Jump to content

గుడ్ బ్యాడ్ అగ్లీ

వికీపీడియా నుండి
గుడ్ బ్యాడ్ అగ్లీ
దర్శకత్వంఅధిక్ రవిచంద్రన్
రచనఅధిక్ రవిచంద్రన్
రవి కందసామి
హరీష్ మణికందన్
నిర్మాతనవీన్ యెర్నేని
రవిశంకర్ యలమంచిలి
తారాగణం
ఛాయాగ్రహణంఅభినందన్ రామానుజం
కూర్పువిజయ్ వేలుకుట్టి
సంగీతంజి. వి. ప్రకాష్ కుమార్
నిర్మాణ
సంస్థ
మైత్రి మూవీ మేకర్స్
విడుదల తేదీs
2025 ఏప్రిల్ 10 (2025-04-10)
2024 మే 8 (2024-05-08)( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
సినిమా నిడివి
139 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్190-200 కోట్లు[1][2]

గుడ్ బ్యాడ్ అగ్లీ 2025లో విడుదలైన యాక్షన్ కామెడీ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, అర్జున్ దాస్, సునీల్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 7న విడుదల చేశారు.[3]

ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదలైన 20 రోజుల్లోనే రూ.250 కోట్లకు గ్రాస్‌ వసూళ్లను సాధించింది.[4]

గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషలలో విడుదలైంది. ఈ సినిమా మే 8 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[5]

రెడ్ డ్రాగన్ అలియాస్ ఏకే (అజిత్) గ్యాంగ్ స్టర్. ఎన్నో ఏళ్లు చీకటి సామ్రాజ్యానికి డాన్‌గా వ్యవహరించిన అతను తన భార్య రమ్య (త్రిష) కోరిక మేరకు అన్నింటినీ వదిలేసి జైలుకు వెళ్తాడు. 17 ఏళ్లు జైలు జీవితం గడిపి విడుదలైన తర్వాత స్పెయిన్‌లో ఉన్న తన కొడుకు విహాన్ (కార్తీక్ దేవ్)ను చూసేందుకు తన భార్య (త్రిష)తో కలిసి స్పెయిన్ వెళ్లేందుకు రెడీ అవుతాడు. స్పెయిన్ బయలు దేరిన ఏకేకు ఎదురైనా సమస్యలు ఏమిటి ? స్పెయిన్‌లో అతని కొడుకును ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేసి ఓ డ్రగ్స్ కేసులో జైలు పాలయ్యేలా చేస్తుంది. అసలు అతని కొడుకుని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు? తన కొడుకుని ఏకే ఎలా కాపాడుకున్నాడా? అనేదే మిగతా సినిమా కథ.[6]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Prakash, B. V. S. (1 July 2024). "Tamil Star Ajith's Good Bad Ugly Goes Over Budget?". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
  2. Choudhury, Anjali (14 March 2025). "Good Bad Ugly plot REVEALED, fans compare Ajith Kumar starrer with Thalapathy Vijay's Leo". Pinkvilla. Retrieved 8 April 2025.
  3. "అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్ అదిరిందిగా." 10TV Telugu. 7 April 2025. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
  4. "ఓటీటీలోకి 270 కోట్ల యాక్షన్ థ్రిల్లర్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. 6.9 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!". Hindustantimes Telugu. 7 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  5. "ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?". ABP Desham. 2 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  6. "రివ్యూ: గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ.. అజిత్‌ హిట్‌ కొట్టారా?". Eenadu. 10 April 2025. Archived from the original on 10 April 2025. Retrieved 10 April 2025.
  7. "Good Bad Ugly: Trisha Krishnan officially joins cast of Ajith Kumar starrer, reuniting with superstar after Vidaamuyarchi". Pinkvilla (in ఇంగ్లీష్). 22 February 2025. Archived from the original on 22 February 2025. Retrieved 22 February 2025.
  8. "THIS 'Salaar' actor plays Ajith's son in 'Good Bad Ugly', reveals Adhik Ravichandran". The Times of India. 22 March 2025. Archived from the original on 22 March 2025. Retrieved 23 March 2025.
  9. "Raghu Ram on 'Good, Bad, Ugly', working with Ajith Kumar and Adhik Ravichandran". The Hindu (in ఇంగ్లీష్). 18 March 2025. Archived from the original on 18 March 2025. Retrieved 18 March 2025.

బయటి లింకులు

[మార్చు]