గుమ్మలంపాడు (సంతనూతలపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గుమ్మలంపాడు
రెవిన్యూ గ్రామం
గుమ్మలంపాడు is located in Andhra Pradesh
గుమ్మలంపాడు
గుమ్మలంపాడు
నిర్దేశాంకాలు: 15°30′29″N 79°54′25″E / 15.508°N 79.907°E / 15.508; 79.907Coordinates: 15°30′29″N 79°54′25″E / 15.508°N 79.907°E / 15.508; 79.907 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంసంతనూతలపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,141 హె. (2,819 ఎ.)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)525225 Edit this at Wikidata

గుమ్మళంపాడు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523 225., పిన్ కోడ్ నం. 523225., ఎస్.ట్.డి.కోడ్ = 08592.

సమీప గ్రామాలు[మార్చు]

గోనుగుంట 4.6 కి.మీ, చిలకపాడు 5.6 కి.మీ, నెన్నూరుపాడు 7.9 కి.మీ, చీమకుర్తి 8.5 కి.మీ, పులికొండ 8.8 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

సంతనూతలపాడు 4 కి.మీ, చీమకుర్తి 7.3 కి.మీ, కొండెపి 11.5 కి.మీ, ఒంగోలు 19.1 కి.మీ.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ బండారు లక్ష్మీనారాయణ సర్పంచ్‌గా ఎన్నికైనారు. [6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

గుమ్మళంపాడు గ్రామంలో కొలువైయున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి 50వ వార్షికోత్సవం, 2014,ఏప్రిల్-11, శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ప్రసన్నాంజనేయస్వామివారికి, అభిషేకాలు, అఖండ హోమాలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని తమ మ్రొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [2]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా మే నెలలో, స్వామివారి తిరునాళ్ళు వేడుకగా నిర్వహించెదరు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు స్థానికులేగాక, వివిధ గ్రామాలనుండి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, మొక్కులు తీర్చుకుంటారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయుదురు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చు విద్యుత్తు ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా ఉండును. [3]

శ్రీ యల్లమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి కొలుపులు, 2014, ఆగస్టు-23 నుండి 27 వరకు, బొడ్డపాటి, నువ్వల, నెప్పలి వంశస్థుల ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన 27వ తేదీ బుధవారం నాడు, అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు, బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [4]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో శ్రీ అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలో భాగంగా, 2015,మే నెల, 5వతేదీ వైశాఖపౌర్ణమి, సోమవారం నాడు, అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి, గ్రామంలో ఊరేగించారు. 5వ తేదీ మంఘళవారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. 6వ తేదీ బుధవారం నాడు, విగ్రహప్రతిష్ఠనిర్వహించి, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [5]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,061 - పురుషుల సంఖ్య 1,044 - స్త్రీల సంఖ్య 1,017 - గృహాల సంఖ్య 573

* 2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,551.[2] ఇందులో పురుషుల సంఖ్య 792, మహిళల సంఖ్య 759, గ్రామంలో నివాస గృ

* గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2]

[2] ఈనాడు,ప్రకాశం/సంతనూతలపాడు; 2014;ఏప్రిల్-12; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-25; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగస్టు-28; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-7; 3వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,ఆగస్టు-12; 2వపేజీ.