గుమ్మడి జాతి కాయ (మొక్క)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పసుపు రంగు గుమ్మడి జాతి కాయ (స్క్వాష్)
Summer squash
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి69 kJ (16 kcal)
3.4 g
పీచు పదార్థం1.1 g
0.2 g
1.2 g
విటమిన్లు Quantity %DV
రైబోఫ్లావిన్ (B2)
12%
0.14 mg
విటమిన్ సి
20%
17 mg
ఖనిజములు Quantity %DV
పొటాషియం
6%
262 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు95 g
Percentages are roughly approximated using US recommendations for adults.

మెక్సికో మరియు మధ్య అమెరికా ప్రాంతాలలో కుకుర్బిటా ప్రజాతికి చెందిన నాలుగు స్థానిక జాతులను, గుమ్మడికాయ జాతికి చెందిన కాయలుగా పిలుస్తున్నారు. వాటి రకాన్ని బట్టి, వాటిని పిలిచే పద్ధతిని బట్టి వాటిని ఒక రకం గుమ్మడికాయలని కూడా పిలుస్తున్నారు. వీటిలో సి.మ్యాక్సిమా (బూడిద గుమ్మడికాయ, తీయ గుమ్మడికాయ వంటి కొన్ని రకాల గుమ్మడి కాయలు), సి.మిక్సిటా, (కుషా స్క్వాష్), సి. మొచాటా (తీయ గుమ్మడి కాయ), సి.పెపో ( దీనిలో అనేక గుమ్మడి కాయలు, అకార్న్ స్క్వాష్, సమ్మర్ స్క్వాష్, బూడిద గుమ్మడి వంటి జాతులున్నాయి.[1] ఉత్తర అమెరికాలో గుమ్మడి జాతి కాయలను వాటిని పరిపక్వమయ్యే దాకా ఉంచుతున్నారా, లేక అపరిపక్వంగానే కోస్తున్నారా అనే వాటిని బట్టి వేసవి గుమ్మడికాయలు, శీతాకాల గుమ్మడికాయలని పిలుస్తున్నారు. ఆనప జాతికి చెందిన కాయలు కూడా గుమ్మడి జాతి కాయల కిందకే వస్తాయి. గుమ్మడి జాతి కాయలలో గుమ్మడి కాయ,బూడిద గుమ్మడి కాయబాగా తెలిసిన రకాలు. భారీ గుమ్మడి జాతి కాయలు కుకుర్బిటా మ్యాక్సిమా జాతికి చెందుతాయి. ఇవి భారీ గుమ్మడి కాయల పరిమాణానికి పెరుగుతాయి. మరిన్ని వివరాల కోసం ఆనప జాతి, గుమ్మడి జాతి కాయలను చూడండి.

సేద్యం[మార్చు]

పురాతత్వ ఆధారాలననుసరించి, గుమ్మడి జాతి కాయలను మొదట 8,000 సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల కిందట మధ్య అమెరికాలో పండించినట్లుగా తెలుపుతున్నాయి. ఆ తర్వాత వీటిని వివిధ ప్రాంతాలలో పండించి ఉండవచ్చు.[2] స్థానిక అమెరికా ప్రజలు పండించిన "సహ జాతు" (మూడు అంతర పంటలు)లలో గుమ్మడి జాతి కాయలు కూడా ఒకటి. సహ జాతులుగా పిలవబడిన పంటలు: మొక్కజొన్న, చిక్కుళ్ళు, గుమ్మడి జాతి మొక్కలు. ఈ మూడు పంటలను కలిపి పండించేవారు. మొక్కజొన్న కాండాలు చిక్కుళ్ళు పాకడానికి ఆధారంగా ఉండేవి, గుమ్మడి జాతి మొక్కలకు నీడనిచ్చేవి. గుమ్మడి తీగలు నేలపై కలుపు మొక్కలు పెరగకుండా అరికట్టేవి. కలుపు మొక్కలు గుమ్మడి జాతి మొక్కల పెరుగుదలకు హాని చేస్తాయి. మొత్తం మూడు పంటలకూ అవసరమైన నత్రజని స్థాపనను చిక్కుళ్ళు చేసేవి.

బూడిద గుమ్మడికాయ (దీన్నే కార్గెట్టీ అని కూడా పిలుస్తారు)తో పాటుగా, వేసవి గుమ్మడి జాతి రకాలను కూడా పెంచుతారు. పట్టీపాన్, పసుపు క్రూక్‌నెక్ రకాలను ఈ కాలంలో పెంచుతారు. వీటి చర్మం మృదువుగా ఉండి, కాయ చిన్నదిగా ఉంటుంది. వీటిని వండనవసరం లేకుండానే వెంటనే తినేయవచ్చు.

