గుండె రక్తనాళాల వ్యాధి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Cardiovascular disease
Classification and external resources
ICD-10 I51.6
ICD-9 429.2
DiseasesDB 28808
MeSH D002318

గుండె రక్తనాళాల వ్యాధి లేదా కార్డియో వాస్క్యులర్ వ్యాధి అనేది గుండె లేదా రక్త నాళముల (ధమనులు మరియు సిరలు) వంటి వాటిలో ఏదైనా వ్యాధి బారిన పడే తరగతికి చెందిన జబ్బు.[1] ఈ పదము సాంకేతికముగా కార్డియో వాస్క్యులార్ వ్యవస్థపై ప్రభావమును చూపించగలిగిన(MeSH C14లో వాడబడిన విధముగా) ఏదైనా జబ్బు అని చూపిస్తుంది, కానీ ఇది సాధారణముగా ఆథేరోస్క్లేరోసిస్ (ధమనుల జబ్బు) ను సూచించడానికి వాడబడుతుంది. ఈ పరిస్థితులు ఒకేలాంటి కారణములు, యంత్రాంగము మరియు వ్యాధి నివారణ కలిగి ఉంటాయి.

కార్డియాలజిస్ట్లు, ఉదరము యొక్క శస్త్రచికిత్స నిపుణులు , నాడీ సంబంధమైన శస్త్రచికిత్స నిపుణులు , నాడీ వ్యవస్థ శస్త్రచికిత్స నిపుణులు, మరియు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ లు , చికిత్స చేయవలసిన శరీర భాగం ఆధారంగా ఈ కార్డియో వాస్క్యులార్ వ్యాధికి చికిత్స చేస్తారు. ఇలాంటి ప్రత్యేక చికిత్సలలో కొన్ని కొన్ని మిళితం అయిపోతాయి మరియు ఒకే వైద్యశాలలో వివిధ నిపుణులచే నిర్దిష్ట చికిత్సలు చేయబడడము అనేది చాలా సాధారణము.

చాలా దేశములలో ఈ హృద్రోగములు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రతీ సంవత్సరము, గుండె జబ్బు కాన్సర్ కంటే ఎక్కువగా అమెరికన్ల ప్రాణములు తీస్తోంది. ఈ మధ్య కాలములో, గుండె జబ్బు స్త్రీలలో ఎక్కువగా పెరుగుతోంది మరియు రొమ్ము కాన్సర్ కంటే ఎక్కువగా స్త్రీల మరణములకు కారణము అవుతోంది.[2] ఒక పెద్ద చరిత్ర ఆధారిత అధ్యయనములో (PDAY) నాడీ సంబంధ గాయములు యవ్వనము నుంచి ప్రోగవుతూ వస్తాయి అని తెలిసింది మరియు ఇలా అవ్వకుండా చిన్నతనము నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.[3][4]

గుండె జబ్బులు నిర్ధారించబడే వరకు, వాటికి అసలు కారణమైన ఆథేరోస్క్లేరోసిస్ చాలా ఎక్కువగా పెరిగి పోయి ఉంటుంది, అప్పటికే దశాబ్దములు గడిచి పోయి ఉంటాయి. అందుకే చక్కటి ఆహార అలవాట్లు, వ్యాయామము చేయడము మరియు పొగ తాగడము వంటివి మానివేయడము వంటి వాటి ద్వారా ఆథేరోస్క్లేరోసిస్ రాకుండా చూసుకోవటం పై మరింత శ్రద్ధ పెడుతున్నారు.

