Coordinates: 7°35′12″S 112°44′0″E / 7.58667°S 112.73333°E / -7.58667; 112.73333

గునుంగ్ గ్యాంగ్‌సిర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గునుంగ్ గ్యాంగ్‌సిర్ ఆలయం
ముందు నుండి గునుంగ్ గ్యాంగ్‌సిర్ దేవాలయం
సాధారణ సమాచారం
నిర్మాణ శైలికాండీ ఇండోనేషియా
పట్టణం లేదా నగరంపసురువాన్ రీజెన్సీ, తూర్పు జావా.
దేశంఇండోనేషియా
భౌగోళికాంశాలు7°35′12″S 112°44′0″E / 7.58667°S 112.73333°E / -7.58667; 112.73333
సాంకేతిక విషయములు
పరిమాణం15 x 15 x 15 m

గునుంగ్ గ్యాంగ్‌సిర్ (ఇండోనేషియా: Candi Gunung Gangsir) అనేది ఇండోనేషియాలో గల పదకొండవ శతాబ్దానికి చెందిన పురాతన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఇండోనేషియాలోని బంగీల్ పట్టణానికి పశ్చిమాన ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఎరుపు ఇటుక నిర్మాణం తూర్పు జావా ఇండోనేషియాలోని పసురువాన్ రీజెన్సీలో గల బెజి ఉపజిల్లాలోని గునుంగ్ గాంగ్‌సిర్ గ్రామంలో ఉంది. తూర్పు జావానీస్ దేవాలయాలలో గునుంగ్ గ్యాంగ్‌సిర్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే తూర్పు జావానీస్, సెంట్రల్ జావానీస్ ఆలయ శైలులను మిళితం చేసే ఏకైక ఆలయం ఇది. వివిధ రకాల అలంకరణలను ప్రదర్శించడానికి క్లే కాస్టింగ్ టెక్నిక్‌లను ఉపయోగించిన తూర్పు జావాలోని ఏకైక ఆలయం ఇది.[1]

మజాపహిత్ కాలంలోని పారి, జబుంగ్ దేవాలయాల కంటే ఈ ఆలయం చాలా పురాతనమైనదని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ విధంగా ఆలయాన్ని సుమారుగా 11వ శతాబ్దం CE నాటిదిగా, ఇది సుమారుగా కహురిపాన్ కింగ్డమ్ రాజు ఎయిర్‌లాంగా పాలనలోనిదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. డచ్ పురావస్తు శాస్త్రవేత్తలు మారిజ్కే, క్లోక్కే, గునుంగ్ గాంగ్‌సిర్ ఆలయాన్ని తూర్పు జావానీస్ రాజ్య కాలం ముగింపు సమయంలో పురాతన ఆలయంలోని వస్తువులను ఉపయోగించి పునరుద్ధరించబడిందని అధ్యయనం చేసి నిర్ధారించారు.[2]

వ్యుత్పత్తి శాస్త్రం[మార్చు]

ఈ ఆలయం అసలు పేరు, ఈ ఆలయంలో ఏ దేవత పూజించబడుతోంది, నిర్మాణాన్ని ప్రారంభించిన రాజు లేదా ప్రాంతీయ పాలకుడు ఎవరు, ఇది ఎప్పుడు నిర్మించారు అనే మొదలైన విషయాలు ఇప్పటికీ ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఆలయానికి సమీపంలో ఎటువంటి రికార్డులు లేదా శాసనాలు కనుగొనబడలేదు. పూర్వం, ఈ ఆలయాన్ని స్థానికులు కెబొంకండి ఆలయం అని పిలిచేవారు.

