గుంతకల్లు పురపాలక సంఘం
గుంతకల్ | |
స్థాపన | 1948 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | గుంతకల్ |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
గుంతకల్ పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, గుంతకల్ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
చరిత్ర
[మార్చు]గుంతకల్ పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 433 కి.మీ దూరంలో ఉంది.1948 సంవత్సరంలో మున్సిపాలిటీగా స్థాపించబడింది. ఈ మునిసిపాలిటీలో 37 ఎన్నికల వార్డులు ఉన్నాయి.
జనాభా గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం 126,270 జనాభా ఉండగా అందులో పురుషులు 62,851, మహిళలు 63,419 మంది ఉన్నారు.అక్షరాస్యత 74.87% ఉండగా అందులో పురుష జనాభాలో 83.29%, స్త్రీ జనాభాలో 66.59% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 13075 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 28,781 గృహాలు ఉన్నాయి.[1]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా కె. అపర్ణ పనిచేస్తుంది.[2] వైస్ చైర్మన్‌గా రామగౌని శ్రీనాథ్ పనిచేస్తున్నాడు.[2]
ఇతర వివరాలు
[మార్చు]ఈ పురపాలక సంఘం 40.87 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి ఉంది.23 రెవెన్యూ వార్డులు,37 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ పురపాలక సంఘంలో మురికివాడలు 48 ఉండగా అందులో జనాభా 52650 ఉన్నారు.1 ప్రభుత్వ ఆసుపత్రి,5 పబ్లిక్ పార్కులు,1 కూరగాయల మార్కెట్లు,27 ప్రభుత్వ పాఠశాలు,31 ప్రాథమిక పాఠశాలలు,2 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు,4 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Guntakal Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-02.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.