గుమ్మడి సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత విజ్ఞానశాస్త్ర జాతీయ అకాడమీ పురస్కారం చాల విలువైనది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డుకు మద్రాసు ఐఐటీ నుంచి తెలుగు యువ శాస్త్రవేత్త డాక్టర్ గుమ్మడి సత్యనారాయణ 2012 సంవత్సరానికిగానూ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 'నాసి-స్కోపస్' యువ శాస్త్రవేత్త అవార్డుకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 600 మంది పలు విభాగాల్లో అవార్డు కోసం పోటీపడితే, కేవలం ఇద్దరు తెలుగు వారి మాత్రం జాతీయ స్థాయి వైజ్ఞానిక వేదికపై మెరిశారు. ఆ ఇద్దరిలో గుమ్మడి సత్యనారాయణ ఒకరు. జీవ సంబం«ధిత శాస్త్రంలో విస్తృతమైన పరిశోధనలు చేపట్టడంతో పాటు, లోతైన పరిశోధనాన్వేషణతో కూడిన పత్ర సమర్పణలు చేసినందుకు ఆయనను ఈ పురస్కారం వరించింది. మద్రాసు ఐఐటీలో బయోటెక్నాలజీ విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు.

నేపథ్యం[మార్చు]

గుమ్మడి సత్య నారాయణ గారు తెలుగు సంతతికి చెందిన వారే. ఉపాధి రీత్యా వీరి నాన్నగారు తమిళనాడులో స్థిరపడిన కారణంగా ఇతని బాల్యమంతా తిరువళ్లూరు జిల్లాలోనే జరిగింది. నాన్నగారు ప్రభాకర నాయుడు వైద్యులు. అమ్మ జయకుమారి గృహిణి. ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నారు. ఆ తరువాత ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం కొనసాగింది. మంగళూరులోని ఎన్ఐటీ సూరత్‌కల్‌లో బీఈ కెమికల్ ఇంజనీరింగ్, అన్నా యూనివర్సిటీలో ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేశారు. 1999 సంవత్సరంలో ఐఐటీఎంలో బయోకెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ పరిశోధన పూర్తి చేశారు. దక్షిణ కొరియా టేజాన్ క్రిబ్, విస్కాన్సిస్ మాడిసన్ యూనివర్శిటీలో పోస్టు డాక్టరల్ ఫెలోషిప్ సాధించారు.. ఆ సమయంలోనే లోగో ఎంహెచ్ఆర్‌డీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఫెలోషిప్ వచ్చింది.

ఐఐటీలో అధ్యాపకుడిగా[మార్చు]

పై చదువులన్నీ పూర్తి చేసుకున్నాక, 2002లో మద్రాసు ఐఐటీలో ప్రొఫెసర్‌గా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దశాబ్దానికి పైగా ఐఐటీలోనే అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు. ఇతని పర్యవేక్షణలో ఐదుగురు విద్యార్థులు పీహెచ్‌డీ చేయడం జరిగింది. వారిలో ఒక విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులకు పీహెచ్‌డీ పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పరిశోధన పట్ల ఆసక్తి[మార్చు]

అన్నా యూనివర్శిటీలో ఎంటెక్ పూర్తి చేయగానే, వీరికి విదేశాలలో సాఫ్ట్‌వేర్ రంగంలో మంచి ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇతని స్నేహితులు పలు ఉన్నత సంస్థలో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా స్థిరపడ్డారు. కాని సత్యనారాయణ గారికి, భవిష్యత్తులో ఉత్తమ పరిశోధకుడిగా ఎదగాలన్న బలమైన కాంక్ష ఉండేది. అదే సమయంలో వీరి గురువుగారు ప్రొఫెసర్ టి.వి, సుబ్రహ్మణ్యం ఇచ్చిన ప్రోత్సాహంతో ఉద్యోగంలో స్థిరపడకుండా పరిశోధనలపై దృష్టి సారించాను.

ప్రస్తుతం చేస్తున్న పరిశోధనలు[మార్చు]

ప్రస్తుతం కెఫిన్ డిగ్రడేషన్‌పై పరిశోధనలను విస్తృతం చేస్తున్నారు. అంటే రోజూ మనం తీసుకునే కాఫీ, టీల నుంచి కెఫిన్‌ను వేరు చేయడంపై అన్నమాట. కెఫిన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మార్కెట్‌లో రసాయన పద్ధతిలో తయారైన డ్రిగ్రెడ్ కాఫీ లభ్యమవుతోంది. అది కూడా అంత మంచిది కాదు. ప్రమాదకరమైన కెఫిన్‌ను ప్రయోగ పద్ధతిలో కాఫీ నుంచి వేరు చేసి సహజ సిద్దమైన కాఫీనే అందించాలన్నది ప్రయోగ సారాంశం. అంతేకాకుండా, స్క్రాంబ్లస్ ప్రొటీన్, బయోపాలిమర్స్, ప్లిప్పేస్, ఎంజైమ్ పరిశోధనలు, బాక్టీరియా క్సైలిటాల్, బీటా గ్లూకోన్స్ వృద్ధి చేయడాలపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సంబంధిత ప్రయోగాలను విద్యార్థులతో చేయిస్తున్నారు.

వీరు సాధించిన పురస్కారాలు[మార్చు]

మెంటర్ రికగ్నైజేషన్ (యుఎస్ఏ), యంగ్ సైంటిస్ట్ (బయోటెక్నాలజీ రిసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా), బయో ఇంజనీర్ (అప్లైడ్ బయోటెక్నాలజీ సొసైటీ), యంగ్ సైంటిస్ట్ (అసోసియేషన్ ఆఫ్ మైక్రోబయోలజిస్టిక్ ఆఫ్ ఇండియా) అనే పరిశోధన సంస్థల నుంచి పురస్కారాలు

ప్రస్తుత బాధ్యతలు[మార్చు]

మైక్రోబయాలజీ, అకడెమిక్ జర్నల్స్ (యుఎస్ఏ) అగ్రికల్చర్ అండ్ బయోలాజికల్ సైన్సెస్, సెల్యులర్ పరిశోధనాపరమైన జర్నల్‌కి ఎడిటోరియల్ బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోనేరు లక్ష్మయ్య (విజయవాడ ), విజ్ఞాన్ (గుంటూరు), గీతం (వైజాగ్), కొచ్చిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కేరళ) యూనివర్శిటీలలో గెస్ట్ ఆచార్యుడిగా కొనసాగుతున్నారు. అలాగే బోర్డ్ ఆఫ్ స్టడీ సభ్యుడిగా కూడా బాధ్యతలు వహిస్తున్నారు. మూలం: ఆంధ్రజోతి దిన పత్రిక: ది. 16/9/2013