గులాం అహ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గులాం అహ్మద్
Ghulam Ahmed.jpg
గులాం అహ్మద్ (1952)
వ్యక్తిగత సమాచారం
జననం (1922-07-04)1922 జూలై 4
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
మరణం 28 October 1998(1998-10-28) (aged 76)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగ్ శైలి కుడిచేతివాటం
బౌలింగ్ శైలి ఆఫ్ స్పిన్
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు భారతదేశం
టెస్టు అరంగ్రేటం 31 డిసెంబరు 1948 v వెస్టిండీస్
చివరి టెస్టు 31 డిసెంబరు 1958 v వెస్టిండీస్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్
మ్యాచులు 22 98
చేసిన పరుగులు 192 1,379
బ్యాటింగ్ సరాసరి 8.72 14.36
100s/50s 0/1 0/5
అత్యధిక స్కోరు 50 90
బౌలింగ్ చేసిన బంతులు 5,650 24,263
వికెట్లు 68 407
బౌలింగ్ సరాసరి 30.17 22.57
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 4 32
మ్యాచ్ లో 10 వికెట్లు 1 9
ఉత్తమ బౌలింగ్ 7/49 9/53
క్యాచులు/స్టంపులు 11/– 57/–
Source: క్రిక్ ఇన్ఫో, 23 నవంబరు 2020

గులాం అహ్మద్ (4 జూలై 1922 - 28 అక్టోబర్ 1998) హైదరాబాదుకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆఫ్ స్పిన్ బౌలరైన అహ్మద్, టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పదవీ విరమణ తరువాత చాలా సంవత్సరాలు బిసిసిఐ కార్యదర్శిగా పనిచేశాడు.[1]

జననం[మార్చు]

అహ్మద్ 1922, జూలై 4న తెలంగాణలోని హైదరాబాదులో జన్మించాడు.

క్రీడారంగం[మార్చు]

1939-40 నుండి 1958-59 వరకు హైదరాబాదు జట్టు తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్, 1948-49 నుండి 1958-59 వరకు భారతదేశం తరపున 22 టెస్టులు ఆడాడు. 1952లో ఇంగ్లాండ్, 1954-55లో పాకిస్తాన్ దేశాలలో మ్యాచ్ లు ఆడాడు. 1955-56లో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక టెస్టులో, 1958-59లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ రెండూ మ్యాచ్ లో భారత్ ఓడిపోయంది.

1952 పర్యటనలో ముఖ్య బౌలర్‌గా నిలిచాడు, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 21.92 యావరేజ్ తో 80 వికెట్లు, నాలుగు టెస్టుల్లో 24.73 యావరేజ్ తో 15 వికెట్లు తీశాడు.[2] తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లు బౌలింగ్ చేసి 100 పరుగులకు వికెట్లు తీశాడు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో జరిగిన మ్యాచ్ లో 84 పరుగులకు 8 వికెట్లు, 66 పరుగులకు 5 వికెట్లు తీశాడు.

1952-53లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్లు పడగొట్టి, 11వ స్థానంలో 50 పరుగులు చేశాడు, హేము అధికారితో కలిసి పదవ వికెట్‌కు 109 పరుగులు చేశాడు.[3]

1956-57లో కలకత్తాలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టెస్టులో అతను 49 పరుగులకు 7 వికెట్లు, 81 పరుగులకు 3 వికెట్లు తీశాడు.[4]

మద్రాస్ జరిగిన రంజీ ట్రోఫీ 1947-48లో 28 పరుగులకు 5 వికెట్లు, 53 పరుగులకు 9 వికెట్లు తీసుకున్నాడు. 1950-51లో హైదరాబాద్‌పై హోల్కర్ 757 పరుగులు చేసినప్పుడు అహ్మద్ బౌలింగ్ గణాంకాలు 92.3-21-245-4 గా ఉన్నాయి.

1967-68లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత జట్టును నాయకత్వం వహించాడు.[5]

అహ్మద్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆసిఫ్ ఇక్బాల్ కు, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కు మామ అవుతాడు.[6][7]

మరణం[మార్చు]

1998, అక్టోబరు 28న హైదరాబాదులో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. Wisden 1999, p. 1478.
  2. Wisden 1953, p. 215.
  3. India v Pakistan, Delhi 1952-53
  4. India v Australia, Calcutta 1956-57
  5. Wisden 1969, p. 838.
  6. Sania and the great cricket connection
  7. "Has anyone had a longer Test career than Sachin Tendulkar's 24 years?". ESPN Cricinfo. Retrieved 21 July 2021.