Jump to content

గువ్వల బాలరాజు

వికీపీడియా నుండి
గువ్వల బాలరాజు
గువ్వల బాలరాజు


పదవీ కాలం
2014 – 2023 డిసెంబర్ 3
ముందు పి.రాములు
తరువాత చిక్కుడు వంశీకృష్ణ
నియోజకవర్గం అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 30, 1981
వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2025 ఆగష్టు 8 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాములు, బక్కమ్మ
జీవిత భాగస్వామి జి. అమల
సంతానం ఇద్దరు కుమారులు

గువ్వల బాలరాజు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున 2014 నుండి 2023 వరకు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసి 2025 ఆగస్టు 2న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.

జననం, విద్య

[మార్చు]

బాలరాజు 1981, జూన్ 10న రాములు, బక్కమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లాలోని, వనపర్తి గ్రామంలో జన్మించాడు. వనపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, ఖైరతాబాద్‌లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్, హైదరాబాదు పిఆర్ఆర్ లా కాలేజీ నుండి ఎల్ఎల్ఎం చదివాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గువ్వల బాలరాజుకు అమలతో వివాహం జరిగింది.[1][2] వారికి ఇద్దరు కుమారులు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తో గువ్వల బాలరాజు

వృత్తి

[మార్చు]

తన తండ్రితో కలిసి పార్ట్‌టైమ్ పనిచేశాడు. తరువాత కార్మికుడిగా, చిన్న నిర్మాణ కాంట్రాక్టర్ మారి ప్రస్తుతం హైదరాబాద్‌లో జిబిఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీని నడుపుతున్నాడు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

గువ్వల బాలరాజు 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో తెరాస తరపున నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటి చేసి మంద జగన్నాథ్ చేతిలో ఓడిపోయాడు. తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై 11,820 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3][4] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ పై 9,441 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6] గువ్వల బాలరాజు 2022 జనవరి 26న నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[7] ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుండి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా[8] పోటీ చేసి ఓడిపోయాడు.

గువ్వల బాలరాజు 2025 ఆగస్టు 2న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.[9][10] ఆయన ఆగష్టు 10న హైదరాబాద్ నాంపల్లిలోని  బీజేపీ రాష్ట్ర కార్యాలయం జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. Ashok, B. (24 February 2017). "Dindi water release stirs up row". www.thehansindia.com.
  2. Daisy, Angelina. "Guvvala Balaraju, A young and dynamic political leader, is swift in resolving people's issues, remembers everyone by their name". Soshal. Archived from the original on 25 July 2020. Retrieved 15 February 2021.
  3. Eenadu (13 November 2023). "తొలి ప్రయత్నం.. వరించిన విజయం". EENADU. Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  4. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. "Guvvala Balaraju(TRS):Constituency- ACHAMPET (SC)(NAGARKURNOOL) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-05.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-01. Retrieved 2019-06-17.
  7. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  8. Namasthe Telangana (22 August 2023). "సమరానికి సై". Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  9. "భారత రాష్ట్ర సమితికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా". Eenadu. 4 August 2025. Archived from the original on 5 August 2025. Retrieved 5 August 2025.
  10. "బీఆర్‌ఎస‌‌కు గువ్వల గుడ్‌బై". Andhrajyothy. 5 August 2025. Archived from the original on 5 August 2025. Retrieved 5 August 2025.
  11. "భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు". Eenadu. 10 August 2025. Archived from the original on 10 August 2025. Retrieved 10 August 2025.