గూగుల్ ప్రకటన పదాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
AdWords
Adwords logo.png
Developer(s) Google Inc.
Initial release అక్టోబరు 23, 2000 (2000-10-23)[1]
Operating system Cross-platform (web-based application)
Type Online advertising
Website www.google.com/adwords

గూగుల్ ప్రకటన పదాలు (ఆంగ్లం: Google Adwords) అనేది గూగుల్ యొక్క ప్రధాన ప్రకటన ఉత్పాదన మరియు సంస్థ ఆదాయానికి ముఖ్యమైన మూలము. 2010లో గూగుల్ కు ప్రకటన ద్వారా లభించిన మొత్తం ఆదాయము USD$28 బిలియను.[2] వాచక, బ్యానర్ మరియు రిచ్-మీడియా ప్రకటనలకు పే-పర్-క్లిక్ (పిపిసి) ప్రకటనలు, కాస్ట్-పెర్-థౌజండ్ (సిపిఎం) ప్రకటనలను మరియు సైట్-టార్గెటెడ్ ప్రకటనలను ప్రకటన పదాలు అందిస్తుంది. ప్రకటన పదాలు కార్యక్రమం స్థానిక, దేశీయ మరియు అంతర్జాతీయ పంపిణీ వ్యవస్థను కలిగి ఉంది. గూగుల్ యొక్క వాచక ప్రకటనలు క్లుప్తంగా ఉంటాయి - ఒక్క శీర్షిక మరియు రెండు అదనపు వాచక శ్రేణులు ఉంటాయి. చిత్ర ప్రకటనలు పలువిధాల ఇంటరాక్టివ్ అడ్వేర్టైజింగ్ బ్యూరో (ఐఏబి) ప్రామాణిక పరిమాణములో ఒకటై ఉండవచ్చు.

గూగుల్ వారి ప్రకటన పదాలు విభాగాము యొక్క అమ్మకాలు మరియు సహాయక కార్యక్రమాలు కాలిఫోర్నియా లోని మౌంటైన్ వ్యూలో జరుగుతుండగా, ప్రధాన ద్వితీయ శ్రేణి కార్యాలయాలు యాన్ ఆర్బర్, మిచిగన్, [3]లో ఉన్నాయి. ఇది సంస్థ యొక్క మూడవ అతిపెద్ద యుఎస్ సదుపాయము. ఈ కార్యాలయాలు కాలిఫోర్నియా లోని మౌంటైన్ వియూలో ఉన్న ప్రధాన కార్యాలయాలు మరియు న్యూ యార్క్ నగర కార్యాలయం వెనుక ఉన్నాయి.[4] ప్రకటన పదాల యొక్క ఇంజనీరింగ్ కాలిఫోర్నియాలోని మౌంటైన్ వియూలో జరుగుతాయి.

పే-పర్-క్లిక్ ప్రకటనలు (పిపిసి)[మార్చు]

ప్రకటనకర్తలు తమ ప్రకటనలను ట్రిగ్గర్ చేసే పదాలను ఎన్నుకుంటారు అవి ప్రతి క్లిక్ కు ఇచ్చే గరిష్ఠ నగదును పెంచుతుంది. ఒకరు గూగుల్ లో శోధన చేసినప్పుడు, ఆ పదాలకు సంబంధించిన ప్రకటనలు (వీటిని క్రియేటివ్ లని కూడా గూగుల్ సూచిస్తుంది) తెరకు కుడి వైపున మరియు కొన్ని సార్లు ముఖ్య శోధనా ఫలితాలకు పైన "ప్రాయోజితుల లింకులుగా" చూపించబడతాయి. ప్రకటనలకు క్లిక్‌త్రూ రేట్ (సిటిఆర్), మొదటి ప్రకటనకు సుమారు 8% గాను రెండవ ప్రకటనకు 5% గాను మూడవ దానికి 2.5% గాను ఉంటుంది. శోధనా ఫలితాలు 0 నుంచి 12 వరకు ప్రకటనలను చూపించవచ్చు.[5]