వ్యాధివిజ్ఞాన శరీరధర్మశాస్త్రం[మార్చు]

జనాభా ఆధారితముగా చేయబడిన అధ్యయనములు ఈ గుండె జబ్బుల కారకాలు యవ్వనము నుంచే మొదలు అవుతాయని తెలిపాయి. ఆథేరోస్క్లేరోసిస్ చిన్నతనములోనే మొదలు అవుతుంది మరియు బయట పడడానికి దశాబ్దముల తరబడి కాలము పడుతుంది. ది పాథలాజికల్ డిటర్మినేన్ట్స్ ఆఫ్ ఆథేరోస్క్లేరోసిస్ ఇన్ యూత్ అధ్యయన ఫలితముల ప్రకారము ముందుగా లక్షణములు గుండె కుడి వైపు ఉన్న రక్త ప్రసరణ చేసే నాళములలో మొదలవుతాయి. ఈ ఇబ్బందులు 7–9 సంవత్సరముల వయసులో ఉన్న పిల్లలలోనే సగము కంటే కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ, ఎక్కువ మంది పెద్దలు గుండె జబ్బు కంటే ఎక్కువగా HIV, ప్రమాదములు మరియు కాన్సర్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.[5]

ఆథేరోస్క్లేరోసిస్ కు చెందిన ఇబ్బందుల కారణముగా ప్రతి ముగ్గురిలో ఒకరు మరణిస్తున్నారు అనే విషయము చాలా ముఖ్యముగా దృష్టిలో పెట్టుకుని తీరవలసినది. ఈ గుండె జబ్బులను మూలముతో పెరికి వేయాలి అంటే, నివారణ అనేది చాలా ముఖ్యం. ఈ వ్యాధి యొక్క తీవ్రత గురించి బాగా తెలియ చేయడము మరియు ఇది చాలా భయంకరమైనది అని తెలియ చెప్పడము వంటివి ఈ వ్యాధిని రాకుండా చేయడానికి లేదా తగ్గించడానికి వీలు కలగచేస్తుంది.

స్థూలకాయము మరియు చక్కర వ్యాధి అనేవి ఈ గుండె జబ్బులతో దగ్గరి సంబంధము కలిగి ఉంటాయి. [6]చక్కెర వ్యాధి కలిగి ఉన్నప్పుడు గుండె జబ్బు మరింత ప్రాణహాని కారకము అవుతుంది మరియు చక్కర వ్యాధి రెండవ స్థాయిలో ఉన్నప్పుడు ప్రాణహాని అది లేని వారికంటే ఎక్కువగా నాలుగురెట్లకు పెరుగుతుంది.[7] [8] [9]

రోగ నిర్ధారణ[మార్చు]

సంబంధము కలిగి ఉన్న వ్యాధి నిర్ధారకములు[మార్చు]

 • తక్కువ సాంద్రత కలిగిన క్రొవ్వు మరియు ప్రోటీన్ల మిశ్రమము
 • క్రొవ్వు మరియు ప్రోటీన్ల మిశ్రమము(a)
 • అపోలిప్రోటీన్ A1
 • అపోలిప్రోటీన్ Bho

పరీక్షించడం[మార్చు]

కొన్ని జీవధాతువులు ఈ గుండెజబ్బును కలిగించే మరిన్ని కారణాలను కలిగి ఉంటాయి అని తెలుస్తోంది. ఏది ఏమైనా, ఈ జీవ ధాతువులు వైద్యపరంగా ఎంత విలువ కలిగి ఉన్నాయి అనేది కొంత వరకు ప్రశ్నించ తగిన విషయము.[10] ప్రస్తుతము గుండె జబ్బులను ఎక్కువగా కలిగించగలవు అని తెలిసి ఉన్న జీవధాతువులు క్రింద ఇవ్వబడ్డాయి:

 • అధిక ఫిబ్రినోజేన్ మరియు PAI-1 రక్త సాంద్రత పెరగటం
 • హోమో సిస్టిన్ స్థాయి పెరగటం లేదా సాధారణం కంటే పై స్థాయిలో ఉండటం
 • రక్తంలో ఎసిమెట్రిక్ డైమీతైల్ఆర్జినిన్ స్థాయి పెరగటం
 • C-రియాక్టివ్ ప్రోటీన్ చే కొలిచిన విధంగా అధిక మంట
 • రక్తంలో బ్రెయిన్ నట్రియురేటిక్ పెప్టైడ్ స్థాయి పెరగటం (ఇది B-టైపు అని కూడా పిలవబడుతుంది) (BNP)[11]
 • NT-proBNP యొక్క స్థాయిలో పెరుగుదల

