గుజరాత్ (పాకిస్తాన్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Gujrat

گجرات
Hakeem.jpg
Country Pakistan
ProvincePunjab
DistrictGujrat
జనాభా
(2007)
 • మొత్తం2,98,731
ప్రామాణిక కాలమానంUTC+5 (PST)
Calling code053
Number of Union councils18[1]

గుజరాత్ (ఉర్దూ/పంజాబీ: گجرات) అనేది పాకిస్థాన్‌లో ఉన్న ఒక నగరం. ఇది పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజరాత్ తెహ్సీల్ కు రాజధాని[1]. గుజరాత్‌లో నివసించే పౌరులు తమనుతాము గుజరాతీయులుగా సూచించుకుంటారు. భారతీయ రాష్ట్రం గుజరాత్ మాదిరిగానే పేరు ఉండటంతో పేరు విషయంలో తికమక ఏర్పడుతుంది. వ్యవసాయం చిన్న పరిశ్రమలు ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారాలు

ఉనికి[మార్చు]

లాహోర్‌కు ఉత్తరంగా 120 కిలోమీటర్ల దూరంగా చీనాబ్ నది ఒడ్డున గుజరాత్ ఉంది. దీనికి సమీపంలో ఉన్న ఇతర ప్రసిద్ధ ప్రదేశాలు జెలమ్, గుజ్రాన్‌వాలా, మండి బాహౌద్దీన్, సియాల్‌కోట్ మరియు భీంబెర్-ఆజాద్ కాశ్మీర్. స్థానిక మార్కెట్‌కు గణనీయమైన సంఖ్యలో కార్మికులను సరఫరా చేసే అనేక గ్రామాలు ఈ నగరం చుట్టూ ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

గుజరాత్‌ను ఒక పురాతన నగరం, బ్రిటీష్ చరిత్రకారుడు జనరల్ కన్నింగ్‌హామ్ ప్రకారం, దీనిని రాజా బచాన్ పాల్ గుర్జార్ 460 BCలో స్థాపించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ సమయంలో ఈ నగరం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి, జీలం నది ఒడ్డున అలెగ్జాండర్ ముట్టడికి నగరం యొక్క రాజ ప్రాకారం తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చినట్లు తెలుస్తోంది. గుజరాత్ నగర స్థాపన 1900 శతాబ్దం ప్రారంభంలో బ్రిటీష్ సామ్రాజ్యం హాయంలో, ప్రాంతీయ భూస్వాములు మద్దతుతో సాకారమైంది (ఉదాహరణకు దాస్‌వాండీ పురాకు చెందిన దాస్‌వాండీ ఖాన్).

మొఘల్ యుగం సందర్భంగా మొఘల్ రాజులు కాశ్మీర్‌కు వెళ్లే మార్గంగా ఈ జిల్లాను ఉపయోగించారు. కాశ్మీర్ నుంచి తిరిగి వస్తున్న సందర్భంగా రాజు జహంగీర్ మరణించినప్పుడు, సామ్రాజ్యంలో కల్లోలాలు నిరోధించేందుకు అతని మరణ వార్తను రహస్యంగా ఉంచారు. అటువంటి పరిస్థితిలో, అతని యొక్క ఉదర అవయవాలను బయటకు తీసి, గుజరాత్‌లో ఖననం చేశారు. ఈ రోజుకు కూడా, గుజరాత్‌లో దీనిని పురస్కరించుకొని వార్షిక వేడుక జరుగుతుంటుంది, దీనిని "జహంగీర్ ఫెస్టివల్"గా పిలుస్తారు.

ఈ జిల్లాలో బ్రిటీష్ మరియు సిక్కు సైన్యాల మధ్య రెండు ప్రధాన యుద్ధాలు జరిగాయి; అవి చిల్లియన్‌వాలా యుద్ధం మరియు గుజరాత్ యుద్ధం. గుజరాత్ యుద్ధంలో ఫిబ్రవరి 22, 1849లో విజయం సాధించిన తరువాత, బ్రిటీష్‌వారు పంజాబ్ విజయాన్ని ప్రకటించారు.