రుసుం చెల్లించబడిన లిస్టింగులు ఇతర ప్రకటనకర్తల బిడ్ల పైన (పిపిసి) మరియు ఒక శోధనకు చూపించబడే అన్ని ప్రకటనల "నాణ్యత స్కోరు" పైన ఆధారపడి ఉంటాయి. చారిత్రాత్మక క్లిక్-త్రూ రేట్లు, ఒక ప్రకటనకర్త యొక్క ప్రకటన వాచకము మరియు కీలక పదాల యొక్క ఔచిత్యము, ప్రకటనకర్త యొక్క ఖాతా చరిత్రము మరియు గూగుల్ నిర్ణయించే ఇతర సంబంధిత అంశాలను బట్టి నాణ్యత స్కోరు లెక్కించబడుతుంది. ఒక ప్రకటనకర్త యొక్క కీలక పదాలకు కనీస బిడ్లను నిర్ణయించడానికి కూడా గూగుల్ ఈ నాణ్యత స్కోరును వాడుతుంది.[6] ల్యాండింగ్ పేజీల నాణ్యత, వాటి కంటెంట్ యొక్క ఔచిత్యము మరియు సహజత్వము, నావిగబిలిటి, వ్యాపారము యొక్క పారదర్శకత వంటి అంశాలను బట్టి కనీస బిడ్ ఉంటుంది.[7] సైట్ లకు పూర్తి మార్గదర్శకాల జాబితాను గూగుల్ విడుదల చేసినప్పటికీ, [8] ఔచిత్యానికి కచ్చితమైన సూత్రము మరియు అర్ధం కొంత వరకు గూగుల్ కు మాత్రమే తెలిసిన రహస్యం. వీటిని లెక్కించడానికి పరిగణములో తీసుకొనే అంశాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండవచ్చు.

ప్రకటనల క్రమాన్ని నిర్ణయించే వేలం ప్రక్రియ ఒక సాధారణమైన రెండవ-ధర వేలం.[9][10] ఈ వేలములో పాల్గొనేవారు వేలం సమయంలో వారి వ్యక్తిగత సమాచారం కొరకు అడిగినప్పుడు దానిని నిజాయతీగా వెల్లడిస్తే సఫలీక్రుతమవుతారని లేదని చెప్పబడుతుంది. (అనగా వారికి కీలక పదం యొక్క విలువ, ఒక "నిజాయతీ కలిగిన" బిడ్ రూపములో)

ప్రకటన పదాలు యొక్క అంశాలు[మార్చు]

ఐపి చిరునామా మినహాయింపు
ప్రదేశము మరియు భాషలను గురి పెట్టే మార్గాలే కాకుండా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపి) చిరునామా మినహాయింపు ద్వారా ప్రకటన టార్గెటింగ్ ను మరింత మెరుగు పరచవచ్చు. దీని ద్వారా, ప్రకటనకర్తలు వాళ్ళ ప్రకటనలు ఏ ఐపి చిరునామాలలో కనిపించవలసిన అవసరము లేదో, ఆ ఐపి చిరునామాలను నిర్దేశించవచ్చు.
ఒక్కొక్క ప్రచారానికి 20 ఐపి చిరునామాలు లేదా చిరునామా శ్రేణుల వరకు మినహాయించవచ్చు. నిర్దేశించిన ఐపి చిరునామాలలో ఉన్న వారికి ఆ ప్రచారం లోని ప్రకటనలు చూపించబడవు.
గురి పెట్టే వారి సంఖ్యను తగ్గించడానికి ప్రకటనకర్తలకు మరొక మార్గం, ప్రదేశము-ఆధారిత మినహాయింపు.[11]
ఫ్రీక్వన్సీ క్యాపింగ్
గూగుల్ కంటెంట్ నెట్వర్క్ లో ఒకే వినియోగదారునికి ప్రకటనలు ఎన్ని సార్లు చూపించబడుతాయో ఆ సంఖ్యను ఫ్రీక్వన్సి క్యాపింగ్ ద్వారా నియంత్రించవచ్చు. అయితే ఇది శోధనా నెట్వర్క్ కు వర్తించదు. ఒక ప్రచారానికి ఫ్రీక్వన్సి క్యాపింగ్ ను వర్తింపచేస్తే, ఒక వ్యక్తికి రోజుకు, వారానికి లేదా నెలకు ఎన్ని సార్లు ప్రకటనలను చూపించే పరిమితిని నిర్దేశించాలి. ఈ పరిమితిని ప్రతి ప్రకటన కు గాని, ఒక ప్రకటన సమూహానికి గాని లేదా ఒక ప్రచారానికి గాని వర్తింపచేయవచ్చు.[12]