నివారణ[మార్చు]

మేడిటెర్రెనియన్ ఆహారము ఈ గుండె జబ్బుల విషయములో సత్ఫలితములను ఇస్తుంది అని రుజువులు తెలియ చెపుతున్నాయి.[12] 2010 వరకు, విటమిన్లు ఈ గుండె జబ్బులను తగ్గించే విషయములో అంతగా ప్రభావము కలిగి ఉన్నట్లుగా తెలియరాలేదు.[13]

ఆథేరోస్క్లేరోసిస్ ను తగ్గించడానికి లేదా పెంచడానికి ఉన్న కారణములలో పీచు పదార్థము ఎక్కువగా ఉన్న కూరగాయల ఆహారము మరియు తక్కువ హాని కలిగించే క్రొవ్వు మరియు కొలెస్ట్రాల్ తీసుకోవటం; పొగాకు తీసుకోవడం మానెయ్యటం మరియు పొగ తాగే వారికి దూరముగా ఉండడము, తాగుడు అలవాటును తగ్గించడము; ఎక్కువ రక్తపోటు రాకుండా తీసుకునే మందుల వలన పూర్తిగా తగ్గిపోకుండా చూసుకోవడం; ఆహారపు అలవాట్లపై గట్టి నియంత్రణ; చక్కర వ్యాధిపై గట్టి అదుపు; అధిక బరువు ఉన్నప్పుడు BMI తగ్గించుకోవడము ; రోజువారీ జీవితములో కనీసము 30 నిముషముల పాటు తప్పనిసరిగా గట్టిగా వ్యాయామము చేయడము మరియు దైనందిన జీవితములో మానసికముగా ఒత్తిడి తగ్గించుకోవడము వంటివి చేసి తీరవలసి ఉంటుంది. (Sources: www.americanheart.org, www.world-heart-federation.org/cardiovascular-health/cardiovascular-disease-risk-factors/)

నిర్వహణ[మార్చు]

గుండె జబ్బుల చికిత్సలో ముందుగా ఆహార అలవాట్లపై మరియు జీవిత విధానముపై ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. [14] [15] [16]మందుల వాడకం నివారణకు ఉపయోగపడవచ్చును.

సాంక్రమిక రోగ విజ్ఞానం[మార్చు]

2004 లో 100,౦౦౦ నివాసితులకి కార్డియో వాస్కులార్ వ్యాధులు కొరకు వైకల్యం సరి చేసిన జీవన సంవత్సరం.[17][32][33][34][35][36][37][38][39][40][41][42][43][44]

పరిశోధన[మార్చు]

తొలిసారిగా గుండె జబ్బులకు సంబంధించిన పరిశోధనలు 1949లో జెర్రీ మోరిస్ చేత వృత్తిపరముగా సేకరించబడిన ఆరోగ్య సమాచారమును అనుసరించి చేయబడినవి మరియు 1958లో ప్రచురించబడినవి.[18] బయోమెడికల్ పరిశోధనలో గుండె జబ్బులకు సంబంధించిన ఏ కారణములు అయినా, రాకుండా చూడడము, మరియు/లేదా అన్ని రకములైన వైద్యములు కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి, ఇందులో వందల కొలదీ సాంకేతిక అధ్యయనములు ప్రతీ వారము ప్రచురింపబడుతున్నాయి. 2000 సంవత్సరము మొదటిలో ఫాస్ట్ ఫుడ్ కు మరియు గుండె జబ్బులకు దగ్గరి సంబంధము ఉంది అని చాలా అధ్యయనములు తెలపడముతో ఒక కొత్త పోకడ మొదలు అయింది. ఈ అధ్యయనములలో రియాన్ మీకీ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యుట్, హార్వర్డ్ విశ్వవిద్యాలయము మరియు ది సిడ్నీ సెంటర్ ఫర్ కార్డియో వాస్క్యులార్ హెల్త్ లు చేసిన అధ్యయనములు కూడా ఉన్నాయి. చాలా ఫాస్ట్ ఫుడ్ సంస్థలు ముఖ్యముగా మెక్డొనాల్డ్స్, ఈ అధ్యయనములో వాడిన పద్దతులను నిరసించారు మరియు ఆరోగ్యకరమైన ఆహారమును అందిస్తూ జవాబిచ్చారు.

