Jump to content

గురువాయూరు ఏకాదశి

వికీపీడియా నుండి
గురువాయూర్ ఆలయ ప్రవేశద్వారం

గురువాయూర్ ఏకాదశి గురువాయూరులో జరిగే పండగ. ఇది దక్షిణాది రాష్ట్రాలలో ముఖ్యమైన హిందువుల పండుగ.

వృశ్చిక ఏకాదశి

[మార్చు]

ఇది వృశ్చిక మాసంలో 11వ రోజు వృశ్చిక ఏకాదశి అంటారు. 'వృశ్చిక' అంటే భారతీయ సౌర పంచాంగంలో ఒక నెల.[1][2] ఇది వృశ్చిక రాశి చక్రానికి అనుగుణంగా ఉంటుంది. గ్రెగోరియన్ పంచాంగం ప్రకారం నవంబరు మధ్య నుండి దాదాపుగా డిసెంబరు మొదటి సగంవరకు ఉంటుంది.[1] నవమి (9వ), దశమి (10వ) రోజులు కూడా ఈ పండుగకు ముఖ్యమైనవి.

విలక్కు ఏకాదశి ఒక నెల ముందు వ్యక్తులు, కుటుంబాలు, సంస్థల పూజలతో ప్రారంభమవుతుంది. నవమి రోజున, కోలాడి కుటుంబం విలక్కును నెయ్యితో వెలిగిస్తారు. గతంలో జామోరిన్ రాజు సమర్పించిన దశమి విలక్కును ఇప్పుడు గురువాయురప్పన్ సంకీర్తన ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఆ రోజున ఉదయం 3 గంటలకు ప్రశాంత దర్శన కోసం ఈ ఆలయం తెరుస్తారు. ఇది ద్వాదశి 12వ రోజున ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. తద్వారా దశమి, ఏకాదశి రోజులలో భక్తులకు నిరంతర దర్శనం లభిస్తుంది. ద్వాదశి 12వ రోజున కుటుంబ సంక్షేమం కోసం కూతంబళంలో చిన్న మొత్తాలు సమర్పిస్తారు. వీటిని ద్వాదశి పానం అని పిలుస్తారు.[3]

వృశ్చిక శుక్లపక్షంలో దేవాలయ ప్రతిష్ఠాపన జరిగింది. ఆ రోజుని దేవాలయ ప్రతిష్ఠాపన దినంగా జరుపుకుంటారు. ఆ రోజు కృష్ణుడు అర్జనుడికి గీతోపదేశం చేసిన పవిత్రమైన రోజు కూడా, కాబట్టి ఈరోజుని గీతోపదేశదినంగా పరిగణిస్తారు. గీతాజయంతి అనికూడా అంటారు. ఈ రోజులలో ఉపవాస దీక్షలో ఉండి కృష్ణభగవానుని దర్శనార్ధం ఆలయానికి వెళతారు.[4]

గురువాయూరు ఏకాదశి

[మార్చు]

వృశ్చిక ఏకాదశినే గురువాయూరు ఏకాదశి అని గురువాయూరు, త్రిసూర్, కేరళ లో పిలుస్తారు. ఉత్తర భారత దేశంలో దీనినే మోక్షద ఏకాదశి అని అంటారు. మార్గశీర్ష మాసం అంటే సంవత్సరంలో 9వ నెల. మార్గశీర్ష మాసం శుక్లపక్షం 11వ రోజున గురువాయూరు ఏకాదశి జరుపుకుంటారు. గురువాయూరు దేవాలయంలో శ్రీ కృష్ణుని పూజిస్తారు. ఈ రోజున చాలా ఏనుగులు ఊరేగింపులో పాల్గొంటాయి.[4]

