గురుపాదప్ప నాగమారపల్లి
| గురుపాదప్ప నాగమారపల్లి | |||
కర్ణాటక నిఘా విభాగాన్ని మినహాయించి హోం శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 1989 ఏప్రిల్ 15 – 1989 ఏప్రిల్ 21 | |||
అటవీ & జీవావరణ శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 1996 – 1999 | |||
| పదవీ కాలం 2013 – 2015 నవంబర్ 17 | |||
| ముందు | రహీమ్ ఖాన్ | ||
|---|---|---|---|
| తరువాత | రహీమ్ ఖాన్ | ||
| నియోజకవర్గం | బీదర్ | ||
| పదవీ కాలం 2008 – 2009 | |||
| ముందు | బందెప్ప కాశెంపూర్ | ||
| తరువాత | రహీమ్ ఖాన్ | ||
| నియోజకవర్గం | బీదర్ | ||
| పదవీ కాలం 2004 – 2008 | |||
| ముందు | గుండప్ప బిరాదార్ (వకీల్) | ||
| తరువాత | ప్రభు చౌహన్ | ||
| నియోజకవర్గం | ఔరాద్ | ||
| పదవీ కాలం 1985 – 1999 | |||
| ముందు | మాణిక్ రావ్ పాటిల్ | ||
| తరువాత | గుండప్ప బిరాదార్ (వకీల్) | ||
| నియోజకవర్గం | ఔరాద్ | ||
అటవీ & జీవావరణ శాఖ మంత్రి | |||
| పదవీ కాలం 2005 – 2006 | |||
| ముందు | కె.ఎన్. గడ్డి | ||
| తరువాత | సి. చెన్నిగప్ప | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1942 నవంబరు 11 నాగమారపల్లి | ||
| మరణం | 2015 నవంబరు 17 (వయసు: 74) బెంగళూరు | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | *కర్ణాటక జనతా పక్ష | ||
| జీవిత భాగస్వామి | సరస్వతి | ||
| సంతానం |
| ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
డాక్టర్ గురుపాదప్ప సంగనబసప్ప నాగమారపల్లి (11 నవంబర్ 1942 - 17 నవంబర్ 2015) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు ఔరాద్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు, బీదర్ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఎస్.ఆర్. బొమ్మై, జె.హెచ్. పటేల్, ఎన్. ధరమ్ సింగ్ మంత్రివర్గాలలో మంత్రిగా పని చేశాడు.[1]
గురుపాదప్ప నాగమారపల్లి గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.
రాజకీయ జీవితం
[మార్చు]గురుపాదప్ప, నాగమారపల్లి గ్రామం గ్రామ సంఘం కార్యదర్శిగా తన కెరీర్‌ను ప్రారంభించి 1985లో ఔరాద్ నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభకు ఎన్నికై ఆ తరువాత వరుసగా 1989, 1994లో ఎన్నికలలో గెలిచి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఆయన 2013లో మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప స్థాపించిన కర్ణాటక జనతా పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
గురుపాదప్ప నాగమారపల్లి 1989 ఏప్రిల్ 15 నుండి 1989 ఏప్రిల్ 21 వరకు కర్ణాటక హోంమంత్రిగా, 1996 నుండి 1999 వరకు & 2005 నుండి 2006 వరకు కర్ణాటక అటవీ & జీవావరణ శాస్త్ర మంత్రిగా పని చేశాడు.
మరణం
[మార్చు]గురుపాదప్ప నాగమారపల్లి 74 సంవత్సరాల వయసులో 2015 నవంబరు 17న బెంగళూరులోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "The meteoric rise of Gurupadappa Nagamarapalli" (in Indian English). The Hindu. 17 November 2015. the original నుండి 20 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2025.
- ↑ "BJP MLA Gurupadappa Nagamarapalli Passes Away" (in ఇంగ్లీష్). The New Indian Express. 18 November 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2025.
- ↑ "Gurupadappa Nagamarapalli dead" (in Indian English). The Hindu. 17 November 2015. the original నుండి 20 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2025.
- ↑ "Karnataka: Veteran cooperative leader Nagamarapalli passes away | Karnataka: Veteran cooperative leader Nagamarapalli passes away" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 18 November 2015. the original నుండి 20 April 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2025.