గూడపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూడపాడు
—  రెవిన్యూ గ్రామం  —
గూడపాడు is located in Andhra Pradesh
గూడపాడు
గూడపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°13′19″N 80°54′04″E / 16.222°N 80.901°E / 16.222; 80.901
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,131
 - పురుషులు 543
 - స్త్రీలు 588
 - గృహాల సంఖ్య 385
పిన్ కోడ్ 521136
ఎస్.టి.డి కోడ్ 08671

గూడపాడు, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 136., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

మొవ్వ మండలం[మార్చు]

మొవ్వ మండలంలోని అయ్యంకి, కూచిపూడి, గుడపాడు, పెదపూడి, పెదశనగలూరు, బార్లపూడి, భట్లపెనుమర్రు, మొవ్వ, యద్దనపూడి, వేములమాడ గ్రామాలు ఉన్నాయి.

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో పెనుమత్చ, తెలుగురావుపాలెం, మొవ్వ, ఘంటసాలపాలెం, ఘంటసాల గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పమిడిముక్కల, ఘంటసాల, చల్లపల్లి, కొల్లూరు

రవాణా సౌకర్యాలు[మార్చు]

కూచిపూడి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయవాడ 49 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల (SW),గూడపాడు

గ్రామ విశేషాలు[మార్చు]

గూడపాడు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి కూచిభొట్ల వెంకటశివభరత్ కుమార్, చిన్నతనం నుండియే కరాటే క్రీడపై మక్కువతో, ఆ క్రీడలో శిక్షణ పొంది, జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీలలో విజయాలు నమోదు చేయుచూ ప్రశంసలనందుకుంటున్నాడు. ప్రపంచ కరాటే సమాఖ్య పోటీలలో పాల్గొనడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. [2] ఈ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి కె.వి.ఎస్.భరత్ కుమార్, 2016,అక్టోబరు-23న గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేటలో నిర్వహించిన ఆల్ ఇండియా ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి, స్వర్ణపతకం సాధించాడు. ఆంధ్రప్రదేశ్ షిటోరియాఖాన్ ఇండియా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. [3]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1081.[3] ఇందులో పురుషుల సంఖ్య 520, స్త్రీల సంఖ్య 561, గ్రామంలో నివాసగృహాలు 295 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 320 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,131 - పురుషుల సంఖ్య 543 - స్త్రీల సంఖ్య 588 - గృహాల సంఖ్య=385.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Gudapadu". Retrieved 24 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-17; 23వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,అక్టోబరు-25; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=గూడపాడు&oldid=3291928" నుండి వెలికితీశారు