గుత్తా సుఖేందర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుత్తా సుఖేందర్ రెడ్డి

పదవీ కాలము
11 సెప్టెంబర్ 2019 -
ముందు కనకమామిడి స్వామి గౌడ్‌
నియోజకవర్గము నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1954-02-02) 1954 ఫిబ్రవరి 2 (వయస్సు: 66  సంవత్సరాలు)
ఊరుమడ్ల, నల్లగొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి అరుంధతి
సంతానము 1 కొడుకు, 1 కుమార్తే
మతం హిందూ మతం

గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి.

జననం, చదువు[మార్చు]

ఈయన నల్లగొండ జిల్లాలోని ఊరుమడ్ల గ్రామంలో సరస్వతమ్మ, వెంకట్ రెడ్డి దంపతులకు1954, ఫిబ్రవరి 2న జన్మించాడు.[1][2]నాగక్రమం భగవాన్ దాస్ సైన్స్ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో నుండి బి.యస్సీ. పట్టా పొందాడు.

వివాహం[మార్చు]

1977, మే 1న అరుంధతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.

రాజకీయ జీవితం[మార్చు]

గుత్తా సుఖేందర్ రెడ్డి మొదట్లో కమ్యూనిస్టు పార్టీలో, ఆ తరువాత తెలుగుదేశం, కాంగ్రెస్ లో పనిచేశాడు. సుఖేందర్‌రెడ్డి 2004 పార్లమెంట్ ఎన్నికల్లో టిడిపి నుంచి, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి గెలిచి 2016, జూన్ 15న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018, మార్చిలో ముఖ్యమంత్రి కెసీఆర్ ఆయనను రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నియమించాడు. 2018, మార్చి 12వ తేదిన రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా ఆయన ప్రమాణాస్వీకారం చేశాడు. 2019, ఆగస్టులో ఈయనకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. [3]

వృత్తి[మార్చు]

వ్యవపాయదారులు

పదవులు[మార్చు]

  1. ఛైర్మన్ - పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం (1995-99)
  2. NARMUL (1990-95)
  3. NDDB (1998-99)
  4. 1999లో 13వ లోక్ సభ స్థానానికి మొదటిసారి ఎన్నికై, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖలలో సభ్యునిగా పనిచేశాడు.
  5. 2009లో 15వ లోక్ సభ స్థానానికి రెండవసారి ఎన్నికై, Commerce శాఖ (31 ఆగస్టు 2009) కు, Committee on Papers Laid on the Table శాఖ (23 సెప్టంబర్ 2009) కు సభ్యునిగా పనిచేశాడు.

మూలాలు[మార్చు]

  1. "లోకసభ జాలగూడు". మూలం నుండి 2013-02-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-01-19. Cite web requires |website= (help)
  2. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (11 September 2019). "శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి". ntnews.com. మూలం నుండి 11 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 11 September 2019.
  3. "సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు : గుత్తా సుఖేందర్ రెడ్డి". ntnews.com. 13 March 2018. మూలం నుండి 11 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 11 September 2019.