గుడిబండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడిబండ
—  మండలం  —
అనంతపురం పటంలో గుడిబండ మండలం స్థానం
అనంతపురం పటంలో గుడిబండ మండలం స్థానం
గుడిబండ is located in Andhra Pradesh
గుడిబండ
గుడిబండ
ఆంధ్రప్రదేశ్ పటంలో గుడిబండ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°56′24″N 77°05′13″E / 13.940065°N 77.08683°E / 13.940065; 77.08683
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రం గుడిబండ
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,610
 - పురుషులు 26,964
 - స్త్రీలు 25,646
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.82%
 - పురుషులు 60.53%
 - స్త్రీలు 34.43%
పిన్‌కోడ్ 515 271

గుడిబండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన పూర్తి గ్రామీణ మండలం.


OSM గతిశీల పటము


       ఒకప్పుడు బండకొండగా పేరుగాంచిన ప్రాంతమే నేడు గుడిబండగా పిలువబడుతోంది.

క్రీ.పూ. 17వ శతాబ్దం క్రితం గుడిబండ కోటలో రాహుత్త మహారయ అనే రాజు పరిపాలిస్తుండే వాడు.ఆయన 90ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండపై కొండ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. కొండపై సుందరమైన కొలనులు, కోటగోడలు, బందిఖానా, నంది విగ్రహం, ఫిరంగులు, సొరంగాలు ఇక్కడ దర్శనమిస్తాయి. పూర్వీకులు చెక్కిన శిలలు, రాతలు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఇదేగాక గుడిబండ కొండపై ఉన్న కొలనులో నిమ్మకాయవేస్తే కొండకు 8కిలోమీటర్ల దూరంలో ఉన్న మోరుబాగల్ చెరువులో నిమ్మకాయ తేలుతుందని పూర్వీకులు నమ్మేవారు. ఇలాంటి కొండపైఅప్పట్లో కోటను నిర్మించడానికి రాజులు నానా తంటాలు పడ్డారని, ఆ కోట ఒక ప్రక్క నిర్మిస్తే మరోపక్క కూలిపోయేదని చివరకు మల్లేశ్వరుడి గుడి కట్టిన తర్వాతనే కోట నిర్మాణం జరిగిందని పూర్వీకులు చెపుతున్నారు. మూఢ విశ్వాసంతో ఒక నిండు గర్భిణిని అప్పట్లో బలిచ్చారట. ఇప్పటికీ ఆ మరణించిన మహిళ ఆనవాళ్ళు నేటికీ ఆ కొండపై చూడవచ్చు. ఈ కొండ పై నిర్మించిన మల్లేశ్వరస్వామి ఆలయాన్ని బలైన మహిళ ఆనవాళ్ళను చూసి తెలుసుకోవడానికి ఎంతో మంది సందర్శకులు వచ్చి వెళుతుంటారు. ఈ కొండపైకి వెళ్లడానికి సరైన మెట్ల సౌకర్యం లేక మహిళలు,పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

      కొండపై నిర్మించిన మల్లేశ్వరస్వామి ఆలయం కూడా కాలక్రమేనా శిథిలావస్థకు చేరుకుంది.మైరాడా స్వచ్చంద సంస్థ ముందుకు వచ్చి ఆలయానికి మరమ్మతు చేయించింది. దానితో ఆలయానికి పూర్వవైభవం వచ్చింది. గుప్త నిధుల కోసం నంది విగ్రహాన్ని సైతం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో నూతనంగా నంది విగ్రహాన్ని ప్రతిష్టించారు. కొండ పైకి వెళ్లే మెట్లదారిలో విద్యుత్ స్థంభాలను అమర్చి మల్లేశ్వర దేవాలయానికి కొండ పైకి విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 52,610 - పురుషులు 26,964 - స్త్రీలు 25,646;

2001 - 2011 మధ్య కాలంలో మండల జనాభా 47,838 నుండి 52,610 కి పెరిగి, 9.98% దశాబ్ద కాలపు పెరుగుదలను నమోదు చేసింది. ఇదే కాలంలో జిల్లా పెరుగుదల రేటు 12.1% గా ఉంది.[1]

మూలాలు[మార్చు]

  1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.