‌, శానంపూడి సైదిరెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.[6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి కన్నుమూత". Asianet News Telugu. 12 October 2019. Retrieved 23 October 2019.
  2. "Chalakurthi Assembly Constituency Election Result". www.resultuniversity.com. Retrieved 23 October 2019.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1994". www.elections.in. Archived from the original on 5 సెప్టెంబరు 2016. Retrieved 23 October 2019.
  4. Reporter, Staff (2019-10-13). "Former Telugu Desam MLA passes away". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 2019-10-22. Retrieved 2021-12-06.
  5. "Former MLA Rammurthy Yadav passes away at 72". Telangana Today. 12 October 2019. Retrieved 23 October 2019.
  6. "ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే విజయం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-01. Archived from the original on 2021-12-07. Retrieved 2021-12-07.