గుహుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాములవారిని నది దాటిస్తున్న గుహుడు

రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు. శ్రీరాముని భక్తుడు.[1] అరణ్యవాసమునకు పోవుచున్న సీతారామ లక్ష్మణులను గంగా నదిని దాటించాడు. శ్రీరాముని చూచుటకు వచ్చుచుండగా ఇతడు అడ్డగించెను. రాముని చూచుటకై పోవుచున్నానని చెప్పిన పిదపనే గంగానదిని దాటి పోనిచ్చెను.

గుహుడి కోసం శ్రీరాముడు సతీ సమేతంగా గంగానది ఒడ్డున చాలాసేపు ఎదురు చూడవలసి వచ్చింది. వృత్తి రీత్యా వేటగాడైన గుహుడు సరయు నది పరిసర ప్రాంతాల అటవీ ప్రాంతానికి రాజుగా ఉండేవాడు. రాముడు, గుహుడి మధ్యగల పరస్పర ప్రేమానురాగాలు లక్ష్మణున్నే ఆశ్చర్యపరచాయని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. గుహుడికి ఇక్ష్వాకు వంశస్థులంటే ఎనలేని ప్రేమ. రాముడు ఆ వంశానికి ప్రతినిథి. గుహుడు కూడా సామాన్యుడేం కాదు. నిషాధ తెగకే రాజు. అధికారం, పరపతి, ప్రతిష్ఠ కలవాడే. కానీ రాముడు తన రాజ్యంలోకి అడుగు పెట్టాడని తెలియగానే గుహుడి ఆనందానికి అవధులు లేక పోయింది. సంతోషంతో గంతులు వేస్తూ రాముని స్వాగతించడానికి వెళ్ళాడు. రామ లక్ష్మణులిద్దరూ తనకు అభివాదం చెయ్యడానికి లేవగానే గుహుడు మౌనంగా అయిపోయి మాట్లాడటానికి కూడా తటపటాయించాడు.

గుహుడి ఆందోళనను గమనించిన రాముడు అతన్ని సందిట చేర్చుకుని తనివితీరా గుండెలకు హత్తుకున్నాడు. లక్ష్మణుడికి తన మిత్రుడిగా, నిషాధ రాజ్యానికి రాజుగా పరిచయం చేశాడే తప్ప ఒక వేటగాడు అని పరిచయం చెయ్యలేదు.

మూలాలు[మార్చు]


  1. Das, Keshav (1988). Ramayana at a glance. Motilal Banararsidass Publications. p. 75.
"https://te.wikipedia.org/w/index.php?title=గుహుడు&oldid=3709213" నుండి వెలికితీశారు