గుమ్మడి కుతూహలమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుమ్మడి కుతూహలమ్మ

మాజీ ఎమ్మెల్యే & మాజీ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
తరువాత నారాయణస్వామి
నియోజకవర్గం గంగాధరనెల్లూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 జూన్ 1949
కందుకూరు , ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2023 ఫిబ్రవరి 15(2023-02-15) (వయసు 73)
తిరుపతి, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రంగయ్య
జీవిత భాగస్వామి డాక్టర్‌. మునిసిద్దయ్య
సంతానం 2
నివాసం గంగాధరనెల్లూరు , చిత్తూరు జిల్లా

గుమ్మడి కుతూహలమ్మ (1949 జూన్ 1 - 2023 ఫిబ్రవరి 15) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రి.

జననం, విద్యాభాస్యం[మార్చు]

గుమ్మడి కుతూహలమ్మ 1949 జూన్ 1లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కందుకూరులో జన్మించింది. ఆమె ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసింది. అనంతరం ఆమె కొంతకాలం వైద్య వృత్తిలో పనిచేసి 1979 నుండి 1981 వరకు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పనిచేసింది.

రాజకీయ జీవితం[మార్చు]

జి.కుతూహలమ్మ 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసింది. ఆమె 1980 - 1985 సమయంలో చిత్తూరు జిల్లా జెడ్పి చైర్ పర్సన్ గా, కో- ఆప్షన్ సభ్యురాలిగా పనిచేసింది. ఆమె 1985లో వేపంజేరి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయింది.

ఆమె 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరింది.[1] ఆమె 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయింది.[2]

నిర్వహించిన పదవులు[మార్చు]

  1. 1980-1983 చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్
  2. 1985-1989 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యురాలు
  3. 1987-1994, ఆంధ్రప్రదేశ్ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
  4. 1991 - 1992 వైద్యారోగ్య శాఖ మంత్రి
  5. 1992-1997 ఏఐసిసి సభ్యురాలు
  6. 1992-1993 మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి
  7. 1998-2006 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు
  8. 1999-2003 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలు
  9. 2001-2004 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు కమిటీ సభ్యురాలు
  10. 24 జూలై 2007 నుండి 2009 మే 19 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్

పోటీ చేసిన నియోజకవర్గాలు[మార్చు]

సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ఫలితం
2014 గంగాధర నెల్లూరు (ఎస్సీ) కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) పురుషుడు వైఎస్సార్సీపీ 84538 గుమ్మడి కుతూహలమ్మ మహిళా తె.దే.పా 63973 ఓటమి
2009 గంగాధర నెల్లూరు (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 62249 గాంధీ పురుషుడు తె.దే.పా 51423 గెలుపు
2004 వేపంజేరి (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 58350 డా. ఓ .చంద్రమ్మ పురుషుడు తె.దే.పా 46768 గెలుపు
1999 వేపంజేరి (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 60760 పి. పుష్ప రాజ్ పురుషుడు తె.దే.పా 47554 గెలుపు
1989 వేపంజేరి (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 60710 తలారి రుద్రయ్య పురుషుడు తె.దే.పా 42920 గెలుపు
1985 వేపంజేరి (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 42534 బి.రమణ పురుషుడు తె.దే.పా 36827 గెలుపు

మరణం[మార్చు]

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 73 ఏళ్ల జి.కుతూహలమ్మ తిరుపతిలోని ఆమె నివాసంలో 2023 ఫిబ్రవరి 15న తుదిశ్వాస విడిచింది.[3]

మూలాలు[మార్చు]

  1. Deccan Chronicle (18 March 2014). "Congress legislator Gummadi Kutuhalamma joins Telugu Desam" (in ఇంగ్లీష్). Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
  2. Sakshi (18 May 2014). "దిగ్గజాలకు శృంగభంగం". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021.
  3. "Kuthuhalamma: మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత | Former minister Kuthuhalamma passes away Chittoor Andhrapradesh Suchi". web.archive.org. 2023-02-15. Archived from the original on 2023-02-15. Retrieved 2023-02-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)