ఆథేరోస్క్లేరోసిస్ ను మరియు దానికి సాధ్యమయ్యే లక్షణాలను సూచించే విధంగా తక్కువ స్థాయిలో వచ్చే మంట మధ్య ఉన్న సంబంధంపై ఈ మధ్యకాలంలో చర్చ మొదలయింది. C-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) అనేది ఒక సాధారణ ఇన్ఫ్లమేటరీ మార్కర్, ఇది ఎక్కువగా కార్డియో వాస్క్యులార్ జబ్బు రావడానికి అవకాశము ఉన్న రోగిలో ఎక్కువ స్థాయిలో కనుగొనబడినది.[19] అలాగే ఆస్టియోప్రోటేగేరిన్ అనేది ఎక్కువగా మంట రావడానికి కారణము అయ్యే NF-κB అని పిలువబడే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్. ఇది కార్డియో వాస్క్యులార్ జబ్బులలోను మరియు మరణములలోను ఎక్కువగా కనుగొనబడినది.[20][21]

ఇంకా కొన్ని ప్రదేశములకు సంబంధించి పరిశోధన జరుగుతున్నది, ఇందులో వీరు చ్లమిదోఫిలా నుమోనియే వంటి వాటితో సూక్ష్మ జీవుల వలన కలిగే ఇబ్బందులు మరియు ధమనులలో రక్తము గడ్డ కట్టడము వంటి వాటికి మధ్య ఉన్న సంబంధమును తెలుసుకునే ప్రయత్నము చేస్తున్నారు. యాంటి బయాటిక్ లు ఎక్కువగా వాడడం వలన చ్లమిదియా తో ఉన్న సంబంధము బాగా తగ్గి పోయింది.[22]

సూచనలు[మార్చు]