నవాబ్ కుటుంబం; నవాబ్‌జాదా ఘజన్‌ఫార్ గుల్, మాజీ MNA మరియు కేంద్ర కార్యవర్గ సభ్యుడు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కమిటీ ప్రధానమంత్రి రాజకీయ వ్యవహారాల సలహాదారుగా నియమించింది. నవాబ్‌జాదా ఘజన్‌ఫార్ అలీ గుల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో B.Sc. పొందారు, లండన్‌లోని లింకన్ ఇన్ నుంచి బార్-ఎట్-లా పొందారు. లండన్‌లోని థామస్ వ్యాలీ యూనివర్శిటీ (TVU) నుంచి ఆయన న్యాయవాద శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా కూడా చదివారు. నవాబ్‌జాదా ఘజన్‌ఫార్ గుల్ లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు, చర్చలో కూడా గౌరవ పట్టా పొందారు. పంజాబ్ హైకోర్టులో ఆయన న్యాయవాదిగా ఉన్నారు. ఆయన కుటుంబం యొక్క ప్రజా జీవితం 1826 నుంచి మొదలైంది. ఆయన తాత నవాబ్ సర్ ఫజాల్ అలీ ఖాన్, MBE-OBE, 1928లో గుజరాత్ జిల్లా బోర్డుకు మొదటి అనధికారిక ఛైర్మన్‌గా పనిచేశారు. తరువాత, ఆయన పంజాబ్ శాసనసభలో సభ్యుడయ్యారు, గుజరాత్‌లోని ప్రసిద్ధ జమీందారా కళాశాలను స్థాపించారు. నవాబ్‌జాదా అస్గర్ అలీ ఖాన్ తన తండ్రి (నవాబ్ సర్ ఫజల్ అలీ ఖాన్) పంజాబ్ శాసనసభ సభ్యుడయ్యారు, గుజరాత్ జిల్లా బోర్డు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 1942లో ఆయన మరణం తరువాత, నవాబ్‌జాదా మజార్ అలీ ఖాన్ (నవాబ్‌జాదా ఘజన్‌ఫార్ అలీ గుల్ సోదరుడు) MNA అయ్యారు, ఇదిలా ఉంటే నవాబ్‌జాదా ముజాఫర్ అలీ ఖాన్ (నవాబ్‌జాదా ఘజన్‌ఫార్ అలీ గుల్ సోదరుడు) పంజాబ్ ప్రావీన్స్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికవడంతోపాటు, గుజరాత్ జిల్లా మండలి ఛైర్మన్‌గా పనిచేశారు.

చారిత్రక సాక్ష్యాలు[మార్చు]

గుజరాత్ పరిసరాల్లో అనేక చారిత్రాత్మక భవనాలు మరియు శిథిలాలు ఉన్నాయి. గ్రాండ్ ట్రంక్ రోడ్‌ను సాధారణంగా G.T. రోడ్డుగా సంక్షిప్తీకరించి పిలుస్తారు, దీనిని చక్రవర్తి షేర్ షా సురీ నిర్మించారు, ఇది గుజరాత్ గుండా వెళుతుంది. ఈ రోడ్డు మరియు ఆ కాలానికి చెందిన రాతి గోడతో పాటు ఇప్పటికీ ఉంది. గుజరాత్‌కు సమీపంలో జలాల్ పూర్ జట్టాన్, గాజియాన్, రానియాన్, లాలాముసా, పిండి మియానీ, షాదీవా్, కల్రా, తాండా, అడోవాల్, గాంద్రా కాలన్, కోట్లా, దౌలాత్ నగర్, దింగా, కుంజా, కోట్ రంజా తదితర పట్టణాలు ఉన్నాయి, వీటిలో అనేక పట్టణాల్లో చారిత్రాత్మక భవనాలు మరియు శిథిలాలు ఉన్నాయి.

భౌగోళిక స్థితి[మార్చు]

పాకిస్థాన్‌లో గుజరాత్ ఒక పురాతన నగరం, ఇది జీలం మరియు చీనాబ్ అనే రెండు ప్రసిద్ధ నదుల మధ్య ఉంది. నదులకు సమీపంలో ఉండటంతో, ఇక్కడి భూమి వరి మరియు చెరకు వ్యవసాయానికి బాగా అనుకూలంగా ఉంటుంది, ఈ ప్రాంతంలో ఇవి రెండు ప్రధాన పంటలుగా ఉన్నాయి. ఇది జమ్ము మరియు కాశ్మీర్‌కు ఈశాన్య సరిహద్దులో ఉంది, వాయువ్యంలో జీలం నది, తూర్పున మరియు ఆగ్నేయాన చీనాబ్ నది ఉన్నాయి, రెండో నది గుజరాత్‌ను గుజ్రాన్‌వాలా మరియు సియాల్‌కోట్ జిల్లాల నుంచి వేరు చేస్తుంది; నగరానికి పశ్చిమంగా బహౌద్దీన్ జిల్లా ఉంది.

వాతావరణం[మార్చు]

నగరంలో పాక్షిక వాతావరణం ఉంటుంది. వేసవి కాలంలో, పగటిపూట ఉష్ణోగ్రత 45 °C వరకు పెరుగుతుంది, ఆజాద్ కాశ్మీర్ పర్వతాలు సమీపంలో ఉన్న కారణంగా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే కాలం చాలా తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 °C కంటే తక్కువ స్థాయికి పడిపోతాయి, గుజరాత్‌లో సగటు వర్షపాతం 67 సెంటీమీటర్లు.

