గుమ్మడి అనురాధ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుమ్మడి అనురాధ

వ్యక్తిగత వివరాలు

జననం 1988
టేకులగూడెం గ్రామం
సింగరేణి మండలం
ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం
తల్లిదండ్రులు గుమ్మడి నర్సయ్య
నివాసం హైదరాబాద్
మతం హిందూ

గుమ్మడి అనురాధ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్. ఆమె ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ, బషీర్​బాగ్​లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్‌గా పని చేస్తుంది.[1][2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

గుమ్మడి అనురాధ తెలంగాణ రాష్ట్రం , ఖమ్మం జిల్లా , సింగరేణి మండలం , టేకులగూడెం గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి గుమ్మడి నర్సయ్య, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే. గుమ్మడి అనురాధ ఒకటవ తరగతి నుండి మూడో తరగతి వరకు టేకులగూడెం గ్రామంలో చదివి , 4వ నుండి ఇంటర్మీడియట్ వరకు సుదిమల్ల లోని ఏపీ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో, ఇల్లెందులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలో బీఏ పూర్తి చేసింది. ఆమె 2006లో ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బీలో పూర్తి చేసి, బషీర్‌బాగ్ న్యాయ కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం, ఎం.ఎ ఫిలాసఫీ పూర్తి చేసింది. ఆమె ఉస్మానియాలో ఎల్‌ఎల్‌బీ చదువుతూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయి రెండుసార్లు రాసినా రాలేదు. ఆమె 2017లో 'ట్రైబల్‌ ప్రాపర్టీ రైట్స్‌ ఇన్‌ తెలంగాణ, స్పెషల్‌ రిఫరెన్స్‌ టు ఖమ్మం' అనే అంశం పైన పీహెచ్‌డీ పూర్తి చేసింది.[3]

అనురాధ డిగ్రీలో పీడీఎస్‌యూ కమిటీలో సభ్యురాలిగా నియమితురాలైంది. ఆమె పీడీఎస్‌యూలో ఓయూ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పని చేసింది.

వృత్తి జీవితం[మార్చు]

డాక్టర్ గుమ్మడి అనురాధ పీహెచ్‌డీ చేస్తుండగానే ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఓ యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించిన తొలి ఆదివాసీ మహిళగా గుర్తింపునందుకుంది.[4]గుమ్మడి అనురాధను బషీర్​బాగ్​లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్‌గా నియమిస్తూ 15 సెప్టెంబర్ 2021న ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశాడు.[5] ఆమె 16 సెప్టెంబర్ 2021న ప్రిన్సిపాల్‌గా భాద్యతలు చేపట్టింది.[6][7][8][9][10]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (15 September 2021). "ఓయూ పీజీ లా కాలేజ్‌ ప్రిన్సిపాల్‌గా". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  2. News18 Telugu (20 September 2021). "Success Story: ఆ మహిళ విజయ ప్రస్థానం.. ప్రతీ ఒక్కరికీ ఆదర్శం.. ఆమె విజయగాధ మీకోసం." Retrieved 21 September 2021.
  3. Eenadu (19 September 2021). "ముగ్గురూ... ముగ్గురే..." Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  4. The News Minute (8 September 2020). "An interview with Dr Gummadi Anuradha, Telangana's first Adivasi law professor" (in ఇంగ్లీష్). Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  5. V6 Velugu (16 September 2021). "ఓయూ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్ గా గుమ్మడి అనురాధ" (in ఇంగ్లీష్). Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  6. Andrajyothy (16 September 2021). "ఓయూ లా కళాశాల ప్రిన్సిపాల్‌గా జిల్లా ఆదివాసీ మహిళ". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  7. Suryaa (17 September 2021). "ఓయూ చరిత్రలో నూతన అధ్యాయం.. ప్రిన్సిపల్‌గా ఆదివాసీ మహిళ". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  8. The Hindu (17 September 2021). "Elevation of Adivasi academic hailed" (in Indian English). Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  9. Deccan Chronicle (17 September 2021). "Gummadi Anuradha first Adivasi woman in Telugu states to head a law college" (in ఇంగ్లీష్). Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.
  10. TNews Telugu (17 September 2021). "ఓయూ చరిత్రలోనే తొలిసారి.. ప్రిన్సిపల్‌గా ఆదివాసీ మహిళ - TNews Telugu". Archived from the original on 21 September 2021. Retrieved 21 September 2021.