గురుపాదగౌడ పాటిల్
| గురుపాదగౌడ పాటిల్ | |||
ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 జనవరి 26 | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2023 మే 13 | |||
| ముందు | కలకప్ప బండి | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | రాన్ | ||
| పదవీ కాలం 2013 – 2018 | |||
| ముందు | కలకప్ప బండి | ||
| తరువాత | కలకప్ప బండి | ||
| పదవీ కాలం 1999 – 2004 | |||
| ముందు | శ్రీశైలప్ప బిదరూర్ | ||
| తరువాత | కలకప్ప బండి | ||
| పదవీ కాలం 1989 – 1994 | |||
| ముందు | జననాదేవ్ శివనాగప్ప దొడ్డమేటి | ||
| తరువాత | శ్రీశైలప్ప బిదరూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1948 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
గురుపాదగౌడ సంగనగౌడ పాటిల్ (జననం 1948) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]గురుపాదగౌడ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి ద్దొద్దమేటి జ్ఞానదేవ్ శివనాగప్పపై 11,407 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 1994 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి బిదరూర్ శ్రీశైలప్ప విరూపాక్షప్ప చేతిలో 8,604 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
గురుపాదగౌడ పాటిల్ 1999 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి బిదరూర్ శ్రీ శైలప్ప విరూపాక్షప్పపై 29,155 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2004 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కలకప్ప బండి చేతిలో 8,065 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
గురుపాదగౌడ పాటిల్ 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కలకప్ప బండి చేతిలో 1,830 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కలకప్ప బండిపై 18,227 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై.[3] 2016లో కర్ణాటక రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమితులయ్యాడు.[4]
గురుపాదగౌడ పాటిల్ 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో రాన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కలకప్ప బండి చేతిలో 7334 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కలకప్ప బండిపై 24,688 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై,[5] 2024 జనవరి 26న ఖనిజాభివృద్ధి సంస్థకు ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-03.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-03.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-09.
- ↑ "21 MLAs to head boards, corporations" (in Indian English). The Hindu. 2 November 2016. the original నుండి 23 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2025.
- ↑ "Karnataka Assembly Elections 2023: Ron". Election Commission of India. 13 May 2023. the original నుండి 23 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2025.
- ↑ "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. the original నుండి 20 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2025.