ప్లేస్మెంట్ ను గురి పెట్టే ప్రకటనలు (గతములో సైట్ ను గురిపెట్టే ప్రకటనలు అని పిలవబడింది)[మార్చు]

2003లో సైట్ ను గురిపెట్టే ప్రకటన విధానాన్ని గూగుల్ ప్రవేశపెట్టింది. కీలక పదం లను, డొమైన్ పేర్లను, విషయాలను మరియు ప్రాంతాలను గురి పెట్టే అంశాలను ప్రకటన పదాలు నియంత్రణ ప్యానల్ ను ఉపయోగించి ప్రకటనకర్తలు నమోదు చేసుకోవచ్చు. వారి ప్రకటనలను గూగుల్ తమ కంటెంట్ నెట్వర్క్ లో సంబంధిత సైట్ లలో చూపిస్తుంది. డొమైన్ పేర్లకు గురి పెట్టినప్పుడు, వాటికి సంబంధిత సైట్ ల జాబితాను కూడా గూగుల్ అందిస్తుంది. సైట్ టార్గెటింగ్ కొరకు, ప్రకటనకర్తలు కాస్ట్ పెర్ ఇంప్రెషన్ (సిపిఎం) లేదా కాస్ట్ పర్ క్లిక్ పద్ధతిలో బిడ్ చేయవచ్చు.[13]

ప్లేస్మెంట్ టార్గెటింగ్ తో, ఒక ప్రకటన బ్లాక్ ను, 2 - 4 ప్రకటనలుగా విభజించకుండా, ఒక్క యాడే మొత్తం బ్లాక్ ను ఆక్రమించే అవకాశం లభిస్తుంది. దీని వలన ప్రకటనకర్త ఎక్కువ ద్రుశ్యత్వము పొందవచ్చు.

ప్లేస్మెంట్ ను గురి పెట్టే ప్రచారాలకు కనీస ధర వెయ్యి ఇంప్రెషన్ లకు 25 సెంట్లు. అయితే, సిపిసికి కనీస బిడ్ ఏమీ లేదు.

ప్రకటన పదాలు పంపిణీ[మార్చు]

www.google.com లో చూపించబడటానికి అన్ని ప్రకటన పదాలు అర్హత కలిగినవే. గూగుల్ యొక్క భాగస్వామి నెట్వర్క్ లలో తమ ప్రకటనలను చూపించడానికి ప్రకటనకర్తలకు అవకాశం ఉంది. "శోధన నెట్వర్క్"లో ఏఓఎల్ AOL సెర్చ్, ఆస్క్.కాం, మరియు నెట్‌స్కేప్ ఉన్నాయి. www.google.com మాదిరిగానే ఈ శోధన ఇంజిన్ లు కూడా వినియోగదారుడు శోధనకు ఫలితంగా ప్రకటన పదాలు ప్రకటనలను చూపిస్తాయి కాని అవి నాణ్యత స్కోరును ప్రభావితం చేయవు.

"గూగుల్ డిస్‌ప్లే నెట్వర్క్" (గతములో "కంటెంట్ నెట్వర్క్" అని పేర్కొనబడేది) శోదన ఇంజిన్ లు కాని సైట్ లలో ప్రకటన పదాలు ప్రకటనలను చూపిస్తుంది. ఈ కంటెంట్ నెట్వర్క్ సైట్ లు గూగుల్ ప్రకటన నమూనా యొక్క మరో వైపు ఉన్న ప్రకటన‌సెన్స్ మరియు డబుల్‌క్లిక్ వంటి అంశాలను వాడుతాయి. తమ వెబ్‌సైట్ లలో ప్రకటనలను చూపించి డబ్బ సంపాదించాలని అనుకునే వెబ్‌సైట్ యజమానులు ప్రకటన సెన్స్ ను వాడుతారు. క్లిక్‌త్రూ రేట్లు శొధన నెట్వర్క్ లో ఉన్నదానికంటే డిస్‌ప్లే నెట్వర్క్ లో చాలా తక్కువగా ఉంటాయి. అందువలన ప్రకటనకర్త యొక్క నాణ్యత స్కోరును లెక్కించినప్పుడు వీటిని పరిగణములోకి తీసుకోరు. ఒక వెబ్‌సైట్ తమ గురించి ప్రకటన ఇచ్చుకున్నప్పుడు, ప్రకటన సెన్స్, ప్రకటన వర్డ్స రెండిటిని వాడితే, ఆ వెబ్‌సైట్ గూగుల్ కు కమిషన్ ఇవ్వవలసి రావచ్చు.[14]

