గుండ్లగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుండ్లగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలానికి చెందిన గ్రామ పంచాయితీ హోదా కలిగిన గ్రామం.

ఇది రెవిన్యూ గ్రామం కాదు.అలేరు శివారు గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గుండ్లగూడెం: ఆలేరుకు మరొక పొరుగుగ్రామం. గుండ్లగూడెం ఒకప్పుడు ఆలేరు గ్రామ పంచాయతీలోనే వుండే వూరు గుండ్లగూడెం ఆలేటివాగును నిలువరించి మలుపుతిప్పిన గుండ్లగడ్డ.ఈ వూరిలో వందేళ్ళ కిందటి (1901 క్రీ.శ.) సి.ఎస్.ఐ. పాఠశాల ఉంది.మొదటి నిజాం చేత 1701లో సంస్థాన్ నారాయణపురాన్ని ఇనాంగా పొందిన సోమిరెడ్డి కుమారుడు రాయన్ రెడ్డి రాజారాయన్నగా ప్రసిద్ధుడు.ఒక గొప్పకోటను నిర్మించడానికి ఆలేరు ప్రాంతాన్ని పరిశీలించి గుండ్లగూడెం వద్ద ఆలేరు వాగు ఒడ్డున మొదలు పెట్టి ఎందుకో అర్థాంతరంగా వొదిలేసాడు.ఆ కోట గోడల శిథిలాలున్నాయి. అక్కడొక జీర్ణ శివాలయం ఉంది. ఆ శివాలయపు లలాటబింబం ఏనుగులు శివార్చన చేస్తున్నట్లుంది. ఇట్లాంటి లలాటబింబాలున్న గుళ్ళను కరీంనగర్ జంగంరెడ్డిగూడెంలో, కీసరలో చూసాం.అవి శైవమఠాలు.ఇపుడా శివాలయంలో లింగం, నందులు లేవు.గ్రామంలో పాతగుడి ఉంది.దాని ఆనవాళ్ళే మిగిలివున్నాయి.ఆ తర్వాత రాజరాయన్న రాజపేటలో కోటకట్టాడు.

గ్రామ జనాభా[మార్చు]

గ్రామ జనాభా మొత్తం 2044.అందులో పురుషులు 980,స్రీలు 1064.గ్రామంలో నివాస ప్రాంతాలు (Habitations) గుండ్లగూడెం,ఇందిరానగర్ తండా, కందిగూడ తండా.