గుమ్మడి గోపాలకృష్ణ
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
| గుమ్మడి గోపాలకృష్ణ | |
|---|---|
| జననం | గుమ్మడి గోపాలకృష్ణ 1955 మేడూరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| ఉద్యోగం | చైర్మేన్,ఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమీ |
| ప్రసిద్ధి | రంగస్థల నటుడు, కళా సేవకుడు |
| మతం | హిందూ |
గుమ్మడి గోపాలకృష్ణ పౌరాణిక పద్య నాటక పాత్రలను నటించే రంగస్థల నటుడు,కళా సేవకుడు.
జీవిత విశేషాలు
[మార్చు]కృష్ణా జిల్లా, మేడూరు, 1955లో పుట్టిన గోపాలకృష్ణ ప్రాథమిక విద్య మచిలీపట్నంలో జరిగింది. చిన్నప్పుడే నాటకాలపై అభిరుచి పెంచుకుని, తెలుగు పద్య నాటక గాన గంధర్వుడిగా ఎదిగిన రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]పదవ తరగతి పూర్తయ్యాక, పనిలేకుండా తిరుగుతున్న రోజుల్లో... 1982 లో ఆచంట వెంకటరత్నం నాయుడుగారు గుమ్మడి గారి ఊర్లో నాటకం వేశారు. ఆ సమయంలో వారు గోపాలకృష్ణ ని చూసి.. వాళ్ల గ్రూపులో చేర్చుకోవాలనుకున్నారు. గోపాలకృష్ణ ని తీసుకెళ్లి చింతా ఆంజనేయులు అనే హార్మోనిస్టు దగ్గర పెట్టారు. ఒకటి, రెండు నాటకాలు వేశాక తిరిగి ఇంటికి వెళ్లారు. ఈనాడు రామోజీరావు కోడలు గోపాలకృష్ణ దూరపు బంధువు కావడంతో ఈయన్ని ఈనాడులో పనికోసం హైదరాబాదు పంపించారు. కానీ, పనిదొరక లేదు. ఇంటికి మాత్రం రావొద్దని చెప్పి, హైదరాబాద్‌లో ఓ హౌసింగ్ సొసైటీలో ఉద్యోగంలో పెట్టారు. హైదరాబాదులో పరిచయమైన గురువు విద్వాన్ రామచంద్రగారు వీరి గొంతు విని అవకాశం ఇచ్చారు. 1983లో గుమ్మడి గోపాలకృష్ణ జీవితం మలుపుతిరిగింది. 1991లో తిరుపతి పరిషత్తులో మొదటిసారి ఉత్తమ యాక్టర్ అవార్డు అందుకున్నారు.
2003లో విజయనగరంలో వేసిన ‘శ్రీనాథుడి’ నాటకాన్ని చూసి అప్పా జోస్యుల ఫౌండేషన్ వాళ్లు అమెరికాలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీనాథ కవి నాటకాన్ని చూసి సి. నారాయణరెడ్డి గోపాలకృష్ణను మెచ్చుకున్నారు. ఆ పాత్ర ఇప్పటికే వందకు పైగా ప్రదర్శనలు పూర్తయ్యాయి.
నటించిన పాత్రలు
[మార్చు]- శ్రీనాథుడు
- శ్రీకృష్ణుడు
- శ్రీరాముడు
- యోగి వేమన
- సత్య హరిచంద్ర
- నారదుడు
- అర్జునుడు
నాటక అకాడెమీ
[మార్చు]2024 డిసెంబరులో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమీ చైర్మేన్‌గా రెండో పర్యాయం నియమితులయ్యి ఆంధ్రప్రదేశ్ నాటకరంగ అభివృద్దికోసం కృషిచేస్తున్నారు.[1]
తెలుగు ‘పద్య నాటకం’ యొక్క గత వైభవాన్ని పునరుద్ధరించి, పరిరక్షిస్తూ, ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రదర్శనతో పాటు డాక్యుమెంటేషన్ రూపంలో దానిని ఒక నిరంతర కళా ప్రవాహంగా కొనసాగించాలనే లక్ష్యంతో కృషిచేస్తున్నారు. మన గొప్ప సాంస్కృతిక వారసత్వ స్ఫూర్తిని యువతరానికి చేరవేసి, ఈ సంప్రదాయాన్ని కొనసాగించేలా వారిని ప్రోత్సహించడమే వీరి ప్రధాన ఉద్దేశ్యం.
పురస్కారాలు
[మార్చు]- 1999 స. ఆంధ్రప్రదేశ్ నంది నాటకోత్సవాలలో ఉత్తమ నటుడు అవార్డు (శ్రీకృష్ణ పాత్ర - శ్రీకృష్ణ తులాభారం)[2]
- సత్య సాయి బాబా వీరిని బంగారు బ్రేస్‌లెట్ తో సత్కరించారు.
అధారాలు, మూలాలు
[మార్చు]- https://www.deccanchronicle.com/151021/nation-current-affairs/article/amaravati-foundation-ceremony-gummadi-gopala-krishna-likely
- https://www.andhrajyothy.com/2020/open-heart/authors-and-artists/gummadi-gopalakrishna-748.html
- ↑ ABN (2024-12-05). "నాటక అకాడమీ చైర్మన్‌గా గుమ్మడి గోపాలకృష్ణ". Andhrajyothy Telugu News. Retrieved 2026-01-21.
- ↑ "నంది నాటక పరిషత్తు - 1999", వికీపీడియా, 2025-08-31, retrieved 2026-01-21