పేజీల విషయాన్ని గూగుల్ అదంతట అదే గ్రహించి, ప్రకటనకర్తల కీలక పదం జాబితాలను బట్టి సంబంధిత ప్రకటనలను చూపిస్తుంది. వారి ప్రకటన యూనిట్ల పనితీరును మెరుగు పరచడం కొరకు ప్రకటన‌‌సెన్స్ ప్రచురణకర్తలు పేజీలలో గూగుల్ ప్రకటన ప్రదర్శించే స్థలాలను నిర్ణయించడానికి అవసరమైన మార్గాలను ఎన్నుకోవచ్చు. గూగుల్ నెట్వర్క్ లో వాచక ప్రకటనలు, చిత్ర ప్రకటనలు (బ్యానర్ ప్రకటనలు), మొబైల్ వాచక ప్రకటనలు, ఇన్-పేజ్ వీడియో ప్రకటనలు వంటి వివిధ రకాల ప్రకటనలు ప్రదర్శించబడవచ్చు.

గూగుల్ ప్రకటన పదాలకు ప్రధాన పోటీదారులు యాహూ! సెర్చ్ మార్కెటింగ్ మరియు మైక్రోసాఫ్ట్ ప్రకటన సెంటర్.

ప్రకటన పదాలు ఖాతా నిర్వాహణ[మార్చు]

ప్రకటన పదాలు ఖాతాదారులు వారి ఖాతాను ఏర్పరుచుకోవడములో, నిర్మించడములో మరియు నిర్వహించడములో ఉన్న క్లిష్టతను దృష్టిలో పెట్టుకుని, శోధన ఇంజిన్ మార్కెటింగ్ సంస్థలు మరియు సలహాదారులు దీనిని ఒక వ్యాపార సేవ మాదిరిగా అందిస్తున్నారు. దీని వలన ప్రకటనా రంగములో అనుభవం లేని సంస్థలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ప్రేక్షకులకు తమ ప్రకటనలను చేర్చవచ్చు. గూగుల్ అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్స్ అనే ప్రోగ్రాంను గూగుల్ ప్రారంభించింది. దీని ద్వారా నిర్దేశించిన అర్హత కలిగి ఉండి ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఏజెన్సీలు మరియు సలహాదారులకు గూగుల్ గుర్తింపు ఇస్తుంది.[15] ప్రకటన పదాలు ఎడిటర్ అనే ఖాతా నిర్వాహణ సాఫ్ట్‌వేర్ ను కూడా గూగుల్ అందిస్తుంది.

గూగుల్ అందిస్తున్న మరొక ఉపయోగకరమైన అంశం, మై క్లయంట్ సెంటర్. ఇది గూగుల్ ప్రొఫెషనల్స్ కు (పరీక్షలో గాని బడ్జట్ అంశాలలో ఇంకా ఉత్తీర్ణత అవ్వని వారికి కూడా) అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా గూగుల్ ప్రొఫెషనల్ కు పలు ఖాతాలకు అందుబాటు లభిస్తుంది. వారు ప్రతి ఖాతాలో లాగ్ ఇన్ అవ్వకుండానే ఒక ఖాతా నుంచి మరొక దానికి వెళ్లవచ్చు.