సంస్కృతి[మార్చు]

తక్కువ-ఉష్ణోగ్రత వద్ద చేసిన మృణ్మయ పాత్రలు మరియు పింగాణీ వస్తువులు, హుక్కాలు, చేనేత కళావస్తువులు, పుష్ప పాత్రలు, "చాన్‌గైరియాన్" (తాటి మరియు ఖర్జూర చెట్ల ఆకుల నుంచి తయారు చేస్తారు), నూలు చాపలు, నేత శాలువాల తయారీకి గుజరాత్ పేరుగాంచింది. సోహ్నీ మాహివాల్ పంజాబ్ ప్రాంతంలో ఒక ప్రఖ్యాత జానపద కథ. ఆ కథలో కథానాయిక పేరు "సోహ్ని" (అందమైన అనే అర్థం వచ్చే పంజాబీ పదం) గుజరాత్ ప్రాంతం నుంచి వచ్చింది. తన ప్రేమికుడు "మాహిన్‌వాల్"ను కలుసుకునేందుకు ఆమె కుండపై కూర్చొని చీనాబ్ నదిని దాటి వచ్చేది. ప్రస్తుత రోజుకు కూడా ఈ కథ చెప్పబడుతుంది, పంజాబీ సంస్కృతిలో ఇది ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. కరువాన్ వాలా గుజరాత్ సమీపంలో జరిగే కన్వాన్-వాలీ సర్కార్ వార్షిక వేడుకను ప్రతి ఏడాది ఆగస్టులో అట్టహాసంగా జరుపుకుంటారు. అత్యంత గొప్ప సన్యాసుల్లో ఆయన కూడా ఒకరిగా పరిగణించబడుతున్నాడు. వాస్తవానికి ఒక బావిలో నీరు కొంత కాలంపాటు పాలుగా మారడం ఈ ప్రాంతంలో జరిగిన ఒక అద్భుతంగా చెప్పవచ్చు. ఈ బావి ఇప్పటికీ ఉంది. ఈ వేడుక జరిపే సమయంలో భారీగా వర్షాలు కురుస్తాయని స్థానికులు విశ్వసిస్తారు (అయితే వాస్తవానికి వర్షాలు రుతుపవనాల వలన కురుస్తాయి), ఇదిలా ఉంటే వెంగీ వాలీ సర్కార్ వార్షికోత్సవం జనవరి 5న ప్రతి ఏడాది జరుగుతుంది, దీనిని గుజరాత్ జిల్లాలోని కరియన్‌వాలా తెహ్సిల్ సమీపంలో హాజీ వాలా గ్రామంలో నిర్వహిస్తారు.

ఆర్థిక వ్యవస్థ/పరిశ్రమ[మార్చు]

గుజరాత్ దాని యొక్క మట్టి ద్వారా ప్రసిద్ధిగాంచింది, దీనితో సుదీర్ఘకాలంపాటు స్థానికులు నాణ్యమైన మృణ్మయ పాత్రలు తయారు చేశారు. ఈ నగరంలో నాణ్యమైన పర్నిచర్ కూడా తయారు చేస్తారు. గత కొన్ని దశాబ్దాలుగా, గుజరాత్ ఎలక్ట్రానిక్ ఫ్యాన్‌ల తయారీ మరియు ఎగుమతికి ప్రసిద్ధి చెందింది. పాకిస్థాన్‌లోని రెండు అతిపెద్ద షూ తయారీ కంపెనీల్లో ఒకటి గుజరాత్‌లో ఉంది, దీని పేరు సర్వీస్ ఇండస్ట్రీస్, నగరంలో ఇది అతిపెద్ద షూ కర్మాగారాన్ని నిర్వహిస్తుంది. దీని యజమాని Ch. అహ్మద్ ముఖ్తార్, ప్రస్తుతం ఆయన పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు, పొరుగు గ్రామాల్లోని అనేక మంది పౌరులు ఈ కర్మాగారంలో ఉపాధి పొందుతున్నారు.

జిల్లాలో సుమారుగా 1,059 కుటీర-స్థాయి మరియు చిన్న-భారీ-తరహా పరిశ్రమలు నిర్వహించబడుతున్నాయి. గుజరాత్‌లో వరి ఉత్పత్తి మరియు ఎగుమతి మరో ప్రధాన కార్యకలాపంగా ఉంది. ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రిక్ మోటార్లు తయారు చేసే కర్మాగారాలు, బియ్యం శుభ్రపరిచే పరిశ్రమలు అనేకం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి కుటీర పరిశ్రమలు అధిక సంఖ్యలో పౌరులకు ఉపాధి కల్పిస్తున్నాయి, మొత్తంమీద స్థానిక మార్కెట్‌లో 90 శాతం మంది పౌరులు కుటీర పరిశ్రమలో ఆధారపడి ఉన్నారు.