శీతాకాల గుమ్మడి జాతి రకాలను (తీయ గుమ్మడి కాయ, హబ్బార్డ్ స్క్వాష్, ఆంబర్ కప్ స్క్వాష్, అకార్న్, స్పాగెట్టీ స్క్వాష్, గుమ్మడి కాయల వంటివి) బాగా పండే దాకా పెంచుతారు. వేసవి చివరి దాకా వీటిని సాధారణంగా పెంచుతారు. పై చర్మం బాగా ముదిరే వరకూ ఉంచి ఆ తర్వాత వీటిని చల్లని ప్రదేశాలలో నిల్వ ఉంచుతారు. వేసవి కాలపు గుమ్మడి రకాల కంటే వీటిని ఎక్కువ సేపు వండాల్సి ఉంటుంది. (గమనిక: శీతాకాల గుమ్మడికాయ లను వేసవి గుమ్మడి జాతుల నుండి వేరు చేయడానికి వాడినప్పటికీ, వాటిని సాధారణంగా కుకుర్బిటా మ్యాగ్జిమాకు సమానార్థక పదంగా ఉపయోగిస్తారు. వృక్ష శాస్త్రఙ్ఞులు వీటిని పెపోగా వర్గీకరించారు. ఇది మందపాటి బయటి గోడను లేదా పొరను కలిగి ఉన్న ప్రత్యేక రకమైన బెర్రీపండు వంటిది. ఇది హైపాంథియం కణజాలంతో ఏర్పడుతుంది. దీన్ని భాహ్య ఫల కవచం అంటారు. కండ కలిగి ఉన్న మధ్య, లోపలి పొరలను వరుసగా మధ్య ఫల కవచం, లోపలి ఫల కవచం. అంటారు. పెపో లోపలి అండం నుండి తయారవుతుంది. గుమ్మడి జాతి మొక్కల (కుకుర్బటేసి) సాధారణ లక్షణమిది. పాకశాస్త్రం ప్రకారం వేసవి, శీతాకాల గుమ్మడి జాతులన్నీ కూరగాయల కోవలోకే వస్తాయి. గుమ్మడి కాయను కూడా తీపి పదార్ధాల తయారీకి ఉపయోగిస్తారు.

ఫలంతో పాటుగా మొక్క ఇతర భాగాలు కూడా ఉపయోగకరమైనవే. గుమ్మడి జాతి విత్తనాలను ఉన్నవి ఉన్నట్లుగానే తినవచ్చు. చిన్న ముక్కలుగా చేసి వాటిని ఆహారంలో కలుపుకొని తినవచ్చు, లేదా పిండిగా చేసి దాని నుండి నూనె తయారుచేయవచ్చు. (ఉదా: సొరకాయ, బఫెలో గార్డ్, గుమ్మడి కాయల గింజల తైలాలు) వీటి మొలకలు, ఆకులు, నులితీగలను ఆకు కూరలలాగా తింటారు. వీటి పుష్పకాలు ఉత్తర అమెరికా వంటకాలలో చాలా ముఖ్యమైన స్థానం వహిస్తాయి. వీటిని అనేక ఇతర ప్రాంతాలలో కూడా ఆహారంగా తీసుకుంటారు. స్త్రీ, పురుష పుష్పాకాలు, పుష్ప పూర్వ భాగంలో కానీ, మధ్య భాగంలో కానీ ఫలవంతమవుతాయి.

పరాగ సంపర్కం[మార్చు]