ఒక నిర్ణీతమైన వెబ్‌సైట్ లేదా కీలక పదానికి సంబంధించిన కీలక పదం లను గూగుల్ ప్రకటన పదాలు కీలక పదం టూల్ అందిస్తుంది.[16]

క్లిక్-టు-కాల్[మార్చు]

గూగుల్ క్లిక్-టు-కాల్ అనే సేవను గూగుల్ గతములో అందించేది. దీని వలన గూగుల్ శోధన ఫలితాల పేజీల నుంచి వినియోగదారులు ప్రకటనకర్తలకు కాల్ చేయడానికి వీలవుతుంది. వినియోగదారులు తమ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేస్తారు. అప్పుడు గూగుల్ వాళ్లను తిరిగి కాల్ చేసి, ప్రకటనకర్తలకు కనెక్ట్ చేస్తుంది. కాల్ చార్జీలను గూగులే భరిస్తుంది. ఇది 2007లో నిలిపివేయబడింది.[17] కొంత కాలం, ఇదే తరహా క్లిక్-టు-కాల్ అంశం గూగుల్ పటములు (గూగుల్ మ్యాప్స్) ఫలితాలలో అందుబాటులో ఉండేది. గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం యొక్క ఫ్రోయో విడుదలలో, ఇదే తరహా అంశం ఒకటి ఉంది. దీని ద్వారా వినియోగదారుడు ఒక ప్రకటనకర్తను సులభముగా కాల్ చేయవచ్చు.

చరిత్ర[మార్చు]

ఈ ఆలోచనను ముందుగా కనిపెట్టింది ఇడియాల్యాబ్ కు చెందిన బిల్ గ్రాస్. ఇతను ఆ ఆలోచనను యెల్లో పేజస్ నుండి తీసుకున్నాడు. గూగుల్ ఆ ఆలోచనను కొనాలని అనుకున్నది కాని ఒప్పందం కుదరలేదు.[ఆధారం కోరబడింది] కాని ఈ తరహా ప్రకటనా పద్ధతిని పోగొడ్డుకోవటానికి ఇష్టం లేక, 2000లో సంస్థ తన స్వంత ఉత్పాదన అయిన ప్రకటన పదాలను ప్రవేశపెట్టింది.[18] బిల్ గ్రాస్ రూపొందించినదానికి ప్రకటన పదాలకు చాలా దగ్గర పోలికలు ఉండటంతో, ఇరు వర్గాల మధ్య చట్టపరమైన చర్య మొదలయింది. ఎట్టకేలకు, ఆ వివాదం న్యాయస్థానం బయట పరిష్కారమయింది.[ఆధారం కోరబడింది]

మొట్ట మొదట్లో, ప్రకటన పదాలు ప్రకటనకర్తలు నెలవారీ చెల్లింపులు చేసేవారు. గూగుల్ వారి ప్రచారాన్ని ఏర్పాటు చేసి, నిర్వాహణ చేసేది. చిన్నతరహా వ్యాపారాలు చేసేవారు మరియు ఎవరి ప్రచారాన్ని వారే నిర్వాహణ చెయ్యాలని అనుకునేవారి కోసం ప్రకటన పదాలు సెల్ఫ్-సర్వీస్ పోర్టల్ ను గూగుల్ ప్రవేశపెట్టింది. ప్రకటనకర్తలు తమ ప్రచారాన్ని నిర్వహించడములో సహాయపడటానికి 2005 నుంచి జంప్‌స్టార్ట్[19] అనే ఒక ప్రచారం నిర్వాహణ సేవను గూగుల్ అందిస్తుంది. అయితే, ఈ సేవ ఇప్పుడు అందుబాటులో లేదు కనుక సహాయం కావలసిన సంస్థలు మూడో-పక్ష సేవలు అందించేవారిని పెట్టుకోవాలి.

గూగుల్ అడ్వర్‌టైజింగ్ ప్రొఫెషనల్స్ (GAP) ప్రోగ్రాంను గూగుల్ 2005లో ప్రవేశపెట్టింది. ప్రకటన పదాలు శిక్షణ పూర్తి చేసి, ఒక పరీక్షలో ఉత్తీర్ణత అయినవారికి ఈ ప్రోగ్రాం గుర్తింపు ఇస్తుంది. ప్రకటన పదాల యొక్క క్లిష్టత వలన మరియు పెద్ద మొత్తములో డబ్బు వచ్చే అవకాశం ఉన్నందున, కొందరు ప్రకటనకర్తలు ఒక సలహాదారుడును పెట్టుకుని తమ ప్రచారాన్ని నిర్వహిస్తారు.

