గూగీ వా థియాంగో
స్వరూపం
గూగీ వా థియాంగో (1938 జనవరి 5 – 2025 మే 28) కెన్యా రచయిత, ప్రపంచ మార్క్సిస్టు సాహితీవేత్త. ఆయన తన మాతృభాష గికుయులో సాహిత్య సృజన చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచి తమ దేశంలో ప్రజాస్వామ్యం కోసం నినదించాడు.[1]
గూగీ వా థియాంగో రచించిన ‘ది అప్‌రైట్ రెవల్యూషన్’ కథానిక 100 భాషల్లోకి అనువాదమైంది. ఆయన రచించిన 'డెవిల్ ఆన్ ద క్రాస్' పుస్తకం తెలుగులో 'మట్టికాళ్ల మహారాక్షసి' పేరుతో , ఆ తర్వాత 'మాటిగరి', 'బందీ' పుస్తకాలు తెలుగులో అనువాదమైనవి.[2]
మరణం
[మార్చు]గూగీ వా థియాంగో కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అమెరికాలోని బ్యూఫోర్ట్ నగరంలో 2025 మే 28న మరణించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "తెలుగు పాఠకులకు సుపరిచితుడైన ఆఫ్రికా సాహితీ దిగ్గజం గూగీ వా థియాంగో మృతి.. జైలులో ఉన్నప్పుడు టాయిలెట్‌లోని టిష్యూ పేపర్‌పై నవల రాసిన రచయిత". BBC News తెలుగు. 29 May 2025. Archived from the original on 10 August 2025. Retrieved 10 August 2025.
- ↑ "జీవితాలను ప్రభావితం చేశాను అనిపించుకోవడమే నోబెల్‌కన్నా గొప్ప పురస్కారం!". BBC News తెలుగు. 22 February 2018. Archived from the original on 10 August 2025. Retrieved 10 August 2025.
- ↑ "సాహితీ దిగ్గజం గూగీ వా థియాంగో కన్నుమూత". Andhrajyothy. 30 May 2025. Archived from the original on 10 August 2025. Retrieved 10 August 2025.