Jump to content

గులాం మహమ్మద్ సాదిక్

వికీపీడియా నుండి
గులాం మహమ్మద్ సాదిక్
1వ జమ్మూ కాశ్మీరు ముఖ్యమంత్రి
In office
1965 మార్చి 30 – 1971 డిసెంబరు 12
అంతకు ముందు వారు(పదవి సృష్టించబడింది)
తరువాత వారుసయ్యద్ మీర్ ఖాసిం
4వ జమ్మూ కాశ్మీరు ప్రధాన మంత్రి
In office
1964 ఫిబ్రవరి 29 – 1965 మార్చి 30
అధ్యక్షుడుకరణ్ సింగ్
అంతకు ముందు వారుఖ్వాజా షంసుద్దీన్
తరువాత వారు(పదవి రద్దు చేయబడింది)
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీజమ్మూ కాశ్మీరు నేషనల్ కాన్ఫరెన్స్
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్
చదువుఇస్లామియా కాలేజ్, లాహోర్; అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం

గులాం మహమ్మద్ సాదిక్ (1912 –1971 డిసెంబరు 12) భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 1964 నుండి 1965 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రధానమంత్రిగా పనిచేశారు. 1965లో రాజ్యాంగ సవరణ అనంతరం ఆ పదవిని ముఖ్యమంత్రి అని మార్చగా, ఆయన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కొనసాగి 1971లో మరణించే వరకు పదవిలో ఉన్నారు.[1]

విద్య రాజకీయ జీవితం

[మార్చు]

సాదిక్ లాహోర్‌లోని ఇస్లామియా కాలేజ్, లాహోర్లో పట్టభద్రుడయ్యారు. అనంతరం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు.[2]

1947 నుండి 1953 వరకు షేక్ అబ్దుల్లా మంత్రివర్గంలో సభ్యుడిగా పనిచేశారు.[3]

1957 నుండి 1961 వరకు జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి నాయకత్వం వహించారు. తరువాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. 1964లో ఆయన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

1965లో జమ్మూ & కాశ్మీర్ రాజ్యాంగం (ఆరవ సవరణ చట్టం, 1965) ద్వారా ప్రధానమంత్రి పదవిని ముఖ్యమంత్రి అని మార్చగా, సాదిక్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.[4]

మరణం

[మార్చు]

గులాం మహమ్మద్ సాదిక్ 12 డిసెంబర్ 1971న హృదయాఘాతంతో పదవిలో ఉన్నప్పుడే మరణించారు.[5]

మూలాలు

[మార్చు]
  1. Gauhar, G. N. (1997), Abdul Ahad Azad, Sahitya Akademi, pp. 60–, ISBN 978-81-260-0322-8
  2. "Ghulam Mohammed Sadiq, 59, Kashmir Chief Minister, Dies". New York Times. 13 December 1971.
  3. "My faith in India still strong: Kin of last J&K PM". The Telegraph. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-12-16.
  4. "Explained: When Jammu & Kashmir had its own Prime Minister and Sadr-e-Riyasat". The Indian Express. 2019-04-15. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-12-16.
  5. "Third JK CM to die in harness". Tribune India. Tribune News Service. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-12-16.

గ్రంథసూచి

[మార్చు]