గూగుల్ ఆన్‌లైన్ మార్కెటింగ్ చేలంజ్ (http://www.google.com/onlinechallenge/)ను గూగుల్ 2008లో ప్రవేశపెట్టింది. త్రుతీయ విద్యార్థులకు ఇది ఒక తరగతి విద్యాభ్యాసము. 2008లో 47 దేశాల నుంచి 8,000కు పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా, 2009లో 58 దేశాల నుంచి 10,000కు పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీ ప్రతి ఏడాది సుమారుగా జనవరి నుంచి జూన్ వరకు జరుగుతుంది.Registration విద్యార్థి స్థాయి కంటే కూడా అధ్యాపకుల స్థాయిలోనే ఉంటుంది.

2009లో ప్రకటన పదాలు ఇంటర్‌ఫేస్ ను గూగుల్ సవరించి, గూగుల్ మ్యాప్స్ మరియు వీడియో ప్రకటనస్ కొరకు స్థానిక వ్యాపార ప్రకటనలను ప్రవేశ పెట్టింది.

చట్టపరమైన నేపథ్యం[మార్చు]

వ్యాపారచిహ్నం చట్టం సంబంధంగాను (గూగుల్ ఇంకార్పరేషన్ v. ఏఎం. బ్లైండ్ & వాల్‌పేపర్ ఫాక్టరి మరియు రెస్‌క్యూ కార్ప్. v. గూగుల్ ఇంకార్పరేషన్ లను చూడండి), మోసం (గొడ్డార్డ్ v. గూగుల్ ఇంకార్పరేషన్ ను చూడండి) మరియు క్లిక్ మోసం అను విషయాలలో ప్రకటన పదాలు చట్టపరమైన దావాలకు దారి తీసింది. 2006లో గూగుల్ ఒక క్లిక్ మోసం దావాను US$90 మిలియను చెల్లించి పరిష్కరించింది.[20]

ప్రకటన పదాలు సేవ సంబంధంగా ఓవర్‌ట్యూర్ సర్వీసస్ ఇంకార్పరేషన్ సంస్థ గూగుల్ పై పేటెంట్ ఉల్లంఘనకు గాను దావా వేసింది. యహూ!ఓవర్‌ట్యూర్ ను కొనుగోలు చెయ్యడముతో, 2004లో గూగుల్ ఈ దావాను పరిష్కరించుకుంది. దీని ప్రకారం పేటెంట్ క్రింద శాశ్వత లైసెన్స్ పొందడానికి గూగుల్ 2.7 మిలియను ఉమ్మడి స్టాక్ షేర్లను యాహూకు ఇవ్వడానికి ఒప్పుకుంది.[21]

సాంకేతికం[మార్చు]

ప్రకటన పదాలు వ్యవస్థ మొదట్లో MySQL డేటాబేస్ ఇంజిన్ పై అమలు చేయబడింది. ఆ వ్యవస్థను ప్రారంభించిన అనంతరం ఓరాకిల్ ను వాడాలని నిర్వాహుకులు నిర్ణయించారు. అయితే, వ్యవస్థ చాలా నెమ్మదిగా మందముగా అయిపోవడముతో, మరల MySQL కే మార్చడం [2] జరిగింది. స్ప్రెడ్‌షీట్ ఎడిటింగ్, సెర్చ్ కొర్రి రిపోర్ట్స్ మరియు మెరుగైన కన్వెర్షన్ మ్యాట్రిక్స్ వంటి క్రొత్త అంశాలును కలిగి ఉండి పనితీరును మెరుగుపరచే విదముగా ఇంటర్‌ఫేస్ కూడా సవరించబడింది.