పాకిస్థాన్‌లో ఎలక్ట్రిక్ ఫ్యాన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన చరిత్ర 1940వ దశకంలో ప్రారంభమైంది, అనేక కష్టాలు ఎదుర్కొని, ప్రభుత్వం లేదా విదేశీ సాయం లేకుండా కొంత మంది ఔత్సాహికులు ఈ పరిశ్రమను స్థాపించారు, దీని వలన ఒక సమర్థవంతమైన పరిశ్రమ రూపుదిద్దుకుంది. గుజరాత్, గుజ్రాన్‌వాలా, లాహోర్ మరియు మరికొన్ని ఇతర నగరాల్లో ఇప్పుడు ఐదు వందలకుపైగా ఫ్యాన్ కర్మాగారాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ ఫ్యాన్ పరిశ్రమలు గుజరాత్‌లోనే ఉన్నాయి.

విద్య[మార్చు]

ఇక్కడ అధిక సంఖ్యలో విద్యా సంస్థలు ఉండటంతో, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ ప్రాంతానికి "ఖితా-ఎ-యునాన్" లేదా "పురాతన గ్రీసును తలపించే భూభాగం" అనే పేరు పెట్టారు. గుజరాత్‌లో ఈ కింది విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు ఉన్నాయి:

 • గుజరాత్ విశ్వవిద్యాలయం
 • గవర్నమెంట్ జమీందార్ డిగ్రీ కాలేజ్ (పురుషులకు)
 • గవర్నమెంట్ ఫాతిమా జిన్నా డిగ్రీ కాలేజ్ (మహిళలకు)
 • గవర్నమెంట్ కాలేజ్ ఫర్ గర్ల్స్
 • గవర్నమెంట్ కాలేజ్ ఫర్ కామర్స్
 • పంజాబ్ కాలేజ్
 • స్వదేశీ పాకిస్థానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
 • నవాజ్ షరీఫ్ మెడికల్ కాలేజ్, ఇది గుజరాత్ విశ్వవిద్యాలయంలో ఉంది
 • గుజరాత్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్
 • చీనాబ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్
 • గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్, రైల్‌వే రోడ్,
 • గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్, G.T. రోడ్,
 • జామీయా ఇస్లామియా లె-బినాత్-ఉల్-ఇస్లామ్ (మతపరమైన విద్యా సంస్థ)
 • గవర్నమెంట్ కాంప్రెహెన్సివ్ స్కూల్ G.T రోడ్ సర్వీస్ మోర్
 • మున్సిపల్ మోడల్ ఉన్నత పాఠశాల ఫర్ బాయ్స్, ముస్లిం అబాద్ గుజరాత్
 • మున్సిపల్ మోడల్ హై స్కూల్
 • షౌకాత్ మోడల్ హై స్కూల్

రవాణా[మార్చు]

గుజరాత్‌లో చీనాబ్ నదిపై ఉన్న అలెగ్జాండ్రియా వంతెన

ఈ జిల్లాలో 1,019 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాలు ఉన్నాయి, గుజరాత్ కంకర రోడ్డుల ద్వారా గుజ్రాన్‌వాలా, జీలమ్ మరియు మండి బహౌద్దీన్ జిల్లాలతో అనుసంధానం చేయబడింది. ప్రధాన పెషావర్ - కరాచీ రైలు మార్గం ఈ నగరం గుండా వెళుతుంది, ఈ మార్గంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఇది కూడా ఒకటి. పాకిస్థాన్ రైల్వే వ్యవస్థ ఈ జిల్లాను జీలమ్, మండి బహౌద్దీన్, సార్గోధా మరియు గుజ్రాన్‌వాలా జిల్లాలతో కలుపుతుంది. డెవూ ఎక్స్‌ప్రెస్ గుజరాత్ GT రోడ్డుపై ఒక టెర్మినల్ కలిగివుంది, మే 14, 2004న ప్రారంభమైన ఈ ఎక్స్‌ప్రెస్ గుజరాత్‌ను లాహోర్‌తో కలుపుతుంది. గుజరాత్ విమానాశ్రయంలో ఎటువంటి వాణిజ్య విమాన సేవలు అందుబాటులో లేవు, ఇక్కడి పౌరులు దేశీయ మరియు అంతర్జాతీయ విమాన సేవలను సమీపంలోని లాహోర్ అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు సియాల్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉపయోగించుకుంటున్నారు.

ప్రసిద్ధ వ్యక్తులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 "Tehsils & Unions in the District of Gujrat - Government of Pakistan". మూలం నుండి 2009-02-14 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)

బాహ్య వలయాలు[మార్చు]