 1. Maton, Anthea (1993). Human Biology and Health. Englewood Cliffs, New Jersey: Prentice Hall. ISBN 0-13-981176-1. 
 2. United States (1999). "Chronic Disease Overview". United States Government. 
 3. Rainwater DL, McMahan CA, Malcom GT et al. (Mar 1999). "Lipid and apolipoprotein predictors of atherosclerosis in youth: apolipoprotein concentrations do not materially improve prediction of arterial lesions in PDAY subjects. The PDAY Research Group". Arterioscler Thromb Vasc Biol. 19 (3): 753–61. PMID 10073983. 
 4. McGill HC, McMahan CA, Zieske AW et al. (Aug 2000). "Associations of coronary heart disease risk factors with the intermediate lesion of atherosclerosis in youth. The Pathobiological Determinants of Atherosclerosis in Youth (PDAY) Research Group". Arterioscler Thromb Vasc Biol. 20 (8): 1998–2004. PMID 10938023. 
 5. Vanhecke TE, Miller WM, Franklin BA, Weber JE, McCullough PA (Oct 2006). "Awareness, knowledge, and perception of heart disease among adolescents". Eur J Cardiovasc Prev Rehabil. 13 (5): 718–23. doi:10.1097/01.hjr.0000214611.91490.5e. PMID 17001210. 
 6. హైలాండర్ P, షా GP: కరెంట్ ఫార్మకో థేరప్యుటిక్ కాన్సెప్ట్స్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ కార్డియోవస్క్యులర్ డిసీజ్ ఇన్ డయాబెటిక్స్. తెర్ Adv కార్డియో వస్క్డిస్. 4: 43-54, 2010.
 7. కవన్ , E., పెట్టేర్సేన్ , K.I., సండ్విక్, L. అండ్ రీక్వం, A. (2007) హై మోర్తాలిటీ ఇన్ డయాబెటిక్ పేషంట్ విత్ ఎక్యూట్ మయోకార్డియల్ ఇంఫర్క్షన్: కార్డియోవస్క్యులర్ కో-మార్బిడిటీస్ కంట్రిబ్యుట్ మోస్ట్ టు ది హై రిస్క్. Int J కార్డియాల్ 121: 184�188.
 8. నార్హామార్, A., మల్మ్బార్గ్ , K., డైదేర్హాల్, E., లాగార్క్విస్ట్, B., లిందహ్ల్, B., రైడ్ , L. et al. (2004) డయాబెటీస్ మెల్లిడయాబెటీస్: డి మేజర్ రిస్క్ ఫాక్టర్ ఇన్ అన్స్టేబుల్ కరానరీ ఆర్టరీ డిసీజ్ ఈవెన్ ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ది ఎక్క్స్టెంట్ ఆఫ్ కరానరీ ఆర్టరీ డిసీజ్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ రీవస్క్యులరై జేషన్. J Am కాల్ కార్దియాల్ 43: 585�591.
 9. DECODE స్టడీ గ్రూప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డి యురోపియన్ ఎపిడిమియాలజీ గ్రూప్ (1999) గ్లూకోజ్ తాలరెంస్ అండ్ మోర్టాలిటీ: కంపారిజన్ ఆఫ్ ఆఫ్ WHO అండ్ అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ డయాగ్నస్టిక్ క్రైటీరియా. లాన్సేట్ 354: 617�621.
 10. Wang TJ, Gona P, Larson MG, Tofler GH, Levy D, Newton-Cheh C, Jacques PF, Rifai N, Selhub J, Robins SJ, Benjamin EJ, D'Agostino RB, Vasan RS (2006). "Multiple biomarkers for the prediction of first major cardiovascular events and death". N. Engl. J. Med. 355 (25): 2631–billy bob joe9. doi:10.1056/NEJMoa055373. PMID 17182988. 
 11. Wang TJ, Larson MG, Levy D et al. (Feb 2004). "Plasma natriuretic peptide levels and the risk of cardiovascular events and death". N Engl J Med. 350 (7): 655–63. doi:10.1056/NEJMoa031994. PMID 14960742. 
 12. Walker C, Reamy BV (April 2009). "Diets for cardiovascular disease prevention: what is the evidence?". Am Fam Physician 79 (7): 571–8. PMID 19378874. 
 13. "Vitamins and minerals: not for cancer or cardiovascular prevention". Prescrire Int 19 (108): 182. August 2010. PMID 20939459. 
 14. Ornish, Dean, "et al." (Jul 1990). "'Can lifestyle changes reverse coronary heart disease?' The Lifestyle Heart Trial.". Lancet 336 (8708): 129–33. doi:10.1016/0140-6736(90)91656-U. PMID 1973470. 
 15. Ornish, D., Scherwitz, L. W., Doody, R. S., Kesten, D., McLanahan, S. M., Brown, S. E. "et al." (1983). "Effects of stress management training and dietary changes in treating ischemic heart disease". JAMA 249 (54): 54. doi:10.1001/jama.249.1.54. 
 16. Ornish, D., Scherwitz, L. W., Billings, J. H., Brown, S. E., Gould, K. L., Merritt, T. A. "et al." (1998). "Intensive lifestyle changes for reversal of coronary heart disease". JAMA 280 (280): 2001–7. doi:10.1001/jama.280.23.2001. PMID 9863851. 
 17. [31]
 18. కరానరీ హార్ట్ డిసీజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ వర్క్ బై J. N. మోరిస్ అండ్ మార్గరెట్ D. క్రాఫార్డ్ , బ్రిటిష్ మెడికల్ జర్నల్ 1958 ; 2(5111): 1485–1496 [1]
 19. PMID:20024640
 20. 20448212
 21. PMID: 20447527
 22. Andraws R, Berger JS, Brown DL (Jun 2005). "Effects of antibiotic therapy on outcomes of patients with coronary artery disease: a meta-analysis of randomized controlled trials". JAMA 293 (21): 2641–7. doi:10.1001/jama.293.21.2641. PMID 15928286. 

బాహ్య లింకులు[మార్చు]

అంతర్జాతీయ

పబ్లిక్ ఇన్ఫర్మేషన్