ప్రకటన కంటెంట్ ఆంక్షలు[మార్చు]

ఏప్రిల్ 2008 నుండి గమ్య యుఆర్ఎల్ నుండి ప్రదర్శించబడిన యుఆర్ఎల్ దారి మారడానికి గూగుల్ ప్రకటన పదాలు అనుమతించడం లేదు. ఈ ఆంక్షకు ముందు గూగుల్ పెయ్ద్ ప్రకటనలు శోధనా నెట్వర్క్ లో ప్రదర్శించబడిన యుఆర్ఎల్ నుంచి దారి మారి వేరొక పేజీకి వెళ్ళడానికి వీలు ఉండేది. ఈ విధాన మార్పుకు వినియోగదారుడు మరియు ప్రకటనకర్త నుండి అందిన ప్రతిస్పందనే కారణమని గూగుల్ వివరించింది. వినియోగదారులు ఏమనుకుని ప్రకటనలను క్లిక్జ్ చేస్తారో అదే పేజీ ప్రదర్శించబడాలనదే ఈ ఆంక్షకు కారణము. కొన్ని సార్లు, వినియోగదారులు తప్పు దారి పట్టించబడి, ప్రకటన పదాలు ప్రకటనకర్తలకు మరల గురి అయ్యేవారు.[22]

హార్డ్ ఆల్కహాల్ అమ్మకం పై ఉన్న ఆంక్షలను డిసంబర్ 2010లో గూగుల్ సడలించింది.[23] ప్రస్తుతం హార్డ్ ఆల్కహాల్ మరియు మద్యం అమ్మకానికి సంబంధించిన ప్రకటనలను గూగుల్ అనుమతిస్తుంది. ఇది డిసంబర్ 2008లో రూపొందించబడిన విధాన మార్పుకు కొనసాగింపు. అప్పుడు హార్డ్ ఆల్కహాల్ మరియు మద్యం బ్రాండుల ప్రకటనలను గూగుల్ అనుమతించింది.

అనుమతించబడిన కీలక పదాలు[మార్చు]

ప్రకటన పదాలు ప్రకటనకర్తలను ట్రేడ్‌మార్క్ కలిగిన కీలక పదాలు పై బిడ్ చేయడానికి అనుమతించినందుకు గూగుల్ పై విమర్శలు వచ్చాయి. వివిధ రకాల శోధనా పదాల పై బిడ్ చేయడానికి 2004లో యుఎస్ మరియు కెనడా దేశాలలో గూగుల్ ప్రకటనకర్తలను అనుమతించడం ప్రారంభించింది. దీనిలో పోటీదారుల ట్రేడ్‌మార్కులు కూడా ఉన్నాయి.[24] మే 2008లో ఈ విధానాన్ని యుకే మరియు ఆయర్లాండ్ లకు విస్తరించింది. ఒక సంస్థ యొక్క ట్రేడ్‌మార్క్ అడ్వర్‌టైజింగ్ లీగల్ సపోర్ట్ టీం వద్ద నమోదు చేయబడి ఉంటే, ఆ ట్రేడ్‌మార్క్ లను ఇతర సంస్థల ప్రకటనకర్తలు తమ ప్రకటన వాచకములో వాడరాదు. అయితే, ఔషదాలకు సంబంధించిన కీలక పదాలు వంటి నియంత్రించబడిన కీలక పదంసను ఉపయోగించడానికి సర్టిఫికేషన్ ఉండాలని గూగుల్ పేర్కుంటుంది. హ్యాకింగ్ వంటి కొన్ని కీలక పదాలు పూర్తిగా నిషేధం. ఈ నియంత్రణలు ప్రాంతాలను బట్టి మారవచ్చు.[25] జూన్ 2007 నుంచి విద్యార్థులకు వ్యాస రచనా సేవల కొరకు ఇవ్వబడే ప్రకటన పదాలు ప్రకటనలను గూగుల్ నిషేధించింది. ఈ చర్యను విశ్వవిద్యాలయాలు ఆహ్వానించాయి.[26]