పూజ, ఉపవాస విశేషాలు

[మార్చు]
  1. భక్తులు పదకొండవ రోజు (ఏకాదశి) ఉపవాసం ఉండి, ద్వాదశి తిథి నాడు పన్నెండవ రోజు విడుస్తారు. ద్వాదశి రోజు ఉదయమే తులసి ఆకులు, పువ్వులతో కూడిన తీర్థాన్ని సేవించి ఉపవాసం వదులుతారు. [5]
  2. ఈ ఏకాదశి రోజున తృణధాన్యాలు, బియ్యం, ఉప్పు తినడం వంటివి నిషేధం.
  3. పూజించడానికి, ఆశీర్వాదం పొందడానికి, ప్రజలు శ్రీకృష్ణుని ఆలయాన్ని సందర్శిస్తారు.
  4. కేరళలో, శ్రీకృష్ణుడికి చందనం, తులసి పత్రాన్ని సమర్పించడం వంటివి ముఖ్యచారాలు.
  5. శ్రీకృష్ణుడికి అరటిపండు లేదా పాలపాయసం సమర్పిస్తారు.
  6. భక్తులు "ఓం నమో భగవతే వాసుదేవయే" అని 108 సార్లు పఠిస్తారు.
  7. ఈ పవిత్రమైన రోజున భగవద్గీతను పఠిస్తారు.
  8. భక్తులు ఆవులకు ఆహారం సమర్పిస్తారు.
  9. తులసి మొక్కలు నాటడం, వాటికి నీరు పెట్టడం, వాటి పక్కన దీపం వెలిగించడం వంటి పనులు చేస్తారు.[4]
  10. విష్ణువు ఆరాధనలో ఏకాదశి ఉపవాసం ఒక పవిత్రమైన ఆచారంగా పరిగణిస్తారు. దీనిని ఆధ్యాత్మిక శుద్ధి, పాప విముక్తి కోసంఈ సంప్రదాయం పాటిస్తారు. దశమి రోజున ఒక పుట భోజనం చేసి, ఏకాదశి రోజున పూర్తిగా నిరాహారంగా ఉంటారు. ఉండలేని వాళ్ళు పళ్ళు, అన్నం బదులు గోధుమ పదార్ధాలు తీసుకుంటారు. పగలు నిద్ర పోకుండా విష్ణు ఆలయాలకు వెళ్లడం, భజనలు, కీర్తనలు, భాగవతము, విష్ణు సహస్రనామం, భగవద్గీత, నారాయణీయం మొదలగు కార్యక్రమాలతో సమయం గడపడం మంచిదని భావిస్తారు.[5]

ఉత్సవాలు

[మార్చు]

ఏకాదశి రోజున గజరాజన్ గురువాయూర్ కేశవన్ అనే ఏనుగు మరణించింది అని నమ్ముతారు. ఆ జ్ఞాపకార్ధం గురువాయూరు దేవాలయంలో ఏనుగు కుటుంబానికి చెందిన కర్ణవర్ లేదా అధిపతి అక్కడ కేశవ విగ్రహానికి పుష్పహారం ఉంచుతుంది. ఇతర ఏనుగులు చుట్టూ నిలబడి నమస్కరిస్తాయి.[4]

ఏకాదశి రోజున, ఉదయాస్థమాన పూజ (తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు) కేరళ రాష్ట్రంలో దేవస్వోమ్ సంస్థ నిర్వహిస్తుంది. ఉదయం సీవేలీ తరువాత, ఏకాదశి రోజున పార్థసారథి ఆలయానికి ఏనుగుల ఊరేగింపు జరుగుతుంది.[6]సాయంత్రం దీపారాధన తరువాత రధోత్సవం ఊరేగింపు పార్ధసారధి ఆలయం నుండి గురువయ్యురు దేవాలయం వరకు వెళుతుంది. ఉదయం 9 నుండి సాయంత్రం 5గం వరకు దర్శనం ఏర్పాటు ఉంటుంది.[5] ఏకాదశి రోజున రాత్రి పూజ తర్వాత ఏనుగుల ఊరేగింపుతో ప్రసిద్ధ విలక్కు ఏకాదశి పూర్తవుతుంది. దీనితో పండుగ ముగింపు జరుగుతుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 James G. Lochtefeld (2002). The Illustrated Encyclopedia of Hinduism: A-M, N-Z (Vol 1 & 2). The Rosen Publishing Group. p. 355. ISBN 978-0-8239-3179-8.
  2. Robert Sewell; Śaṅkara Bālakr̥shṇa Dīkshita (1896). The Indian Calendar. S. Sonnenschein & Company. pp. 5–11, 23–29.
  3. "www.guruvayurdevaswom.org - EKADASI FESTIVAL". www.guruvayurdevaswom.nic.in. Retrieved 13 September 2017.
  4. 4.0 4.1 4.2 4.3 Mahima, Sharma (2025-12-01). "Guruvayur Ekadashi 2025: Date, Parana Time, Puja Rituals and Significance". The Times of India. Retrieved 2025-12-06.
  5. 5.0 5.1 5.2 "Guruvayur Ekadashi 2025: Unveiling the sacred significance and observances in Kerala". మాతృభూమి ఆంగ్ల దినపత్రిక. 2025-12-07. Retrieved 2025-12-06.
  6. 6.0 6.1 "[www.guruvayurdevaswom.org] - EKADASI FESTIVAL". www.guruvayurdevaswom.nic.in. Retrieved 13 September 2017.