ఈ ఆలయం గురించి చుట్టుపక్కల ప్రజలలో కొన్ని పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. గునుంగ్ అనే పదానికి స్థానిక భాషలో "పర్వతం" అని అర్థం - బహుశా పునర్నిర్మాణానికి ముందు ఈ పేరు ఆలయ శిథిలాల ఆకారాన్ని సూచిస్తుంది. అంటే పర్వతాన్ని పోలి ఉండే మట్టి ఇటుక దిబ్బ అని అర్థం. గ్యాంగ్‌సిర్ (జావానీస్: ngangsir) అనే పదానికి భూమి ఉపరితలం కింద "రంధ్రం తీయడం" లేదా "సొరంగం త్రవ్వడం" అని అర్థం. స్థానిక నివాసితుల ప్రకారం, ఒక రోజు ఆలయ భవనం క్రింద ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడానికి మట్టిదిబ్బలోకి రంధ్రం తీయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఉన్నప్పుడు ఈ పేరు పెటబడింది. తదనంతరం, ఈ ఆలయాన్ని కాండీ గునుంగ్ గ్యాంగ్‌సిర్ అని పిలవటం మొదలైంది.[3]

నిర్మాణం,శైలి[మార్చు]

ఆలయ నిర్మాణం ఎర్ర ఇటుకలతో తయారు చేయబడింది, ఇది మజాపహిత్ కాలంలో (c. 14 నుండి 15వ శతాబ్దం వరకు) సాధారణ ఆలయ నిర్మాణ సామగ్రితో నిర్మించారని తేలింది. డిజైన్, ఆకారం, నిష్పత్తి, అలంకరణలు వంటివి మునుపటి కాలం నుండి సెంట్రల్ జావానీస్ దేవాలయాల మాదిరిగానే ఉన్నాయి. ఉదాహరణకు, బోరోబుదూర్ సమీపంలోని 8వ శతాబ్దానికి చెందిన మెండట్ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ విధంగా, నిపుణులు ఈ ఆలయ నిర్మాణ కాలాన్ని సుమారు 11వ శతాబ్దం CEగా పేర్కొన్నారు.

ఆలయం తూర్పు-ఆగ్నేయ దిశలో ఉంది, ఆలయ నిర్మాణానికి తూర్పు వైపున మెట్లు ఉన్నాయి. ఆలయ ఆధారం దీర్ఘచతురస్రాకారంలో 15 మీటర్లు x 15 మీటర్ల పరిమాణంతో ఉంటుంది. ఆలయం ఎత్తు 15 మీటర్లు, అడుగు (బేస్) భాగం, ఆలయ ప్రధాన భాగం, పైకప్పు భాగం మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆలయం గూళ్లు, అతుకులు, అలంకరించబడిన యాంటీఫిక్స్‌లతో చాలా గొప్పగా అలంకరించబడి ఉంది. సంక్లిష్టమైన ప్యానెల్లు, బాస్-రిలీఫ్‌ల రూపంలో ఆభరణాలు, పూల మూలాంశాలతో కూడిన పాత్రలు, చెట్లు, జంతువుల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. వజ్రలేప అని పిలవబడే శిల్పాల జాడలు ఉన్నాయి, ఇవి వాస్తవానికి ఆలయం ఉపరితలం మొత్తం కప్పబడి ఉండేవని సూచిస్తున్నాయి, ఇది ప్రంబనన్ సమీపంలోని కలసన్, సారీ ఆలయాలను పోలి ఉంటుంది.[4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Gununggangsir Temple". National Library of Indonesia. 2014. Archived from the original on 2021-12-01.
  2. Rujivacharakul, Vimalin; Hahn, H. Hazel; Oshima, Ken Tadashi; Christensen, Peter (2013-11-01). Architecturalized Asia: Mapping a Continent through History (in ఇంగ్లీష్). Hong Kong University Press. ISBN 978-988-8208-05-0.
  3. "Gunung Gangsir Temple". www.eastjava.com. Retrieved 2020-04-07.
  4. Sedyawati, Edi. Candi Indonesia (in ఇండోనేషియన్). Latief, Feri, Indonesia. Direktorat Pelestarian Cagar Budaya dan Permuseuman (Cetakan pertama ed.). Jakarta. ISBN 9786021766934. OCLC 886882212.

వెలుపలి లంకెలు[మార్చు]