గూగుల్ కొన్ని ఇతర నియంత్రణలను అమలు చేస్తుంది. ఉదాహరణకు, ఫేస్‌బుక్ కు సంబంధించిన పుస్తకము కొరకు ప్రకటన పదాలలో ప్రకటన చేయడం నిషేధం. ఎందుకంటే శీర్షికలో "ఫేస్‌బుక్" అనే పదం వస్తుంది కనుక - ట్రేడ్‌‌మార్క్ పేరును శీర్శకలో వాడే ప్రకటనలు నిషేధం.[27]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ప్రకటన‌సెన్స్
 • గూగుల్ టూల్స్ మరియు సేవల జాబితా
 • క్లిక్ మోసం
 • శోధనా యంత్రాలు అమ్మడం
 • సెంట్రల్ ప్రకటన సర్వర్
 • పనితీరు-ఆధారిత ప్రకటన
 • శొధనా అనలిటిక్స్

సూచనలు[మార్చు]

 1. [1]
 2. "Financial Tables". Google Investor Relations. Retrieved 2008-01-31. 
 3. గూగుల్ యొక్క మిచిగన్ కార్యాలయ - గూగుల్ - ఇన్ఫర్మేషన్‌వీక్
 4. గూగుల్ ప్రకటన పదాలు HQ యొక్క లోపరి దృశ్యం > > వివేకముగల ఎంటర్‌ప్రైజ్: వ్యాపార నిర్ణయాలకు మెరుగైన లోచూపు
 5. 6.3
 6. "How are ads ranked? - AdWords Help". adwords.google.com. Retrieved 2010-02-18. 
 7. "How do I create a high quality landing page? - AdWords Help". adwords.google.com. Retrieved 2010-02-18. 
 8. "Landing Page and Site Quality Guidelines - AdWords Help". adwords.google.com. Retrieved 2010-02-18. 
 9. బెంజమిన్ ఎడేల్మన్, మిచెల్ ఓస్‌ట్రోవ్స్‌కి, మరియు మిచెల్ స్చ్వర్జ్: "ఇంటర్నెట్ ప్రకటనలు మరియు సాధరణమైన రెండవ-ధర వేలం: బిలియన్ల విలువగల కీలక పదంస ను అమ్మడం". అమెరికన్ ఎకనామిక్ రివ్యూ 97(1), 2007 పిపి 242-259.
 10. హాల్ ఆర్. వరియన్: "పొసిషన్ వేలాలు". ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్, 2006, doi:10.1016/j.ijindorg.2006.10.002 .
 11. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3472: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 12. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3472: bad argument #1 to 'pairs' (table expected, got nil).
 13. "How do CPC and CPM ads compete with each other? - AdWords Help". adwords.google.com. Retrieved 2010-02-18. 
 14. "BE CAREFUL when using both AdSense + AdWords by Google". 2009-02-19. 
 15. "Google Advertising Professionals". adwords.google.com. Retrieved 2007-05-30. 
 16. "Google Adwords Keyword Tool". savvyk.com. 
 17. http://googlesystem.blogspot.com/2007/07/google-discontinues-click-to-call-and.html
 18. గూగుల్ మైల్‌రాళ్ళు
 19. పదాలు.google.com/support/bin/answer.py?answer=6935&topic=88 What is Jumpstart?
 20. Associated Press (2006-03-08). "Google settles advertising suit for $90 million". MSNBC. 
 21. గూగుల్, యాహూ చట్ట ఘర్షణను విరమించుకున్నాయి, స్టేఫానే ఒల్సేన్, CNET న్యూస్.కాం, ఆగష్టు 9, 2004
 22. పదాలు.google.com/support/bin/answer.py?answer=91451&hl=en_GB సవరించబడిన డిస్‌ప్లే యుఅర్‌ఎల్ విధానం గురించి మేను ఏమి తెలుసుకోవాలి? - గూగుల్ హెల్ప్ సెంటర్
 23. ఆల్కహాల్ పై ప్రకటన పదాలు ప్రకటనా విధానములో మార్పు
 24. Stefanie Olsen (2004-04-13). "Google plans trademark gambit". CNET. Archived from the original on 2012-07-16. 
 25. "Google AdWords Help Center". Google. Retrieved 2007-12-08. 
 26. "Google bans essay writing adverts". BBC News. 2007-05-22. Retrieved 2008-05-23. 
 27. Letzing, John (2008-07-12). "Facebook haunted by mild-mannered specter". Dow Jones Marketwatch. Retrieved 2008-10-29. 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Google Inc.