ఒక జుక్చిని గుమ్మడి జాతి కాయ పుష్పంలో ఉన్న తేనెటీగ

కుటుంబంలోని అన్ని మొక్కలలోనూ, పుష్పాలలో పరాగ రేణువులు పురుష కణాలుగానూ, అండకోశాలు స్త్రీ కణాలుగానూ ఉంటాయి. ఈ రెండూ కూడా పుష్పంలో ఉంటాయి. గుమ్మడి జాతి మొక్కలలో ఉత్తర అమెరికా స్క్వాష్ బీ, పెపొనాప్సిస్ ప్రుయినోసా, వంటి ఇతర జాతుల వలన పరాగ సంపర్కం జరుగుతుంది. ఎరువుల వాడకం పెరగడం వలన ఈ జాతులన్నీ నాశనమయ్యాయి. ఇప్పుడు వాణిజ్య పంటలన్నిటినీ యూరోపియన్ తేనెటీగల ద్వారా పరాగ సంపర్కం జరుపుతున్నారు. అమెరికా వ్యవసాయ విభాగం వారు ఒక ఎకరాకు ఒక తేనెతెట్టెను (ఒక తేనెతెట్టెకు 4,000m2) సిఫారసు చేస్తున్నారు. ఈగల కొరత ఉండడం వలన తోటల పెంపకందార్లు చేతితో పరాగ సంపర్కం చేస్తున్నారు. భారీ గుమ్మడి కాయలను చేతితో పరాగ సంపర్కం చేసే పండిస్తున్నారు. పరాగ సంపర్కానికి ముందు, ఆ తర్వాత క్రాస్ పొలినేషన్ జరగకుండా పుష్పాలను మూసి ఉంచుతారు. తగిన విధంగా పరాగ సంపర్కం జరగని గుమ్మడి జాతి పుష్పాలు అభివృద్ధి చెందడం ఆరంభించినప్పటికీ, అవి మధ్యలోనే ఆగిపోతాయి. తోటల పెంపకందార్లు దీనికి కారణం ఫంగస్ వ్యాధులని భావిస్తారు. కానీ సరిగా పరాగ సంపర్కం కాకుండా పోవడమే దీనికి కారణం.[ఆధారం చూపాలి] అంతేకానీ ఫంగస్ వ్యాధి కాదు.

తయారీ[మార్చు]

దీన్ని పాక శాస్త్ర రీత్యా కూరగాయగా పరిగణిస్తున్నప్పటికీ, వృక్ష శాస్త్రం ప్రకారం దీన్ని ఫలంగా భావిస్తారు (ఇది గింజలకు పుష్పవృంతంగా ఉంటుంది). గుమ్మడి జాతి కాయలను తాజాగానూ (సలాడ్‌లుగా) లేదా వండి గానీ (మాంసంతో నింపిగానీ, వేపుడుగా గానీ, నిప్పు సెగ మీద వండడం గానీ) ఆహారంగా తీసుకుంటారు. వీటి చిన్న ముక్కలు ఊరగాయలకు బాగుంటాయి.

పద చరిత్ర[మార్చు]

ఆంగ్లంలో స్క్వాష్ అనే పదం, నర్రాగ్యాన్‌సెట్ బాషలోని అకుటాస్క్వాష్ (పచ్చిగానే తినదగిన ఆకుపచ్చని కాయ) అనే పదం నుండి తీసుకోబడింది. దీనిని మొదటగా నమోదు చేసిన వ్యక్తి రోజర్ విలియమ్స్. ఈయన రోడ్ ఐలాండ్ స్థాపకుడు. ఈయన ఈ పదాన్ని 1643లో ప్రచురించిన ఏ కీ ఇన్‌టూ ది లాంగ్వేజ్ ఆఫ్ అమెరికాలో ఉపయోగించాడు. ఈ పదానికి సమానర్థాన్నిచ్చే పదాలు అలోంక్విన్ బాషా కుటుంబానికి చెందిన మసాచూసెట్ వంటి భాషలో ఉన్నాయి.

కళలలో ఉపయోగాలు[మార్చు]

మోచే స్క్వాష్ సిరామిక్300 A.D. లార్కో మ్యూజియం కలెక్షన్

పూర్వ కొలంబియన్ మహాయుగం నుండి ఆండీస్ ప్రాంతంలో ఇది ముఖ్య పంటగా ఉంటూ ఉండింది. ఉత్తర పెరూలోని మోచే సంస్కృతిలో మట్టి, నీరు, నిప్పులను కలిపి పింగాణీ పాత్రలను తయారు చేసేవారు. ఈ రకమైన వాటిని పవిత్రంగా భావించేవారు. అనేక రకాల అంశాలను ప్రతిబింబించే విధంగా, వివిధ ఆకారాలలో వీటిని తయారు చేసేవారు. గుమ్మడి జాతి కాయలు మోచే పింగాణీ పరిశ్రమలో ప్రతిబింబించబడ్డాయి.[3]

సూచనలు[మార్చు]

  1. ITIS Standard Report Page: Cucurbita
  2. ఈస్టర్న్ నార్త్ అమెరికా యాస్ ఎన్ ఇండిపెండెంట్ సెంటర్ ఆఫ్ ప్లాంట్ డొమస్టికేషన్
  3. బెరిన్, కేథరీన్ & లార్కో మ్యూజియం. ది స్పిరిట్ ఆఫ్ యాన్షియంట్ పెరూ :ట్రెజర్స్ ఫ్రమ్ ది మ్యూజియో అరాక్యూలాజికో రఫేల్ లార్కో హిర్రిరా. న్యూయార్క్:థేమ్స్ అండ్ హడ్సన్, 1997.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Squashes and pumpkins